S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/24/2017 - 20:05

ప్రస్తుతం ఉన్న మాధ్యమాల్లో సోషల్ మీడియా అతివేగంగా విస్తరిస్తున్న విషయం తెలిసిందే. దీంతో టాలెంట్ ఉన్న నటీనటులు, దర్శకులు ఈ మాధ్యమం ద్వారా తమ ప్రతిభను చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈమధ్య కాలంలో వెబ్ సిరీస్‌పై ఎక్కువ దృష్టిపెడుతున్నారు కొంతమంది కొత్త దర్శకులు.

11/24/2017 - 20:03

మోహన్‌కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని హీరోగా శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ‘జెంటిల్‌మేన్’ చిత్రం ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే. ఇప్పుడు ఆ దర్శక నిర్మాతలు మరోసారి కలిసి సినిమా చేస్తున్నారు. సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న ఈ తాజా చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో జరిగాయి.

11/24/2017 - 20:02

దక్షిణాదిలో హాట్ అందాల పలు ఐటెం సాంగ్‌లు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది లక్ష్మీరాయ్. ప్రస్తుతం ఆమె కీ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘జూలీ-2’. అప్పట్లో సంచలనం సృష్టించిన జూలీ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫొటోలు ప్రేక్షకుల్ని గిలిగింతలు పెడుతున్నాయి. ఇందులో లక్ష్మీరాయ్ అందాల విందు ఓ రేంజ్‌లో వుంటుందని ప్రచారం జరుగుతోంది.

11/23/2017 - 19:56

ప్రస్తుతం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రంలో నటిస్తున్నాడు అల్లు అర్జున్. వక్కం తం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కుతున్న ఈ చిత్రం తరువాత అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాకు అప్పుడే సన్నాహాలు జరుగుతున్నాయి. ఆయన తదుపరి చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో ఉంటుందని వార్తలు వస్తున్నాయి.

11/23/2017 - 19:55

ప్రస్తుతం అందాల భామల ఏకైక మంత్రం.. బికినీ! అందుకే హీరోయిన్‌గా క్రేజ్ తెచ్చుకోవాలంటే తప్పకుండా బికినీ ధరించాల్సిందే. అప్పుడే తన హాట్ హాట్ అందాలతో ప్రేక్షకులు ఫిదా అవుతారు అన్న నిజం తెలుసుకున్న ప్రతి హీరోయిన్ బికినీలో సొగసులు చూపించి వేడి పుట్టిస్తున్నారు. ఆ లిస్టులో పవన్‌కళ్యాణ్ హీరోయిన్ ఏ మాత్రం తగ్గడంలేదు. ప్రస్తుతం చేతిలో సినిమాలు బాగా తగ్గడంతో గ్లామర్ మంత్రాన్ని నమ్ముకుంది.

11/23/2017 - 19:52

సుమంత్, ఆకాంక్షా సింగ్ జంటగా గౌతమ్ తిన్న సూరి దర్శకత్వంలో శ్రీ నక్కా యాదగిరి స్వామి ఆశీస్సులతో స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రాహుల్ నక్కా నిర్మించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘మళ్లీ రావా’. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 8న విడుదలవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో టీజర్‌ను విడుదల చేశారు. అనంతరం దర్శకుడు గౌతమ్ మాట్లాడుతూ- ఇది నా మొదటి చిత్రం. రెండు సంవత్సరాల క్రితం కథ రాసుకున్నాను.

11/23/2017 - 19:51

వరుస విజయాలతో జోరుమీదున్న యువ హీరో శర్వానంద్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినీ పతాకంపై ప్రసాద్ చుక్కపల్లి, సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం.1 చిత్రం హైదరాబాద్‌లో గురువారం ప్రారంభం అయింది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత దిల్‌రాజు క్లాప్ కొట్టగా, కొరియోగ్రాఫర్ రాజు సుందరం కెమెరా స్విచ్చాన్ చేశారు. దర్శకుడు సుకుమార్ గౌరవ దర్శకత్వం వహించారు.

11/23/2017 - 19:49

ధర్మపథ క్రియేషన్స్ పతాకంపై వివేక్ ఆత్రేయను దర్శకుడిగా పరిచయం చేస్తూ శ్రీవిష్ణు, నివేదా పెతురాజ్ జంటగా డి.సురేష్‌బాబు సమర్పణలో తెరకెక్కిన ‘మెంటల్ మదిలో’ చిత్రం శుక్రవారం విడుదలవుతున్న సందర్భంగా నిర్మాత రాజ్‌కందుకూరి చెప్పిన విశేషాలు..

11/23/2017 - 19:48

నటి దీపికా పదుకొనె ముక్కును కోస్తామని బెదిరించారు. ఇది దుర్మార్గం. మధ్యలో ఆ అమ్మాయి ఏం తప్పు చేసింది. డబ్బు తీసుకుని వాళ్లు ఇచ్చిన పాత్రలో నటించింది. ఇలా ముక్కులు కోయటం మొదలుపెడితే భారతదేశంలో అంతా శూర్పణకలవలె మిగిలిపోతారు. మనం హైదరాబాద్‌లో మద్రాసులో ఇవ్వాళ సుఖంగా జీవిస్తున్నామంటే అందుకు రాజపుత్రుల త్యాగాలే కారణం. రాజపుత్ర జాతిని అవమానించే అధికారం సంజయ్‌లీలా భన్సాలీకి ఎక్కడిది?

11/22/2017 - 20:39

నాగచైతన్య కథానాయకుడిగా మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘సవ్యసాచి’. ఈ చిత్రానికి సంబంధించిన ఒక షెడ్యూల్ పూర్తిచేశారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో మాధవన్ ఓ కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు.

Pages