S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/07/2017 - 23:00

‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ -ది మేకింగ్ అండ్ అన్‌మేకింగ్ ఆఫ్ మన్మోహన్ సింగ్’ పుస్తకం ఆధారంగా బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న చిత్రం ఫస్ట్‌లుక్ విడుదలైంది. ఈ కథలో మాజీ ప్రధాని మన్మోహన్ పాత్రను అనుపమ్ ఖేర్ పోషిస్తోన్న విషయం తెలిసిందే. మన్మోహన్ గెటప్‌లో అనుపమ్ పోస్టర్‌పై ఇలా కనిపించారు. పక్కకు తిరిగివున్న మన్మోహన్ మస్తిష్కంలో మరో మహిళ ఉన్నట్టు పోస్టర్‌ను డిజైన్ చేయడం ఆసక్తి రేకెత్తిస్తోంది.

06/06/2017 - 21:08

నారా రోహిత్, శ్రీవిష్ణు కథానాయకులుగా బాబా క్రియేషన్స్ పతాకంపై ఇంద్రసేన ఆర్ దర్శకత్వంలో అప్పారావు బెల్లన రూపొందిస్తున్న చిత్రం ‘వీరభోగ వసంతరాయలు’. చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఆర్‌ఎఫ్‌సిలో మంగళవారం ఉదయం ప్రారంభమైంది. షూటింగ్‌లో శ్రీయా శరణ్, సుధీర్‌బాబు పాల్గొన్నారు.

06/06/2017 - 21:07

దర్శకురాలు జయ రూపొందించిన ‘వైశాఖం’ చిత్రం లవ్‌లీ చిత్రం కంటే పెద్ద విజయం సాధిస్తుందని, మహిళా దర్శకురాలిగా విజయనిర్మల తరువాత ఎక్కువ సినిమాలకు దర్శకత్వం వహించిన ఘనత ఆమెకే చెందుతుందని దర్శకుడు వివి వినాయక్ అన్నారు. హరీశ్, అవంతిక జంటగా ఆర్‌జె సినిమాస్ పతాకంపై బిఎ రాజు రూపొందించిన చిత్రం ‘వైశాఖం’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.

06/06/2017 - 21:04

లుక్కులు, ప్రొమోలతో పిచ్చి క్రేజ్ తెచ్చుకున్న డిజె మొత్తానికి థియేటర్లకు వచ్చేస్తున్నారు. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి కావడంతో ఈనెల 23న థియేటర్లకు తెచ్చేందుకు చిత్రబృందం రంగం సిద్ధం చేస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అల్లు అర్జున్ కథానాయకుడిగా హరీశ్ శంకర్ ఎస్ దర్శకత్వంలో రాజు రూపొందించిన చిత్రం డిజె (దువ్వాడ జగన్నాధమ్).

06/06/2017 - 21:02

రానా కథానాయకుడిగా తేజ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి’. కాజల్ కథానాయికగా నటిస్తున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను కథానాయకుడు రానా తన ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. తాతగారి జయంతి సందర్భంగా టీజర్‌ను విడుదల చేస్తున్నామని, తాను పోషిస్తున్న జోగేంద్ర పాత్ర స్వభావాన్ని టీజర్‌లో పరిచయం చేశామన్నారు.

06/06/2017 - 21:00

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాథను 151వ చిత్రంగా తెరకెక్కిస్తున్న చిరంజీవికి ఇది పీరియాడిక్ సినిమా. దీంతో జాతీయస్థాయి ప్రాజెక్టుగా తెరకెక్కించేందుకు దర్శకుడు సురేందర్‌రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకే ఈ సినిమా కోసం మాజీ ప్రపంచ సుందరిని చిరుకు జోడీగా నటింపచేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఐశ్వర్యారాయ్‌తో ఇప్పటికే మంతనాలు సాగించినట్టు సమాచారం.

06/06/2017 - 20:58

నూతన నటీనటులు సజీవ్, రాజు, లావణ్యరావ్, టీనా రాథోడ్‌లను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ న్యూటాలెంట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శ్రీ సాయిగణేష్ నిర్మిస్తున్న చిత్రం ‘లోకల్ ఆటో’. నందు జెన్న ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రేమ, మాఫియా బ్యాక్‌డ్రాప్ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం టైటిల్ మరియు చిత్ర యూనిట్ వివరాలను నిర్మాత శ్రీ సాయిగణేష్ వెల్లడించారు.

06/06/2017 - 20:57

యూపీఏ హయాంలో ప్రధాన మంత్రి బాధ్యతలు నిర్వర్తించి వౌనమునిగా పేరుపడిన మన్మోహన్ -స్క్రీన్‌మీద కనిపిస్తే? ఆ పాత్రను సమర్థంగా పోషించే నటుడెవరన్న ప్రశ్న ఉద్భవిస్తే..? ఎవరైతే సరిపోవచ్చన్న అంచనాల నుంచే చర్చ మొదలవుతోంది. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇదే టాక్ నడుస్తోంది. వౌనముని పాత్రను ఎక్స్‌ప్రెసివ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనుపమ్ ఖేర్ పోషిస్తున్నాడని తెలియడంతో, ప్రాజెక్టుపట్ల మరింత ఆసక్తి పెరిగింది.

06/06/2017 - 20:55

ఏ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ పతాకంపై ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నరసింహరావు కెసి రూపొందించిన చిత్రం ‘అమీ తుమీ’. శ్రీనివాస్ అవసరాల, అడివి శేష్, ఈషా, అతిథి ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మోహనకృష్ణ మాట్లాడుతూ పూర్తి హాస్యభరిత చిత్రంగా రూపొందిన చిత్రంలో అన్ని పాత్రలు కడుపుబ్బ నవ్విస్తాయన్నారు.

06/06/2017 - 20:43

శ్రీదేవి ప్రధాన పాత్రలో మ్యాడ్ ఫిలింస్, థర్డ్ ఐ పిక్చర్స్ పతాకాలపై రవి ఉద్యవార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మామ్’. ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా జూలై 7న అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. శ్రీదేవి నాలుగు భాషల్లోనూ డబ్బింగ్ చెప్పడం విశేషం.

Pages