S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/10/2017 - 20:54

బాలల కేరింతలు.. నచ్చిన నటీనటులతో సెల్ఫీలు... ఇలా ఒకటేమిటి? ఎన్నో..ఎనె్నన్నో... చూడముచ్చటైన పిల్లల ఆనందోత్సవాలకు హద్దులే లేవు. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న 20వ
అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవంలో శుక్రవారం కనువిందు చేసిన దృశ్యాలివి.

11/10/2017 - 20:50

ఆదిత్య క్రియేటివ్ జీనియస్ అనే చిత్రాన్ని నిర్మించి చిన్నారులలో స్ఫూర్తినింపారు దర్శక నిర్మాత భీమగాని సుధాకర్‌గౌడ్. రెండేళ్ల కిందట విడుదలైన ఈ చిత్రం 100 శాతం వినోదపు పన్ను ను మినహాయింపును పొంది ప్రభుత్వ ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని బాలల చలన చిత్రోత్సవంలో ప్రదర్శిస్తున్నారు. చిత్రోత్సవాలలో ప్రదర్శనకు తెలుగు భాషనుండి ఎంపికైన 8 చిత్రాలలో ఆదిత్య కూడా వుంది.

11/10/2017 - 20:45

షాపింగ్ మాల్, జర్నీ, గీతాంజలి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, డిక్టేటర్ వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి తెలుగు, తమిళ సినీ రంగాల్లో కథానాయికగా తనదైన గుర్తింపును సంపాదించుకున్న బ్యూటీ అంజలి రెండు రెండు షేడ్స్‌లో నటించిన చిత్రం ‘అల్లుడు సింగం’. సత్యదేవ పిక్చర్స్ బ్యానర్‌పై విమల్, అంజలి జంటగా రూపొందుతున్న ఈ మాస్ ఎంటర్‌టైనర్‌ని రావిపాటి సత్యనారాయణ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

11/10/2017 - 20:43

అజయ్ ప్రధానమైన పాత్రలో రంగ, అక్షిత జంటగా నందలాల్ క్రియేషన్స్ పతాకంపై వాస్తవ్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘స్పెషల్’. ఈ చిత్రానికి సంబంధించిన క్లైమాక్స్ దృశ్యాలను షూటింగ్ పూర్తిచేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు వాస్తవ్ మాట్లాడుతూ- ఒక మనిషి తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడానికి తనకు వచ్చిన ఓ కళ ద్వారా ఎలా ప్రయత్నించాడు?

11/10/2017 - 20:41

సినిమా తారలంతా క్రికెటర్ల ప్రేమలో పడతారెందుకు? అని ప్రేక్షకులు ఎప్పుడూ అనుకుంటారు. కానీ వారు పిచ్‌లో ప్రదర్శించే క్రీడా నైపుణ్యమే అభిమానులుగా మారుస్తుందని, ఆ పైన ప్రేమికులుగా మారుతున్నారని గతంలో కొన్ని సంఘటనలు రుజువుచేశాయి. ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న అనుష్క కూడా ఓ క్రికెటర్ ప్రేమలో పడిపోయింది. తన అభిమాన క్రికెటర్ ఎవరో తెలియజేసింది.

11/10/2017 - 20:35

సమకాలీన వ్యక్తులపై రచనలు చేసినా బయోపిక్ నిర్మాణం జరిగినా చాలా సంయమనం కావాలి. పారదర్శకంగానూ నిష్పాక్షికంగానూ ఉండాలి. పరిశోధనాత్మకంగా లోతుగా అనే్వషించి నిర్మించాలి.

11/09/2017 - 20:00

హైదరాబాద్‌లో జరుగుతున్న 20వ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవాల్లో భాగంగా గురువారం నగరంలోని ఐమ్యాక్స్ థియేటర్ బాలల కేరింతలతో సందడే సందడిగా మారింది. దేశ, విదేశాలనుంచి డెలిగేట్స్, బాల నటీనటులు ఈ ఉత్సవంలో పాల్గొని పిల్లలను అలరించారు. ముఖ్యంగా ఈ వేడుకల్లో పాల్గొంటున్న బాలలు తమకు నచ్చినవారితో సెల్ఫీలు తీసుకుంటూ హుషారుగా గంతులేశారు.

11/09/2017 - 19:59

రాజశేఖర్ కథానాయకుడిగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో జ్యోస్టార్ ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై రూపొందించిన ‘గరుడవేగ’ ఇటీవల ఈనెల 3న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం బ్లక్‌బస్టర్ టాక్ తెచ్చుకుని విజయవంతంగా ప్రదర్శింపబడుతోందని, కలెక్షన్ల వర్షం రెండో వారం కూడా దిగ్విజయంగా కురుస్తోందని నిర్మాత ఎం. కోటేశ్వరరాజు తెలిపారు.

11/09/2017 - 19:57

కిరణ్, హర్షదా కులకర్ణి ప్రధాన తారాగణంగా ధృవ ప్రొడక్షన్స్ పతాకంపై కార్తీక్ మేడికొండ దర్శకత్వంలో సుజన్ రూపొందించిన చిత్రం ‘కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్’. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, పోస్టర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో నిర్వహించారు.

11/09/2017 - 19:57

నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘సవ్యసాచి’. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది.

Pages