S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/06/2017 - 20:41

శ్రీశ్రీ నాగలక్ష్మి సినిమా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై జింక హరిబాబు దర్శకత్వంలో రాయగిరి ఉమాపతి గౌడ్ రూపొందిస్తున్న చిత్రం ‘సోగ్గాడే శోభన్‌కృష్ణ’. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల హైదరాబాద్ ప్రసాద్ లాబ్‌లో నిర్వహించారు. దర్శకుడు సాగర్ సీడీ విడుదల చేసి నటుడు నారాయణరావుకు అందించారు.

06/04/2017 - 20:51

యంగ్ హీరో నితిన్‌కు పవన్‌కళ్యాణ్ అంటే ఎంత అభిమానమో వేరే చెప్పనక్కర్లేదు. అలాగే త్రివిక్రమ్, నితిన్‌ల కాంబినేషన్ ఎలా ఉంటుందో ‘అ.. ఆ’ సినిమాతో రుజువైపోయింది. ఇలాంటి ఈ రెండు ముచ్చటైన కాంబినేషన్లు కలిసి ఒకే సినిమా చేస్తే అభిమానులకు పండుగనే చెప్పాలి. ఈ ముగ్గురి కలయికలో పవన్, త్రివిక్రమ్‌లు నిర్మాతలుగా నితిన్ హీరోగా ఒక సినిమాను ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. గత ఏడాది ఆఖరులో ఈ సినిమా అనౌన్స్ అయింది.

06/04/2017 - 20:48

నాని కథానాయకుడుగా డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎల్‌ఎల్‌పి పతాకంపై శివ నిర్వాణ దర్శకత్వంలో డి.వి.వి.దానయ్య రూపొందిస్తున్న చిత్రం నిన్ను కోరి. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేసి, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ఇటీవల విడుదలైన ఆడిగా అడిగా..

06/04/2017 - 20:47

సునీల్ కథానాయకుడుగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో యునైటెడ్ కిరీటి మూవీస్ పతాకంపై పరుచూరి కిరీటి రూపొందిస్తున్న చిత్రం ఉంగరాల రాంబాబు. ఈ చిత్రానికి సంబంధించిన తొలి పాట ‘హూ లాలాల హూ లాలాల’ను పాత్రికేయులు విడుదల చేసి, దివంగత దర్శకుడు దాసరి నారారాయణరావుకు అంకితమిచ్చారు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ..

06/04/2017 - 20:45

తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న సంఘమిత్ర సినిమా యూనిట్ ఇప్పుడు ఆలోచనలో పడింది. ఈ సినిమా టైటిల్ రోల్‌లో నటిస్తున్న గ్లామర్ భామ శృతిహాసన్ తప్పుకోవడంతో ఇప్పుడు సంఘమిత్ర తిట్లేల రోల్ పోషించేదెవరు? అన్న సందేహాలు మొదలయ్యాయి. ఇప్పటికే సౌత్ క్రేజీ భామ అనుష్క పేరు వినిపించినప్పటికీ.. లేటెస్ట్‌గా బాహుబలి సినిమా చేసింది కాబట్టి ఈ సినిమాలో ఆమె నటించడం అనుమానమే.. ఇప్పటికే అనుష్కతో చర్చలు జరుపుతున్నారు.

06/04/2017 - 20:43

సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘కాల’. పా.రంజిత్ డైరెక్ట్‌చేస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుపుకుంటోంది. ‘కబాలి’తర్వాత రజనీ చేస్తున్న ఈ ప్రాజెక్ట్‌మీద అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీస్థాయి అంచనాలున్నాయి. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కూడా నటిస్తున్నారని టాక్. అయితే ఈ విషయమై చిత్ర టీమ్ నుండి ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

06/04/2017 - 20:42

జాతీయ నటుడు కమల్‌హాసన్ సినిమాలు తీయడం మానేస్తానని అంటున్నాడు. అవునా ఎందుకంటే.. కేంద్ర ప్రభుత్వం అమలుచేసిన జిఎస్‌టి బిల్లు విషయంలో సినిమా పరిశ్రమపై 28 పర్సెంట్ పడిందని, ఈ పన్ను శాతాన్ని తగ్గించకపోతే తాను సినిమాలుచేయడం మానేస్తానని అన్నాడు. జులై 1నుండి అమలయ్యే ఈ పన్నుపై ఆయన వ్యతిరేకత వ్యక్తం చేసారు.

06/04/2017 - 20:40

ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని జంటగా రిషీ మీడియా, శ్రీ చక్ర ఇన్నోవేషన్స్ పతాకాలపై ఎ.ఆర్.కె.శరవణన్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం మరకతమణి. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. హీరో నాని సీడీని విడుదల చేశారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్, సంగీతం బావుందని, విజయవంతమవ్వాలని కోరుకున్నారు.

06/04/2017 - 20:38

మంజునాధ్, తనిష్క తివారి జంటగా ఎస్.వి.ఎం. దర్శకత్వంలో శ్రీ మల్లికార్జునస్వామి క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం ‘మా ఊరి ప్రేమకథ’. గ్రామీణ నేపథ్యంలో జరిగే లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా మంజునాధ్ మాట్లాడుతూ- నిజ జీవిత సంఘటనల నేపథ్యంలో రూపొందిన ప్రేమకథా చిత్రమిది.

06/04/2017 - 20:36

అశ్విన్ కథానాయకుడుగా పరిచయం అవుతున్న ఓ చిత్రాన్ని లోకి ఫిలిమ్స్ సంస్థ బిఎంజె స్టూడియోస్‌తో కలసి సంయుక్తంగా రూపొందిస్తున్నారు. వశిష్ట పారుపల్లి దర్శకత్వంలో నిర్మించనున్న ఈ చిత్రానికి సంబంధించిన తొలి షెడ్యూల్ హైదరాబాద్‌లో పూర్తిచేశారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన రెండో షెడ్యూల్‌ను అమెరికాలో చిత్రీకరించనున్నారు.

Pages