S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/02/2017 - 20:09

మేడిది సురేష్, శే్వతా బాత్రియా జంటగా అనిల్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అక్రమ్’ సినిమా టీజర్ విజయవాడలో విడుదలైంది. ప్రముఖ నిర్మాత అంబికాకృష్ణ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. అమరావతి మూవీస్ బ్యానర్‌పై నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో నిర్మించబడిన తొలి చిత్రం ఇది. ఈ సందర్భంగా అంబికాకృష్ణ మాట్లాడుతూ పూర్తిగా అమరావతి నేపథ్యంలో తెరెకెక్కిన ఈ చిత్రం ఘన విజయం సాధించాలి. టీజర్ బావుంది.

11/02/2017 - 20:08

అర్జున్‌రెడ్డి సినిమాతో తెలుగులో సంచలన హీరోగా మారిన విజయ్ దేవరకొండకు వరస అవకాశాలు క్యూ కట్టాయి. ఇప్పటికే రెండు చిత్రాల్లో నటిస్తున్న ఆయనకు మరో క్రేజీ అవకాశం దక్కింది. తాజాగా ఎన్టీఆర్‌తో ‘జై లవకుశ’ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు బాబీ తన తదుపరి హీరోగా విజయ్‌ని ఎంచుకున్నాడట. ఇప్పటికే విజయ్‌కి కథ కూడా చెప్పినట్లు తెలిసింది. కథ నచ్చడంతో విజయ్ సినిమా చేయడానికి అంగీకరించాడు.

11/02/2017 - 20:07

రాహుల్ ప్రేమ్ మూవీ మేకర్స్ పతాకంపై ప్రతీక్ ప్రేమ్‌కరణ్ స్వీయ దర్శకత్వంలో లంక కరుణాకర్‌దాస్ రూపొందించిన చిత్రం ‘వానవిల్లు’ శ్రావ్యారావు, విశాఖ కథానాయికలుగా నటించారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను నటుడు కాశీవిశ్వనాథ్ విడుదల చేశారు.

11/02/2017 - 20:04

నాగ అనే్వష్, హెబ్బాపటేల్ జంటగా బాహుబలి పళని దర్శకత్వంలో సరస్వతి ఫిలిమ్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ‘ఏంజిల్’ చిత్రం శుక్రవారం విడుదలవుతున్న సందర్భంగా హీరో నాగ అనే్వష్ చెప్పిన విశేషాలు....
స్క్రిప్ట్‌కోసం...

11/02/2017 - 20:02

బాలీవుడ్‌లో సంచలన తారగా ఎదిగిన షిరీన్ తెలుగులో నటిస్తోంది. సవీణా క్రియేషన్స్ పతాకంపై నాగేశ్ నారదాసి దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో ఆమె కథానాయికగా నటిస్తోంది. తనీష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. దేశదిమ్మరికి కథా నాయికగా నటిస్తుండడం కొత్త అనుభూతినిస్తోందని షిరీన్ వ్యాఖ్యానించింది.

11/02/2017 - 20:00

నారా రోహిత్, రెజినీ జంటగా పవన్ మల్లెల దర్శకత్వంలో సరస్‌చంద్రిక విజనరీ మోషన్ పిక్చర్స్, మాయాబజార్ మూవీమేకర్స్ పతాకంపై రూపొందిస్తున్న చిత్రం ‘బాలకృష్ణుడు’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ ఇటీవల విడుదలయింది. ఈ ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన లభిస్తోందని దర్శక, నిర్మాతలు తెలియజేశారు.

11/02/2017 - 19:59

రాజేశ్ పత్తి, శే్వత జంటగా త్రీరాస్ ప్రణామ్ ఆర్ట్స్ పతాకంపై అమృత శ్రీరామ్ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘కొంచెం దిల్ ఉంటే చాలు’. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభిస్తున్నామని దర్శక నిర్మాతలు తెలియజేసారు.

11/02/2017 - 19:57

అందాల చందమామ కాజల్‌కు ఈ మధ్య వరుస పరాజయాలు టెన్షన్ పెడుతున్నాయి. అటు తమిళంలో కూడా పరిస్థితి ఇలాగే ఉండడంతో కొత్త అవకాశాలు రావడం లేదు. మళ్లీ తన క్రేజ్‌ను పెంచుకునేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్న కాజల్ తాజాగా ఓ యువహీరో చిత్రానికి నో చెప్పడం ఆసక్తిని కలిగిస్తోంది. దానికి కారణాలు ఏవైనప్పటికీ కుర్ర హీరోలతో సినిమా చేస్తే వరుసగా అలాంటి అవకాశాలే వస్తాయని భావించిందో ఏమో. అందుకనే నో చెప్పిందట.

11/01/2017 - 20:13

జై సింహా ఫస్ టలుక్ ఇదే

11/01/2017 - 20:10

మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరోయిన్‌గా సమంత నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నఈ సినిమాలో పూజా హెగ్డే ప్రత్యేక పాటలో అలరించనుంది. దేవీశ్రీ ప్రసాద్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అనసూయ, జగపతిబాబు, ఆది పినిశెట్టిలు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.

Pages