S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

10/26/2017 - 20:18

జీవా, నిక్కీగల్రానీ, అనై కా సోఠి ప్రధాన తారాగణంగా కృష్ణ క్రియేషన్స్ లక్ష్మీ వెంకటేశ్వర మూవీస్ పతాకంపై రూపొందించిన చి త్రం ‘కీ’. ఈ చిత్రం తెలుగులో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు ఖలీస్ చిత్ర విశేషాలు తెలుపుతూ- సైబర్ క్రైమ్ నేపథ్యంలో సైకలాజికల్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు.

10/26/2017 - 20:16

దాదాపు రెండేళ్ల తర్వాత ‘రాజా ది గ్రేట్’ సినిమాతో స్క్రీన్‌మీద కనిపించిన మాస్ మహారాజా రవితేజ ఆ చిత్రంతో మంచి విజయాన్ని అందుకొని పూర్వ వైభవాన్ని తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం మంచి వసూళ్ళతో నడుస్తోంది. దీంతో వరసగా రెండు కొత్త సినిమాలకు సైన్ చేశారాయన. వీటిలో శ్రీనువైట్లతో ఒక ప్రాజెక్టు ఉండనుంది.

10/26/2017 - 20:14

క్రేజీ దర్శకుడు మురుగదాస్ తాజాగా మహేష్‌తో తీసిన ‘స్పైడర్’తో కాస్త నిరాశ ఎదుర్కొన్నా డు. భారీ అంచనాలతో విడుదలైన ఈ సిని మా అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. అటు మహేష్ తమిళ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చే ఆశ కూడా ఆశగానే మిగిలిపోయిట్టే. ఈ సినిమా అయిపోయింది కాబట్టి మురుగదాస్ తదుపరి చిత్రానికి సన్నాహాలు మొదలుపెట్టాడట. ఇప్పటికే ఆయన స్టార్ హీరో విజయ్‌తో సినిమా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.

10/26/2017 - 20:11

నందు, శ్రీముఖి, అలీ ప్రధాన తారాగణం గా జె.పి క్రియేషన్స్ పతాకంపై శ్రీను ఈమంది దర్శకత్వంలో ధనా జమ్ము రూపొందించిన చిత్రం ‘బిటెక్ బాబులు’. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.

10/26/2017 - 20:10

రజనీకాంత్, అమీ జాక్సన్, అక్షయ్‌కుమార్ ప్రధాన తారాగణంగా రూపొందించిన ‘రోబో 2.0’ చిత్రానికి సం బంధించిన ఆడియో విడుదల కార్యక్రమం నేడు జరగనుంది. దుబాయ్‌లో నిర్వహించనున్న ఈ కార్యక్రమం లో సినిమా యూనిట్ అంతా పాల్గొంటారు. ఈ నేపథ్యంలో దర్శకుడు శంకర్ సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన తాజాగా విడుదలైన పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

10/26/2017 - 20:08

రామ్, అనుపమా పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘ఉన్నది ఒకటే జిందగీ’. స్రవంతి రవికిశోర్, పిఆర్ సినిమాస్ సమర్పణలో స్రవంతి సినిమాటిక్స్ పతాకంపై కృష్ణ చైతన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 27న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.

10/26/2017 - 20:07

టాలీవుడ్ గ్లామర్ భామ రకుల్‌ప్రీత్‌సింగ్ ఈమధ్యకాలంలో అందరికంటే ముందు దూసుకుపోతోంది. తక్కువ సమయంలోనే వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు పట్టేసిన ఈ భామకు ఈమధ్య వరుస షెడ్యూల్స్‌తో బిజీగా మారిందని, రెస్ట్ తీసుకోవడానికి సమయం దొరకడంలేదని తెగ ఫీల్ అవుతోంది. ఇప్పటికే స్టార్ హీరోలతో, ఇటు యువ హీరోలతో జోరుగా సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు నిజంగా బ్రేక్ లేకుండా షూటింగ్‌లతో బిజీగా మారింది.

10/25/2017 - 20:57

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న ‘రంగస్థలం 1985’ చిత్రం హైదరాబాద్‌లో వేసిన విలేజ్ సెట్‌లో జోరుగా షూటింగ్ జరుపుకుంటోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే సర్వత్రా ఆసక్తి నెలకొంది. 1985 నేపథ్యంలో రంగస్థలం అనే గ్రామంలో జరిగిన కథతో ఈ చిత్రం వుంటుందని టాక్. తాజాగా ప్రత్యేక పల్లెటూరి సెట్‌లో పాట చిత్రీకరణ జరుపుతున్నారు.

10/25/2017 - 20:55

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ హీరోగా నటిస్తున్న 25వ చిత్రానికి సంబంధించిన టైటిల్ ఇంకా కన్‌ఫర్మ్ కాలేదు. సినిమా మొదలై చాలా రోజులు అవుతున్నా కూడా దర్శక నిర్మాతలు టైటిల్‌ను ప్రకటించకపోవడంతో మెగా ఫ్యాన్స్ సందిగ్ధంలో వున్నారు. ఈ దీపావళికే టైటిల్ ప్రకటిస్తారని అనుకున్నారు కానీ మళ్లీ నిరాశే మిగిలింది. ప్రస్తుతం ‘అజ్ఞాతవాసి’ అనే టైటిల్ వినిపిస్తోంది.

10/25/2017 - 20:54

సిద్ధార్థ్, వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్, ఎటాకి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై మిలిందర్‌రావు దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘గృహం’. హీరో సిద్ధార్థ్, ఆండ్రియా ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను హైదరాబాద్ ప్రసాద్ లాబ్‌లో విడుదల చేశారు.

Pages