S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

10/31/2017 - 19:55

త్రిరాస్ ప్రణామ్ ఆర్ట్స్ పతాకంపై రాజేష్ పత్తి, శే్వత జంటగా అమృతా శ్రీరామ్ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం కొంచెం దిల్ వుంటే చాలు. ఈ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ప్రముఖ రచయిత మరుదూరి రాజా క్లాప్ కొట్టగా సురేష్ కెమెరా స్విచాన్ చేసారు. అనంతరం మరుదూరి రాజా మాట్లాడుతూ, హారర్, కామెడీ జోనల్‌లో తెరకెక్కే సినిమా ఇది.

10/31/2017 - 19:54

కార్తికేయ, సిమ్రత్ జంటగా రమణశ్రీ ఆర్ట్స్ పతాకంపై రిషి దర్శకత్వంలో రవీందర్ ఆర్.గు మ్మడికొండ రూపొందించిన చిత్రం ‘ప్రేమ తో..మీ కార్తీక్’. ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ ఇటీవల విడుదలై మంచి ఆదరణ పొందుతుందని దర్శక నిర్మాతలు తెలియజేస్తున్నారు. దర్శకుడు రిషి మాట్లాడుతూ, మురళీ శర్మ పూర్తిస్థాయి వైవిధ్యంగా సాగే తండ్రి పాత్రలో నటించడం విశేషమని, నాలు గు పాటలు అద్భుతంగా వచ్చాయని తెలిపారు.

10/31/2017 - 19:53

తెలుగులో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న అందాల భామ లావణ్య త్రిపాఠిపై తాజాగా ఓ వార్త మీడియాలో సంచలనం రేపుతోంది. ఓ సినిమా విషయంలో ఆమెకు భారీ ఫైన్ చెల్లించాలంటూ కోర్టు తీర్పు ఇచ్చిందని ఆ వార్తల సారాంశం. ఈ విషయంపై లావణ్య త్రిపాఠి స్పందించింది. ప్రస్తుతం మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని, అలాంటి పుకార్లు ఎవరు పుట్టిస్తారో అర్థం కాకుండా వుందని తెలిపింది.

10/31/2017 - 19:52

బాలీవుడ్‌లో టాప్ స్టార్‌గా ఎదగడానికి తాప్సీ తాపత్రయం రోజురోజుకూ ఎక్కువవుతోంది. అదేంటి.. దక్షిణాదిలో తిరగగొట్టారు కదా, కథానాయికగా గుర్తింపు ఇవ్వలేదు కదా అని అడిగితే, దక్షిణాదిలో తన సినిమాలన్నీ పరాజయంపాలైన మాట నిజమేనని, ఉత్తరాదిలో మాత్రం తాను సక్సెస్‌ఫుల్ కథానాయికగా నిరూపించుకున్నానని తనను తాను సమర్ధించుకుంటుంది. టాప్‌స్టార్‌గా ఎదగడానికి ఎన్ని అవార్డులు తీసుకోవాలి?

10/29/2017 - 19:58

మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నటుడు నందమూరి తారకరామరావు జీవిత కథతో ఆయన తనయుడు బాలకృష్ణ నటించే చిత్రం త్వరలో మొదలుకానుంది. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటిస్తున్న ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహిస్తున్నారు.

10/29/2017 - 19:57

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి. డిసెంబర్‌నుండి సెట్స్‌పైకి వచ్చే ఈ చిత్రం స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో తెరకెక్కనున్న విషయం తెలిసిందే. భారీ తారాగణంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిస్తున్న ఈ చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

10/29/2017 - 19:54

శ్రీనివాస్‌రెడ్డి, అనసూయ, వేణు ముఖ్యపాత్రల్లో శ్రీ్ధర్‌రెడ్డి యార్వ దర్శకత్వంలో ఎంటర్‌టైన్‌మెంట్ స్టుడియోస్, సోహం రాక్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై దీపక్ మఖుత్, ఎన్‌ఎమ్ పాషా నిర్మిస్తున్న చిత్రం ‘సచ్చిందిరా గొఱ్ఱె’.

10/29/2017 - 19:53

నాని హీరోగా నటించిన ‘మజ్ను’ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది మలయాళ భామ అను ఇమ్మాన్యుయెల్. మొదటి సినిమాతోనే కుర్రకారు హృదయాలను దోచేసింది. అందానికి అందం, అభినయం తోడైన ఈ బ్యూటీ ఆ తర్వాత వరస విజయాలతో దూసుకుపోతోంది. ‘మజ్ను’ తర్వాత వరసగా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ జోరుమీదుంది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న మరో చిత్రం ‘ఆక్సిజన్’.

10/29/2017 - 19:51

రామ్, అనుపమా పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో స్రవంతి మూవీస్ పతాకంపై కృష్ణ చైతన్య నిర్మించిన ‘ఉన్నది ఒకటే జిందగీ’ చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు కిశోర్ తిరుమల మాట్లాడుతూ సినిమా అందరికీ నచ్చింది. చాలా మంది సన్నివేశాల గురించి మాట్లాడుతుంటే ఎంతో ఆనందంగా వుంది.

10/29/2017 - 19:49

సంపూర్ణేష్ బాబు, ఇషికాసింగ్, గీతాంజలి హీరోహీరోయిన్లుగా రూపక్ రోనాల్డ్‌సన్ దర్శకత్వంలో అమృత ప్రొడక్షన్స్, సంజనా మూవీస్, గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్లపై సాయి రాజేష్, ఆది, కుంభగిరి నిర్మిస్తున్న చిత్రం ‘కొబ్బరిమట్ట’. ఈ చిత్రానికి సంబంధించిన పాట చిత్రీకరణ హైదరాబాద్‌లోని సారథి స్టూడియోలో జరుగుతోంది.

Pages