S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/19/2016 - 21:27

తాజాగా త్రివిక్రమ్, పవన్‌కల్యాణ్‌ల సంయుక్త నిర్మాణంలో కృష్ణచైతన్య దర్శకత్వంలో కొత్త సినిమా అనౌన్స్ చేసి సంచలనం సృష్టించిన యంగ్ హీరో నితిన్, ఈమధ్య దర్శకుడు హను రాఘవపూడి డైరెక్షన్‌లో ఒక సినిమాకి సైన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా వైవిధ్యమైన రొమాంటిక్ లవ్‌స్టోరీగా ఉండబోతోంది.

11/19/2016 - 21:24

తమిళంలో సూర్యకు ఉన్న ఫాలోయింగ్ ఏస్థాయితో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తెలుగులోనూ హీరోగా తిరుగులేని స్టార్‌డమ్ సంపాదించుకున్న ఆయన నటించిన ‘సింగం-3’ వచ్చే నెలలో భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా ఇంకా విడుదల కాకముందే సూర్య అప్పుడే రెండు కొత్త సినిలను మొదలుపెట్టేశాడు.

11/19/2016 - 21:21

‘అరుంధతి’, ‘రుద్రమదేవి’ సినిమాతో లేడీ ఓరియంటెడ్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిపోయిన నటి అనుష్క ప్రస్తుతం చేస్తున్న మరో ‘పిల్ల జమీందార్’ ఫేమ్ అశోక్ డైరెక్ట్ చేస్తున్న చిత్రం అక్టోబర్‌లో మొదలైంది. ఈ చిత్రంలో అనుష్క పాత్ర, నటన హైలెట్‌గా నిలుస్తాయని, కథ కూడా వైవిధ్యంగా కొత్తగా వుంటుందని మొదటినుండీ చిత్ర యూనిట్ చెబుతూ వస్తున్నారు. దీంతో ప్రేక్షకుల్లో సినిమాపై మంచి ఆసక్తి నెలకొంది.

11/19/2016 - 21:16

లేటెస్టుగా ‘జెంటిల్‌మన్’, ‘మజ్ను’ సినిమాల తరువాత ‘నేను లోకల్’ చిత్రంలో నటిస్తున్నాడు నాని. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా తరువాత మరో భిన్నమైన సినిమా చేయడానికి ప్రయత్నాలు సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఓ కొత్త దర్శకుడితో సినిమా చేయడానికి ఓకె చెప్పాడట. ఈ చిత్రం ద్వారా శివకుమార్ అనే దర్శకుడు పరిచయం కానున్నాడు. డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం ఈనెల 23న ప్రారంభం కానుందట.

11/19/2016 - 21:48

తెలుగు సినిమాల్లో స్టార్లు గాయకులవడం మనం చూస్తున్నదే. ఇప్పుడు సింగర్ హీరోయిన్‌గా మారడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట. టాలీవుడ్‌లో ప్లేబ్యాక్ సింగర్‌గా మంచి పాపులారిటీ తెచ్చుకున్న గీతా మాధురి హీరోయిన్‌గా నటించేందుకు సన్నాహాలు చేస్తోందట. ఇంతకుముందు షార్ట్ ఫిలింస్‌లో నటించిన అనుభవమున్న గీతామాధురి, ఓ తమిళ దర్శకుడు రూపొందిస్తున్న సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి.

11/19/2016 - 04:18

ముంబైలో జరిగిన ఓ విందు కార్యక్రమానికి హాజరైన అలనాటి అందాల భామలు రేఖ, మాధురి దీక్షిత్ అందరినీ ఆకట్టుకున్నారు. ప్రఖ్యాత కంచిపట్టుచీరతో రేఖ కళకళలాడుతూ కన్పిస్తే అందమైన ఫ్యాన్సీ చీరతో మాధురి
అలరించింది.

11/18/2016 - 21:04

అల్లు అర్జున్ కథానాయకుడిగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో రాజు రూపొందిస్తున్న చిత్రం ‘దువ్వాడ జగన్నాథమ్’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ పర్యవేక్షణలో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో ఈ ఫైట్ హైలెట్‌గా నిలుస్తుందని చిత్ర యూనిట్ తెలియజేసింది.

11/18/2016 - 21:02

శివకార్తికేయన్, కీర్తి సురేష్ జంటగా బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వంలో శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మాత రాజు అందిస్తున్న చిత్రం రెమో. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల 25న విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు.

11/18/2016 - 21:01

చాలామంది నటీనటులకు బుల్లితెర తొలి వేదికగా నిలుస్తోంది. టీవీ షోల్లో నటించి మెప్పించినవారు సినిమాల్లోనూ నటిస్తున్నారు. మరికొందరు నటీనటులు వెండితెరపై అవకాశాలు మందగించినప్పుడు.. మంచి పారితోషికం ఇస్తే బుల్లితెరకు ఓకే చెప్పేస్తారు. ఆ విధంగానైనా ప్రేక్షకులకు చేరువగా ఉండొచ్చన్నది వారి ఆలోచన. ఇంతలా నటీనటులకు ఉపయోగపడుతున్న టీవీ షో అవకాశం బాలీవుడ్ బ్లాక్ బ్యూటీ బిపాసా బసుకు మాత్రం కష్టంగా అనిపిస్తోందట.

11/18/2016 - 20:59

విశాల్, తమన్నా జంటగా హరి వెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై యువ నిర్మాత జి.హరి అందిస్తున్న చిత్రం ‘ఒక్కడొచ్చాడు’. సురాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేశారు. ఈ నెలలోనే విడుదలకావలసిన ఈ చిత్రం ప్రస్తుతం నెలకొని వున్న పరిస్థితుల దృష్ట్యా డిసెంబర్‌లో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

Pages