S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్రభూమి

12/26/2015 - 22:39

దీపక్‌సరోజ్, మాళవికామీనన్ జంటగా కందిమళ్ల మూవీ మేకర్స్ పతాకంపై కోటపాటి శ్రీను దర్శకత్వంలో వెంకట చంద్రశేఖర్ రూపొందిస్తున్న చిత్రం ‘వందనం’ (సేవ్ లవ్). ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ కథే హీరోగా ఈ చిత్రాన్ని రూపొందించామని, మంచి సంగీతంతోపాటుగా ప్రేమ కథకు అవసరమైన రీతిలో పాటలు కుదిరాయని తెలిపారు.

12/26/2015 - 22:37

నాగార్జున, కార్తి, తమన్నా ప్రధాన పాత్రల్లో పి.వి.పి పతాకంపై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పొట్లూరి వి.ప్రసాద్ రూపొందిస్తున్న చిత్రం ‘ఊపిరి’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తికావస్తోంది.

12/26/2015 - 22:35

తెలుగు సినిమాల్లో నటించడానికి సవాలక్ష అభ్యంతరాలు తెలిపే కాజల్ బాలీవుడ్‌కు వెళ్లేసరికి ఒక్క చిన్న అనుమానాన్ని కూడా వ్యక్తం చేయదట. ఇక్కడ చిన్న హీరోలతో నటించమంటే లేదు అనే ఆమె, బాలీవుడ్‌కి వెళ్లేసరికి ఓకే అనేస్తోంది. తాజాగా నూతన నటుడు రణదీప్‌హుడాతో ‘దోలబ్జోంగికహాని’లో ఎలాంటి అభ్యంతరాలు లేకుండా నటించేసిందట! అభ్యంతరాలంటే ఇక్కడ లిప్‌లాక్‌లు, ఫ్రెంచ్‌కిస్‌లు అన్నమాట.

12/26/2015 - 22:32

శర్వానంద్, సురభి జంటగా యువి క్రియేషన్స్ పతాకంపై మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘ఎక్స్‌ప్రెస్ రాజా’. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను ఇటీవల విడుదల చేశారు.

12/26/2015 - 22:29

మురళీకృష్ణ, భానుశ్రీ, ఐశ్వర్య ప్రధాన తారాగణంగా లాస్ ఏంజిల్స్ టాకీస్, సంధ్యా సినీ స్టూడియోస్ సంయుక్తంగా కిషన్‌సాగర్ ఎస్. దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘వౌనం’ (వాయిస్ ఆఫ్ సైలెన్స్). అల్లూరి సూర్యప్రసాద్, సంధ్యారవి రూపొందిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన టాకీపార్టు పూర్తిచేసి, పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు.

12/26/2015 - 22:26

‘అబ్బాయితో అమ్మాయి’ చిత్రం ఈ జనరేషన్ ప్రేమకథలా వుంటుంది. ప్రేమకథలు చెప్పడంవల్ల ఇప్పటి తరం వారంతా తమను తాము ఆయా పాత్రల్లో చూసుకొని, కనెక్ట్ అవుతారు అని చెబుతున్నాడు యువ హీరో నాగశౌర్య. ‘ఊహలు గుసగుసలాడే’,‘దిక్కులు చూడకు రామయ్య’ చిత్రాల ద్వారా లవర్ బాయ్‌లా తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందిన నాగశౌర్య తాజాగా నటించిన చిత్రం ‘అబ్బాయితో అమ్మాయి’.

12/26/2015 - 22:23

తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాలను గడగడ లాడించిన గంధపుచెక్కల స్మగ్లర్ వీరప్పన్‌పై రామ్‌గోపాల్‌వర్మ రూపొందించిన చిత్రం ‘కిల్లింగ్ వీరప్పన్’. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని జనవరి 1న విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ట్రైలర్‌ను చూసిన బాలీవుడ్ స్టార్ అమితాబ్‌బచ్చన్ ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ నమ్మశక్యం కాని విధంగా వుందని తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.

12/26/2015 - 22:21

అనేక చిత్రాల అనంతరం ‘లోఫర్’ చిత్రంలో మదర్ సెంటిమెంట్‌తో చేసిన కథంతా ప్రేక్షకులకు నచ్చిందని, ఏ ఊరికి వెళ్లినా ఆ ఊరి థియేటర్‌లో ఈ సెంటిమెంట్ పండి, ప్రేక్షకుల స్పందన అద్భుతంగా వచ్చిందని దర్శకుడు పూరి జగన్నాథ్ తెలిపారు. శ్రీ శుభశే్వత ఫిలిమ్స్ పతాకంపై వరుణ్‌తేజ్ కథానాయకుడుగా సి.కళ్యాణ్ రూపొందించిన ‘లోఫర్’ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన విజయ యాత్రలు నిర్వహించారు.

12/26/2015 - 22:20

నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్యత్రిపాఠి ప్రధాన తారాగణంగా అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై కళ్యాణకృష్ణ కురసాల దర్శకత్వంలో అక్కినేని నాగార్జున రూపొందించిన చిత్రం ‘సోగ్గాడే చిన్నినాయనా’. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ శిల్పకళావేదికలో నిర్వహించారు. సినిమా పాటల సీడీలను దర్శకుడు కె.రాఘవేంద్రరావు విడుదల చేసి తొలి కాపీని నాగార్జునకు అందించారు.

12/25/2015 - 22:53

మిల్క్‌మూవీస్, మినర్వాటాకీస్ పతాకాలపై విజయ్‌శేఖర్ సంక్రాంతి దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం 7టు4. ఆనంద్ బచ్చు, రాధిక, లౌక్య, రాజ్‌బాల, పి.బి.శ్రీనివాస్, మల్లికార్జున్ తదితరులు ముఖ్యపాత్రలుగా నటించిన ఈ చిత్రానికి సంబంధించిన

Pages