S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/02/2017 - 20:06

బాలీవుడ్ హాట్ పోర్న్ పాప.. సన్నీ అంటే ఎలాంటి క్రేజ్ వుందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ క్రేజ్ రోజురోజుకూ పెరుగుతూనే వుంది తప్ప ఎక్కడా తగ్గడంలేదు. ఇది నిజం.. కావాలంటే ప్రూప్స్ కూడా వున్నాయి. బాలీవుడ్‌లో ఉన్న గ్లామర్ భామలను పక్కకు నెట్టేసి మొదటి స్థానం చేరుకుంది సన్నీ. మొత్తానికి ఈ ఏడాది పూర్తి కావస్తోంది.

12/02/2017 - 20:05

ఒక లైలాకోసం అంటూ తెలుగు తెరపైకివచ్చిన పూజా హెగ్డే కోలీవుడ్, బాలీవుడ్‌లోనూ అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ ఎక్కడా సరైన హిట్స్ అందకపోవడంతో ‘దువ్వాడ జగన్నాథం’తో ఎంట్రీ ఇచ్చింది. సినిమా రిజల్ట్ ఎలా వున్నా బికినీలో సందడి చేసిన ఈ అమ్మడికి ఆఫర్లు బాగానే వస్తున్నాయి. తన అందంతోనే అవకాశాలను దక్కించుకుంటోంది. ప్రస్తుతం తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్‌తో ‘సాక్ష్యం’ చిత్రంలో నటిస్తోంది.

12/02/2017 - 20:03

గోపీచంద్, రాశీఖన్నా, అను ఇమ్మాన్యుయేల్ ప్రధాన తారాగణంగా ఎ.ఎం.జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆక్సిజన్‌‘ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎస్.ఐశ్వర్య నిర్మించారు. సినిమా గురించి రత్నం మాట్లాడుతూ- ఆక్సిజన్ చిత్రానికి వస్తున్న స్పందన బాగుంది. విడుదలైన రోజు నుండి నేటివరకు కలెక్షన్లు పెరుగుతూనే వున్నాయి.

12/02/2017 - 20:02

సూర్య హీరోగా వేగ్నేశ్ శివన్ దర్శకత్వంలో వస్తోన్న సినిమా ‘తాన సేరందకూటం’. తెలుగులో ఈ సినిమా టైటిల్ ‘గ్యాంగ్’. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా తమిళ వర్షన్ టీజర్‌కు మంచి స్పందన లభించింది. ఈ రోజు విడుదల చేసిన ఈ తెలుగు ఫస్ట్‌లుక్ పోస్టర్ బాగుం ది.

12/02/2017 - 20:00

అనేక తెలుగు, తమిళ చిత్రాలకు నృత్య దర్శకత్వం వహించిన ధర్మరాజు (97) అనారోగ్యంతో కన్నుమూశారు. నస్రుల్లాబాద్ మండలం అంకోల్ కాంప్‌లో అనారోగ్యంతో ఆయన కన్నుమూశారు. ఆయన మరణవార్త తెలుసుకున్న ప్రభుదేవా అక్కడికి చేరుకుని తన గురువు భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. అంత్యక్రియలలో పాల్గొన్నారు.

12/02/2017 - 19:59

బిగ్ బి అమితాబ్‌బచ్చన్ ఇటీవల చాలా ఇబ్బందికి గురైన ఓ సన్నివేశాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఇటీవల గోవాలో జరిగిన ఐఫా చిత్రోత్సవంలో ఆయన ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన అక్షయ్‌కుమార్, అమితాబ్ స్టేజిపైకి వచ్చేముందు కాళ్ళకు వంగి నమస్కరించబోయారట. వెంటనే అక్షయ్‌ని వారించి ఆలింగనం చేసుకుని బిగ్ బి వెళ్లిపోయారు.

12/02/2017 - 19:57

నిఖిల్ హీరోగా ఎ.కె ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వస్తున్న రూపుదిద్దుకుంటున్న ‘కిర్రాక్ పార్టీ’ ఫస్ట్‌లుక్ ఇదే.. నిఖిల్ 15వ చిత్రం వస్తున్న ఈ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర నిర్మిస్తుండగా, శరన్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. కాలేజీ బ్యాక్ డ్రాప్‌లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి సంబంధించి దాదాపు 70శాతం షూటింగ్ పూర్తయింది.

12/02/2017 - 19:56

రామ్‌సాయి గోకులం క్రియేషన్స్ పతాకంపై గంగాధర్, రేణుక, హరీశ్ వినయ్, హారిక ప్రధాన తారాగణంగా ఆనంద్ సాగర్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ఆకలి పోరాటం’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈవారంలో విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన పోస్టర్ విడుదల కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లో జరిగింది.

12/02/2017 - 19:55

సుమంత్ కథానాయకుడిగా స్వధర్మం ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై గౌతమ్ తిన్నసూరి దర్శకత్వంలో రాహుల్ నక్క రూపొందించిన చిత్రం ‘మళ్లీరావా’. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. క్లీన్ యూ సర్ట్ఫికెట్ పొందిన ఈ సినిమా డిసెంబర్ 8న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ- ఇటీవల ఆడియోను వైజాగ్‌లో విడుదల చేయగా, మంచి ఆదరణ లభిస్తోందని తెలిపారు.

12/02/2017 - 19:55

నందు, శ్రీముఖి జంటగా డి.బి.వై మూవీస్ పతాకంపై వి.ఎస్.వాసు దర్శకత్వంలో దాసరి భాస్కర్ యాదవ్ రూపొందిస్తున్న సినిమా ‘కుటుంబ కథా చిత్రం’. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల కార్యక్రమం శనివారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. నిర్మాత శివకుమార్ ట్రైలర్‌ను విడుదల చేశారు.

Pages