S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

02/24/2017 - 20:52

సూపర్‌స్టార్ రజనీకాంత్, స్టార్ డైరెక్టర్ శంకర్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘రోబో.2’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. 2010లో విడుదలై రకార్డు కలెక్షన్లు కొల్లగొట్టిన ‘రోబో’కు ఈ చిత్రం సీక్వెల్‌గా వస్తోంది. భారతీయ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా యొక్క షూటింగ్ ప్రస్తుతం ఆఖరి దశలో ఉండగా హీరోయిన్ అమీ జాక్సన్ కూడా తన వంతు షూటింగ్‌ను త్వరలోనే పూర్తిచేయనుంది.

02/24/2017 - 20:50

ఎమ్.ఎస్.ఆర్. ప్రొడక్షన్స్ పతాకంపై విజయవాడలోని ఒక ప్రజానాయకుడి జీవిత చరిత్ర ఆధారంగా మరో చిత్రం తెరకెక్కనుంది. మంచాల సాయిసుధాకర్ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘రణరంగం’అనే టైటిల్‌ని ఖరారుచేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత మంచాల సాయిసుధాకర్ మాట్లాడుతూ.. ‘ప్రజల అభీష్టంమేరకు ఈ సినిమాను తెరకెక్కించనున్నాం.

02/24/2017 - 20:48

సుధీప్, నిత్యామీనన్ జంటగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో కన్నడ, తమిళ భాషల్లో రూపొందించిన చిత్రం ‘కోటికొక్కడు’. సి.ఎల్.ఎన్. మీడియా పతాకంపై లగడపాటి శ్రీనివాస్, గూడూరి గోపాల్‌రెడ్డి తెలుగులో అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అనువాద కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి.

02/24/2017 - 20:47

అందాల కథానాయిక శిల్పాశెట్టి ఫిట్‌నెస్ అనే అంశంపై పూర్తి అవగాహనతో ఉన్నదని తెలిసింది. మిసెస్ శిల్పాశెట్టి కుంద్రాగా మారిన తరువాత కూడా తన ఆరోగ్య సూత్రాలను పక్కాకా పాటిస్తూ నవతరం కథానాయికల గుండెల్లో గుబులు పుట్టిస్తూనే వుంది. ఇదివరకే యోగా సీడీల మార్కెటింగ్‌లో స్పీడ్ చూపించిన శిల్పాశెట్టి, తాజాగా ఆన్‌లైన్‌లో యోగా పాఠాలు, ఫిట్‌నెస్ సంగతులు చెప్పేందుకు సిద్ధమవుతోంది.

02/24/2017 - 20:46

ప్రస్తుతం ‘ఆక్సిజన్’ చిత్రంలో నటిస్తున్నాడు గోపీచంద్. ఈ సినిమాతోపాటు ఆయన మరో సినిమా కూడా చేస్తున్నాడు. ఇక ఇప్పటికే బి.గోపాల్ దర్శకత్వంలో మూడేళ్ళ క్రితం ప్రారంభమైన ఈ సినిమా ఇంకా పూర్తికాలేదు సరికదా.. ఎప్పుడు విడుదల అవుతుందో కూడా చెప్పలేని పరిస్థితి. గోపీచంద్ సరసన నయనతార నటిస్తున్న ఈ సినిమాకు లేటెస్ట్‌గా ఓ టైటిల్ ఓకే చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ టైటిల్ ఏమిటో తెలుసా..

02/24/2017 - 20:44

బొమ్మరిల్లు హాసినిగా తెలుగు ప్రేక్షకులలో మంచి గుర్తింపు వున్న జెనీలియా బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్‌ను పెళ్లాడి ఇద్దరు పిల్లలకు తల్లి కూడా అయింది. ఇక జెనీలియా రీఎంట్రీ ఉండదని అందరూ భావిస్తున్న తరుణంలో మరోసారి తన రీఎంట్రీని ప్రకటించి బిజీ బిజీగా షూటింగ్ చేస్తోంది. అయితే సినిమాలతో కాకపోయినా వాణిజ్య ప్రకటనలతో జెనీలియా బిజీగా వుంటోంది.

02/24/2017 - 00:27

సంక్రాంతి కానుకగా మంచి కుటుంబ కథా చిత్రంగా నిలిచి ఘన విజయం సాధించిన ‘శతమానం భవతి’ సినిమాతో దర్శకుడిగా క్రేజ్ తెచ్చుకున్న వేగేశ్న సతీష్, తన తదుపరి సినిమాకు అప్పుడే సన్నాహాలు మొదలుపెట్టాడు. ఆయన కొత్త సినిమా ‘శ్రీనివాస కల్యాణం’ పేరుతో తెరకెక్కనుంది. ‘శ్రీ’, ‘నివాస్’ అనే ఇద్దరి కథతో ఈ సినిమా ఉంటుందని, ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించే ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలనీ ప్లాన్ చేశారు?

02/24/2017 - 00:26

అది సినిమా అని తెలిసినా భక్తి సినిమాల్లో మునిగితేలిపోయే తెలుగు ప్రేక్షకుడు నిజంగా భోళాశంకరుడిలాంటివాడే. శివుడైనా, రాముడైనా, కృష్ణుడైనా సరే తెరమీదకనిపిస్తే ఆధ్యాత్మికతత్వంలో మునిగిపోయి పులకించిపోవడం కొత్తకాదు. ఇప్పుడైతే కొత్తతరం ఇష్టాలకు అనుగుణంగా సినిమాలు వస్తున్నాయి. కానీ గతంలో పౌరాణిక సినిమాలకు పెద్దఎత్తున ఆదరణ లభించేది.

02/24/2017 - 00:21

సాయిధరమ్ తేజ్, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా ‘విన్నర్’ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు గోపీచంద్ మలినేని. ‘డాన్ శీను, ‘బలుపు’ చిత్రాలతో మంచి విజయాలు అందుకున్న ఆయనకు రామ్ నటించిన ‘పండగ చేస్కో’ కాస్త నిరాశపరిచింది. దాంతో కొంత గ్యాప్ తీసుకుని మెగా మేనల్లుడుతో చేస్తున్న చిత్రం ‘విన్నర్’. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా శుక్రవారం విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు గోపీచంద్ మలినేనితో మాటామంతీ...

02/24/2017 - 00:19

సునీల్ కథానాయకుడిగా క్రాంతి మాధవ దర్శకత్వంలో యునైటెడ్ కిరీటి మూవీస్ లిమిటెడ్ పతాకంపై పరుచూరి కిరీటి రూపొందిస్తున్న చిత్రం ‘ఉంగరాల రాంబాబు’. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను శివరాత్రి సందర్భంగా విడుదల చేశారు.

Pages