S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/23/2017 - 19:24

బాలీవుడ్ అందాల సుందరి ఐశ్వర్యారాయ్ తాజాగా ఓ హీరోతో రొమాంటిక్ సన్నివేశాలు, క్లోజ్ సీన్స్ చేయనని చెప్పి షాక్ ఇచ్చింది. ఇప్పటికే ఐశ్వర్యా రొమాంటిక్ సన్నివేశాల్లో అద్భుతంగా నటిస్తుందన్న పేరుంది. అలాంటి ఐష్ ఆ హీరోకు నో ఎందుకు చెప్పిందో అన్న ఆసక్తి ఎక్కువైంది జనాలకి. ఇంతకీ ఆమె నో చెప్పిన హీరో ఎవరో తెలుసా.. రాజ్‌కుమార్‌రావు?

09/23/2017 - 19:24

ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘సాహో’ గురించి సర్వత్రా ఆసక్తి నెలకొంది. బాహుబలి తరువాత ఆయన నటిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుండడంతోపాటు హైటెక్నికల్ విలువలతో రూపొందుతోంది. ప్రభాస్ సరసన హీరోయిన్‌గా బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే. శ్రద్ధాకపూర్ విషయంలో రోజురోజుకూ కొత్త కొత్త న్యూస్ హల్‌చల్ అవుతున్నాయి.

09/22/2017 - 20:12

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే అంతర్జాతీయ అవార్డుల వేడుక ఆస్కార్ వేదికపైకి ఈ ఏడాది భారత్ నుండి పోటీపడడానికి బాలీవుడ్ చిత్రం ‘న్యూటన్’ ఎంపికైంది. రాజ్‌కుమార్‌రావ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో దేశంలోని ఎన్నికల ప్రక్రియ పట్ల ఓ ఉద్యోగి తెచ్చిన మార్పు ఏంటి అన్న నేపథ్యంలో కథనాన్ని చర్చించారు. అమిత్ వి.ముసుర్కర్ దర్శకుడు.

09/22/2017 - 20:09

ఫార్ట్యూన్ మూవీస్ పతాకంపై నూతన నటీనటులను తెలు తెరకు పరిచయం చేస్తూ దర్శకుడు సాగర్ చాలా కాలం తరువాత దర్శకత్వం చేస్తున్న చిత్రం ‘ప్రభాస్’ శుక్రవారం ఉదయం అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. ఎఫ్‌బిసి చైర్మన్ రామ్‌మోహన్ క్లాప్‌నివ్వగా, కెమెరా కె.ఎస్.రామారావు స్విచ్ ఆన్ చేయగా, ఎస్.వి.కృష్ణారెడ్డి గౌరవ దర్శకత్వం వహించి ఈ నూతన చిత్ర ప్రారంభోత్సవాన్ని జరుపుకున్నారు.

09/22/2017 - 20:06

ఉగ్రవాదం అంటే అభం శుభం తెలియని జనాల్ని చంపడమే కాదు, యువతను పెడదోవ పట్టించడం, పదిమందితో కలిసి ప్రజల్ని భయపెట్టడం, పరాయి దేశాలనుంచి మాదకద్రవ్యాలను తీసుకొచ్చి మన దేశంలో విక్రయించడం, మన దేశ సంపదను అక్కడికి తరలించడం వంటి కార్యకలపాలన్నీ ఉగ్రవాదంలో భాగమే. అటువంటి అతీతశక్తుల్ని సమాజం నుంచి బహిష్కరించడమే ఎన్‌ఐఏ (నేషనల్ ఇనె్వస్టిగేషన్ ఏజెన్సీ).

09/22/2017 - 20:04

కార్తీక్, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా తమిళంలో విజయవంతమైన ‘్ధరన్ అధిగారం ఒండ్రు’ చిత్రాన్ని తెలుగులో ఆదిత్యా మ్యూజిక్స్ అందిస్తోంది. ద పవర్ ఆఫ్ పోలీస్ అనేది ఉపశీర్షిక. హెచ్.వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను ఈనెల 27న, ట్రైలర్‌ను వచ్చేనెల 17న, సినిమాను నవంబర్ 17న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

09/22/2017 - 20:02

ఒక్క ‘అర్జున్‌రెడ్డి’ సినిమా విజయ్ దేవరకొండ కెరియర్‌ని ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. నైట్‌కి నైట్ స్టార్ రేంజ్‌కి అతని ఇమేజ్ పెరిగిపోయింది. ఇప్పుడు అతని సినిమా అంటే కుర్రాళ్లు ఫిదా అయిపోయి క్యూలు కట్టే స్థాయికి వచ్చేసాడంటే ఇక విజయ్ కెరీర్ ఎక్కడ ఉండబోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం అతని చేతిలో తెలుగులోనే ఏకంగా నాలుగైదు సినిమాలు వున్నాయి.

09/22/2017 - 20:01

స్టా ర్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ‘ఖైదీ నెం 150’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత మెగా హీరోని డైరెక్ట్ చేయనున్నారు. ఆ హీరోనే సాయిధరమ్ తేజ్. ఖైదీ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వినాయక్ ఎలాంటి సినిమా చేస్తారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ధరమ్‌తేజ్‌తో సినిమా అనగానే మరింత ఆసక్తి మొదలైంది.

09/22/2017 - 20:00

సుమంత్ అశ్విన్, నిహారిక ప్రధాన తారాగణంగా యు.వి.క్రియేషన్స్, పాకెట్ సినిమా పతాకంపై లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ‘హ్యాపీ వెడ్డింగ్’. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ 4 నుండి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ- సంగీతం హైలెట్‌గా నిలిచే ఈ సినిమాలో టోటల్‌గా కాంబినేషన్స్ అన్నీ వైవిధ్యంగా వుంటాయని తెలిపారు.

09/22/2017 - 19:58

చైతన్య, దివిప్రసన్న జంటగా మహేష్ దర్శకత్వంలో ఫిలిం అండ్ సి పతాకంపై రూపొందిస్తున్న చిత్రం ‘ప్రాజెక్ట్ సి 420’. ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం ఆస్ట్రేలియా కాన్‌బెర్రాలో జరిగింది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ- ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుందో లేదో తెలియదు కాని ఒక చిన్న తప్పుతో జీవితంలో అనేక పరిణామాలు ఎదురవుతాయన్న పాయింట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు.

Pages