S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/12/2017 - 20:55

శ్రీ సిద్ధి వినాయక ప్రొడక్షన్స్ పతాకంపై వి.రామకృష్ణ దర్శకత్వంలో వి.ప్రవీణ్‌కుమార్ యాదవ్, వెంకట్ యాదవ్ రూపొందిస్తున్న చిత్రం ‘దర్పణం’. తనిష్క్‌రెడ్డి, అలెక్సియస్, శుభాంగి పంత్ ప్రధాన తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పాటను పూర్తిచేశారు.

11/12/2017 - 20:53

హాలీవుడ్‌లో ఓ బడా నిర్మాత హీరోయిన్స్‌ను వేధిస్తున్నాడనే విషయం బయటపడినప్పటినుండి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హీరోయిన్స్ అందరు వారు ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బయటపెట్టడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఇండియాలో అయితే సినీ హీరోయిన్స్ సోషల్ మీడియాలో ఎక్కువగా ఈ విషయం గురించి చెప్పారు. కొందరు మీడియా ముందుకు వచ్చి అప్పట్లో నేను కూడా అలాంటి చేదు అనుభవాలను ఎదుర్కొన్నానని చెప్పారు.

11/12/2017 - 20:51

బాబి సింహా, అమలాపాల్, ప్రసన్న ముఖ్యపాత్రల్లో సుశిగణేషన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దొంగోడొచ్చాడు’. ఏజిఎస్ ఎంటర్‌టైన్స్‌మెంట్స్ పతాకంపై తెలుగు-తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కల్పతి ఎస్. అఘోరన్, కల్పతి ఎస్. గణేష్, కల్పతి ఎస్. సురేష్‌లు నిర్మాతలు. ఈ చిత్రం డిసెంబర్‌లో విడుదలవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో పాటల ప్రదర్శన నిర్వహించారు.

11/11/2017 - 20:42

నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘జై సింహా’. బాలకృష్ణ సరసన నయనతార, నటాషా జోషీ, హరిప్రియలు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం వైజాగ్‌లో భారీ షెడ్యూల్ పూర్తిచేసుకొని త్వరలో మరో షెడ్యూల్‌లోకి సన్నద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సి.

11/11/2017 - 20:41

‘బాహుబలి’ లాంటి భారీ బడ్జెట్ చిత్రం ఎంత కష్టమో, పిల్లల సినిమాలు తీయడం కూడా అంతే కష్టమని, కొమరం భీమ్, గౌతమ్‌బుద్ధ, తూహీ మేరీ గంగ వంటి అవార్డు చిత్రాల నిర్మాత అల్లాణి శ్రీ్ధర్ అన్నారు.

11/11/2017 - 20:39

ప్రస్తుతం రోజుల్లో అతి తెలివిని ఉపయోగించి కొంద రు యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తున్న వీడియోలు చాలా వైరల్ అవుతున్నాయని అందరికీ తెలిసిన విషయమే. ఎక్కువగా సినీ తారలపై నెగెటివ్‌గా ప్రచారాలను చేస్తూ యూట్యూబ్‌లో చానెల్ పాపులారిటీని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రీసెంట్‌గా ఇదే తరహాలో టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావుపై కూడా ఎవరూ ఊహించనటువంటి కథనాలు వెలువడ్డాయి.

11/11/2017 - 20:38

ఎప్పటికప్పుడు వైవిధ్యమైన సినిమాలు చేయాలనే అనుకుంటా. మంచి కథ దొరికితే కమర్షియల్ చిత్రాలు చేయడానికి కూడా సిద్ధం. ఇదే సమయంలో దర్శకుడు పవన్ ‘బాలకృష్ణుడు’ కథతో వచ్చారు. నాపై నమ్మకంతో వచ్చినందుకు పూర్తి ఎఫర్ట్ పెట్టి నటించాను. నేను ఫిజిక్ పరంగా తగ్గానంటే ఆ క్రిడిట్ పవన్‌కే చెందుతుంది అని హీరో నారా రోహిత్ తెలిపారు.

11/11/2017 - 20:37

బాలల చిత్రాలు పిల్లలతో పాటుగా తల్లిదండ్రులలోనూ సామాజిక సమస్యలపట్ల అవగాహన పెంచేలా వుండాలని బాలల చిత్ర దర్శక నిర్మాత సంతోష్ పాండా అభిప్రాయం వ్యక్తం చేశారు. 20వ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవంలో భాగంగా ఆయన రూపొందించిన ‘శభాష్ బిజ్జు’ చిత్రాన్ని శనివారం ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఐమాక్స్ థియేటర్‌లో చలన చిత్రోత్సవ మీడియా సెంటర్‌లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు.

11/11/2017 - 20:35

నయనతా ర ఎప్పటికప్పుడు రిటైర్‌మెంట్ ప్రకటిద్దామనుకునే లోపు ఆమెకు అమాం తం స్టార్‌డమ్ వస్తోంది. క్రేజ్ తగ్గకపోవడంతో ఎప్పటికప్పుడు అవకాశాలందుకుంటూ అప్‌డేట్ అవుతోంది. ఇప్పటికే ఆమెతో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు కూడా సిద్ధమవుతున్నారు. ఆమె మాత్రం కోలీవుడ్‌పైనే తన ఫోకస్ పెట్టింది. దానికితోడు సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది.

11/11/2017 - 20:34

సంగీత దర్శకుడు చక్రవర్తి మనవడు రాజేష్ శ్రీచక్రవర్తి కథానాయకుడిగా రూపొందిస్తున్న చిత్రం ‘శివకాశీపురం’. సాయి హరీశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై హరీశ్ వట్టికూటి దర్శకత్వంలో మోహన్‌బాబు పులిమామిడి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. కథానాయికగా ప్రియాంక శర్మ నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన రెండో పాటను విడుదల చేశారు.

Pages