S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

02/18/2016 - 22:53

ప్రముఖ సీనియర్ దర్శకుడు రవిరాజా పినిశెట్టి తనయుడు సత్యప్రభాస్ తండ్రి దారిలోనే దర్శకుడిగా మారాడు. ఆయన తొలిసారి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మలుపు’ ఆది పినిశెట్టి, నిక్కీ గర్లాని జంటగా తెర కెక్కిన ఈ చిత్రం ఈ రోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు సత్యప్రభాస్ చెప్పిన విశేషాలు:

02/18/2016 - 22:49

కమెడియన్ ధన్‌రాజ్ పదమూడు పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పనిలేని పులిరాజా’. చాచా దర్శకత్వంలో పాలెపు మీడియా పతాకంపై పి.వి.నాగేశ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలోనే విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, ‘్ధన్‌రాజ్ సోలో హీరోగా నటిస్తున్న సినిమా ఇది. ప్రాచీ సిన్హాతోపాటు నలుగురు హీరోయిన్లు ఉంటారు. ప్రస్తుతం సెన్సార్ జరుగుతోంది.

02/18/2016 - 22:44

తారకరత్న, శేఖర్, యామిని, చందూ ప్రధాన పాత్రల్లో వెంకటరమణ సల్వా దర్శకత్వంలో ముప్ప క్రాంతి చిత్ర పతాకంపై ముప్ప అంకమ్మ చౌదరి నిర్మిస్తున్న ‘ఎవరు’ చిత్రం టీజర్ ఆవిష్కరణ గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో తారకరత్న మాట్లాడుతూ ఇప్పటివరకు ఇలాంటి కథ రాలేదని, ఈ సినిమాలో హీరోహీరోయిన్ అని కాకుండా, ఉన్న పాత్రలన్నీ లీడ్ రోల్ పోషించాయని అన్నారు.

02/17/2016 - 23:03

భవ్యశ్రీ ప్రధాన పాత్రలో ఎస్.ఎస్.ఎస్. ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై బాలగొండ ఆంజనేయులు దర్శకత్వంలో పెద్దరాసు సుబ్రహ్మణ్యం రూపొందించిన చారిత్రాత్మక చిత్రం ‘సతీ తిమ్మమాంబ’. భారీ గ్రాఫిక్స్‌తో ముస్తాబైన ఈ చిత్రాన్ని మహాశివరాత్రి కానుకగా విడుదల చేయనున్నారు.

02/17/2016 - 22:58

ప్రస్తుతం టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా దూసుకుపోతోంది రకుల్‌ప్రీత్‌సింగ్. వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తూ వరుస విజయాలు అందుకుంటున్న ఈ భామ, ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన సరైనోడు చిత్రంలో నటిస్తోంది.

02/17/2016 - 22:57

సినిమాలు కలసిరాకపోవడంతో ఇప్పుడు హోటల్ బిజినెస్ వైపు అడుగులువేసింది కృతికర్బందా. ఇప్పటికైనా మంచిపని చేశావని మిత్రులు ఆమెను ప్రోత్సహిస్తుండటంతో ఇందులోనైనా రాణించాలని తాపత్రయపడుతోంది. టాలీవుడ్‌లో ‘బోణీ’ అనే చిత్రంతో తెరంగేట్రం చేసిన కృతికర్బందాకు విజయంలో మాత్రం బోణీ కాలేదు. అప్పటినుండి కెరీర్‌లో అనేక ఒడుదుడుగులు ఎదుర్కొన్న కృతి అటు కన్నడలో, ఇటు తమిళంలో అవకాశాలకోసం ప్రయత్నించింది.

02/17/2016 - 22:55

బాలీవుడ్ నటి ప్రియాంకచోప్రాకు హాలీవుడ్ సినిమాలో నటించే అవకాశం లభించింది. ఇప్పటికే అమెరికా టివి షో ‘క్వాంటికో’లో నటించి ఆదరణ పొందిన ప్రియాంక ఇప్పుడు హాలీవుడ్ సినిమాలో నటించనుంది. అయితే హీరోయిన్‌గా కాదు. ఆమె ప్రతినాయిక పాత్రలో కన్పిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ వచ్చేవారం ప్రారంభమవుతుంది.

02/17/2016 - 22:51

‘సినిమా అంటేనే బిజినెస్. నాలుగు డబ్బుల కోసమే సినిమా తీసేది. అంతేకాని, మనం తీశాం, అమ్మేశాం అనుకుంటే, కొనుక్కున్నవాడు నాశనమవుతాడు. అలాంటి సినిమా చేయకూడదు’ అని అంటున్నాడు ప్రముఖ నిర్మాత దిల్‌రాజు. తాజాగా ఆయన నిర్మిస్తున్న చిత్రం ‘కృష్ణాష్టమి’.

02/17/2016 - 22:47

మహేష్‌బాబు కెరీర్‌లో ‘పోకిరి’ సినిమా సంచలన విజయం సాధించి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమాతో మహేష్-పూరిల కాంబినేషన్‌కు మంచి క్రేజ్ దక్కింది. ఆ తరువాత వచ్చిన ‘బిజినెస్‌మెన్’ కూడా సంచలన విజయం సాధించడంతో మళ్లీ వీరి కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడనే ఆసక్తి అందరిలో మొదలైంది.

02/17/2016 - 22:45

‘రన్ రాజా రన్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సంగీత దర్శకుడు జీబ్రాన్. ఆ తరువాత ‘జిల్’ సినిమాకు కూడా పనిచేశాడు. ప్రస్తుతం పలు అవకాశాలు అందిపుచ్చుకుంటున్న సంగీత దర్శకుడు వెంకటేష్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ సందర్భంగా జీబ్రాన్ చెప్పిన విశేషాలు ఆయన మాటల్లో...
రొమాంటిక్ సినిమాగా..

Pages