S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

10/13/2016 - 20:56

సినిమా నిర్మాణమంటే 24 క్రాఫ్ట్స్ కలిసి పనిచేస్తేనే అది తెరపై అందమైన కలగా సప్తవర్ణ శోభితంగా ఉంటుంది. ఒక సినిమా నిర్మాణం వెనుక అనేకమంది కృషి వుంటుంది. ముఖ్యంగా సినిమా అనేది ఓడ అయితే, దానిని నడిపించే సరంగు దర్శకుడే. అతను చెప్పినట్లే నటీనటులు కానీ, సాంకేతిక నిపుణులు కానీ నడుచుకుంటేనే ఓ అందమైన చిత్రం ఆవిష్కృతమవుతుంది. ఇన్నాళ్లు దర్శకులు నిర్మాతలను శాసించే స్థానంలో ఉన్నారు.

10/13/2016 - 20:51

వంద చిత్రాల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు కోడి రామకృష్ణ. తన కెరీర్‌లో ఎన్నో జానర్స్‌లో సినిమాలు తీసి మెప్పించిన ఆయన, ఈమధ్య విజువల్ ఎఫెక్ట్స్ ప్రాధాన్యమున్న సినిమాలు రూపొందిస్తూ ఘన విజయాలు అందుకుంటున్నారు. తాజాగా ఇదే విజువల్ ఎఫెక్ట్స్ ప్రాధాన్యంగా కన్నడలో ఆయన చేసిన ‘నాగరహవు’ అనే సినిమాను తెలుగులో ‘నాగభరణం’ పేరుతో నిర్మాత మల్కాపురం శివకుమార్ విడుదల చేస్తున్నారు.

10/13/2016 - 20:48

అల్లు అర్జున్ కథానాయకుడిగా శ్రీ వేంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై హరీశ్ శంకర్.ఎస్ దర్శకత్వంలో రాజు రూపొందిస్తున్న చిత్రం ‘డి జె దువ్వాడ జగన్నాధమ్’. ఈ చిత్రానికి సంబంధించి మ్యూజిక్ సిట్టింగ్స్ చెన్నైలో జరుగుతున్నాయి. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ నేతృత్వంలో ఈ చిత్రానికి సంబంధించిన బాణీలను రూపొందిస్తున్నారు.

10/13/2016 - 20:47

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ సినిమాల జోరు పెంచిన విషయం తెలిసిందే. ఆయన హీరోగా నటిస్తోన్న 22వ సినిమా కాటమరాయుడు సెట్స్‌పై ఉండగానే, నిన్ననే 23వ సినిమా కూడా మొదలుపెట్టేశారు. ఆర్.టి.నేసన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ ఇప్పటికే దాదాపుగా పూర్తికాగా, టీమ్ క్యాస్టింగ్ ప్రక్రియ మొదలుపెట్టిందట. పవన్ సరసన హీరోయిన్‌గా నయనతారను సంప్రదించినట్లు తెలుస్తోంది.

10/13/2016 - 20:45

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా అయిన ‘ఖైదీ నెం.150’ కొద్ది నెలలుగా నిరంతరాయంగా షూటింగ్ జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో చిరు తనయుడు రామ్‌చరణ్ స్వయంగా నిర్మిస్తున్నారు.

10/13/2016 - 20:42

ధనుష్ తొలిసారిగా ద్విపాత్రాభినయంలో నటిస్తున్న చిత్రం ‘్ధర్మయోగి’. తమిళంలో ‘కొడి’ పేరుతో రూపొందిస్తున్న ఈ చిత్రంలో త్రిష, అనుపమా పరమేశ్వరన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఆర్.ఎస్.దురై సెంథిల్‌కుమార్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సిహెచ్.సతీష్‌కుమార్ అందిస్తున్నారు. నరసింహ చిత్రంలో నీలాంబరి పాత్రలో రమ్యకృష్ణ అలరించిన విషయం తెలిసిందే.

10/13/2016 - 20:40

తెలుగులో టాప్ హీరోయిన్ రేసులో రకుల్ ప్రీత్‌సింగ్ ముందుండి దూసుకుపోతోంది. సూపర్‌స్టార్ మహేష్‌తో ఓ సినిమా, రామ్‌చరణ్‌తో ధ్రువ అనే సినిమా, సాయిధరమ్ తేజ్‌తో ఓ సినిమా ఇలా వరుసగా సినిమాలు చేసుకుంటూ ఖాళీలేకుండా కష్టపడుతున్న ఈ భామ ఈమధ్యే తమిళంలో విశాల్ హీరోగా తెరకెక్కనున్న ‘తుప్పరివాలన్’ అనే సినిమాకు కూడా రకుల్ హీరోయిన్‌గా ఓకే అనేసింది.

10/12/2016 - 21:19

సాయికుమార్, సుమన్ ప్రధాన తారాగణంగా టీమ్ ఇండియా ప్రొడక్షన్స్ ప్రై. లి. పతాకంపై అల్లాణి శ్రీధర్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘చిలుకూరి బాలాజీ’. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేశారు. యు సర్ట్ఫికెట్ లభించిన ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.

10/12/2016 - 21:18

సుదీప్, నిత్యామీనన్ జంటగా సి.ఎల్.ఎన్. మీడియా లగడపాటి శ్రీనివాస్, గూడూరి గోపాల్‌శెట్టి అందిస్తున్న చిత్రం ‘కోటికొక్కడు’. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను ఇటీవల విడుదల చేశారు.

10/12/2016 - 21:17

నవీన్‌చంద్ర, శృతిసోధి జంటగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై ఇ.సత్తిబాబు దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ రూపొందించిన చిత్రం ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేశారు.

Pages