S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/11/2017 - 21:07

బాహుబలితో అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదించుకున్న ప్రభాస్ ప్రస్తుతం నేషనల్‌వైడ్ హీరోగా మారిపోయాడు. బాహుబలి తర్వాత భారీ అంచనాల మధ్య ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాహో. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే హాలీడేస్‌ని ముగించుకున్న ప్రభాస్ త్వరలోనే సాహో షూటింగ్‌లో పాల్గొననున్నాడు.

06/11/2017 - 21:05

యూత్ స్టార్ నితిన్, మేఘా ఆకాశ్ జంటగా హనురాఘవపూడి దర్శకత్వంలో 14రీల్స్ పతాకంపై రామ్‌ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంకర నిర్మిస్తున్న భారీ చిత్రం లై (లవ్ ఇంటిలిజెంట్ ఎనిమిటీ). ఈ చిత్రానికి సంబంధించిన మొదటి పాటను ఆదివారం అమెరికాలో విడుదల చేశారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రంలోని బాంబార్ట్ అనే పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో నితిన్ మాట్లాడుతూ.. మణిశర్మ అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చాడు.

06/11/2017 - 21:03

ప్రస్తుతం పవన్‌కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమాకు ఏ టైటిల్ పెడతారనే ఆసక్తి ఎక్కువైంది. క్రేజీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన పలు టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. తాజాగా తెలుగు పరిశ్రమలో కొత్త టైటిళ్ల పరంపర మొదలైంది.

06/11/2017 - 21:00

శ్రీకాంత్ కథానాయకుడుగా నాజియా కథానాయికగా విజి చెర్రీస్ విజన్స్ పతాకంపై విజయ్ రూపొందించిన చిత్రం రా..రా. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా ఈనెలలోనే విడుదలకు సిద్ధవౌతోంది.

06/11/2017 - 20:58

నవీన్‌చంద్ర, ప్రియల్‌గోర్ జంటగా లైఫ్ కార్పొరేషన్, ఇటాలియన్ ఆఫ్‌ది ఈస్ట్ ఫిలిమ్ కార్పొరేషన్ పతాకాలపై ధరమ్, రక్ష దర్శకత్వంలో కిరణ్ జక్కంశెట్టి, శ్రీని గుబ్బల సంయుక్తంగా రూపొందించిన చిత్రం చందమామ రావే. ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి, విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత కిరణ్ జక్కంశెట్టి మాట్లాడుతూ..

06/11/2017 - 20:58

తెలుగులో టాప్ హీరోయిన్‌గా క్రేజ్ తెచ్చుకున్న అందాల భామ సమంత వ్యవహారం జోరుమీదుంది. ఇప్పటికే రామ్‌చరణ్-సుకుమార్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న రంగస్థలం-1985 చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న సమంత అక్టోబర్‌లో వివాహానికి సిద్ధమైంది. యువ నటుడు నాగచైతన్యతో ఇదివరకే నిశ్చితార్ధం జరుపుకున్న ఈమె అక్టోబర్‌లో పెళ్లిచేసుకోడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

06/11/2017 - 20:56

సినిమా రంగంలో తారలుగా వెలుగొందాలని చాలామంది కలలుగంటారు. కానీ అందరి కలలు సాకారం కావు. కొందరేమో ధ్రువతారలుగా వెలిగిపోతే మరికొందరు చీకట్లో మిగిలిపోతారు. ముఖ్యంగా సినిమా రంగంలో హీరోయిన్ల కెరీర్‌గ్రాఫ్ చిన్నదే. హీరోలైతే 60-70 వచ్చాక కూడా స్టార్ హీరోలుగా సత్తా చాటుకుంటూ అటు ఫ్యాన్స్‌ను, ఇటు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటారు. కానీ హీరోయిన్‌కు అలాంటి చాన్స్ లేదు. గ్లామర్ ఉన్నంతవరకే ఆమె హవా కొనసాగేది.

06/10/2017 - 23:32

గ్లామర్ భామ హన్సిక కోలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ జోరుమీదుంది. ఈమధ్యే మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈమెకు అక్కడ కూడా మరింత క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం హన్సిక మూడు చిత్రాల్లో నటిస్తోంది. అయితే ఓ చిత్రం కోసం ఆమె పేరు పరిశీలనలోకి వచ్చినపుడు నిర్మాతలు బాబోయ్ ఆమె అయితే వద్దని తేల్చేశారట. ఆ వివరాల్లోకి వెళితే, బాహుబలి ఇచ్చిన స్ఫూర్తితో ఆ తరహా చిత్రాలకు క్రేజ్ పెరిగింది.

06/10/2017 - 23:31

తెలుగు చిత్ర పరిశ్రమలో గుండెకాయలాంటి దాసరి దూరమవ్వడం సినిమా పరిశ్రమకు తీర్చలేని లోటు. ఆయన ఉంటే కార్మికులతోపాటు నటీనటులకు, దర్శక నిర్మాతలకు ఓ భరోసాగా నిలిచేవారు. ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిది అని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు ఘంటా శ్రీనివాసరావు తెలిపారు. దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు సంతాప సభ శనివారం సాయంత్రం హైదరాబాద్ ఫిలిం చాంబర్ హాల్‌లో జరిగింది.

06/10/2017 - 23:30

నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం నటిస్తున్న 101 చిత్రం ‘పైసా వసూల్’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా తరువాత ఆయన నటించే 102వ సినిమా రెగ్యులర్ షూటింగ్ శనివారం ప్రారంభమైంది. ప్రముఖ తమిళ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సి.కల్యాణ్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈనెల 10 నుంచి షూటింగ్ మొదలుపెట్టారు.

Pages