S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/15/2016 - 20:45

జి9 ఫిలిమ్స్ పతాకంపై సలీమ్, పాఠక్ హీరో హీరోయిన్లుగా ఫరుూమ్ సర్కార్ దర్శకత్వంలో సమీనా యాస్మిన్ నిర్మాతగా ‘బంజారా టైగర్స్’ చిత్రం ఆదివారం ఆదిలాబాద్ మెయిన్ సెంటర్ అంబేద్కర్ చౌక్‌లో అత్యంత భారీ జన సందోహం మధ్యలో ఘనంగా ప్రారంభమైంది.

11/15/2016 - 20:43

ముంబైలో జరిగిన ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవంలో చిన్నితెర నటీమణులు తళుక్కున మెరిశారు. నాగిన్ సీరియల్‌తో విశేష ప్రజాదరణ పొందిన నటిగా వౌనిరాయ్ అవార్డును గెలుచుకుంది. బంగారురంగు దుస్తుల్లో ఆమె మెరిసిపోయింది. ఈ కార్యక్రమంలో రుబినాదిలైన్, హెల్లిషా సహా పలువురు తారలు పాల్గొన్నారు.

11/13/2016 - 21:03

ఈమధ్య టాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతోంది గ్లామర్ భామ రకుల్ ప్రీత్‌సింగ్.
వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటూ క్రేజ్ తెచ్చుకున్న ఈమెకు ఓ దశలో మెగా హీరోయిన్ అనే బిరుదు వచ్చింది. ఎందుకంటే, వరుసగా మెగా హీరోల సినిమాల్లో నటిస్తూ
సంచలనం రేపింది. ప్రస్తుతం మహేష్‌బాబు సరసన హీరోయిన్‌గా నటిస్తున్న రకుల్‌కు మరో క్రేజీ

11/13/2016 - 21:01

ప్రముఖ దర్శకుడు మణిరత్నం సినిమాలంటే ఇష్టపడని ప్రేక్షకుడు వుండడు. ప్రేమకథా చిత్రాలను తెరకెక్కించడంలో ఆయన శైలే వేరు. ఆయన తెరకెక్కించిన చిత్రాలు తమిళంతోపాటు తెలుగులోనూ ఘనవిజయాలు సాధించాయి. ‘ఓకె బంగారం’ తరువాత ఆయన రూపొందిస్తున్న చిత్రం ‘డ్యుయెట్’. కార్తీ హీరోగా తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ లవ్ స్టోరీ చిత్రాన్ని తెలుగులో ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేస్తున్నారు.

11/13/2016 - 20:59

‘సత్యహరిశ్చంద్ర’ పద్య నాటకం నాటినుంచి నేటివరకూ అందరినీ అలరిస్తూనే వుంటుంది. ఈ నాటకం తాజాగా అదే పేరుతో సినిమాగా రూపొందింది. ప్రముఖ రంగస్థల నటి మంగాదేవి ఇందులో సత్యహరిశ్చంద్ర పాత్రలో నటించడం విశేషం. మోరల్ ప్రొడక్షన్స్ పతాకంపై రంగస్థల నటుడు వై.గోపాలరావు దర్శకత్వం వహించగా కొత్తపల్లి సీతారాము నిర్మించారు.

11/13/2016 - 20:57

అల్లు అర్జున్ తాజాగా ‘సరైనోడు’ చిత్రంతో మంచి కమర్షియల్ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన నటిస్తున్న చిత్రం ‘దువ్వాడ జగన్నాథం డి.జె’. హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే జోరుగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ న్యూలుక్‌లో కన్పిస్తాడని తెలిసింది. త్వరలోనే ఈ లుక్‌కు సంబంధించిన స్టిల్ విడుదల చేస్తారట.

11/13/2016 - 20:55

రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న ‘ధ్రువ’ చిత్రం షూటింగ్ పూర్తికావచ్చింది. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 2న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ చిత్రం తరువాత రామ్‌చరణ్ సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే.

11/13/2016 - 20:53

మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం గుంటూరోడు. సత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం క్లైమాక్స్ చిత్రీకరణ జరుపుకుంటోంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మనోజ్ సరసన కంచె ఫేం ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. త్వరలోనే షూటింగ్ పూర్తిచేసి డిసెంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

11/13/2016 - 20:51

ఈమధ్య బాలీవుడ్ హీరోయిన్ల ప్రేమాయణాలు కొత్త కొత్త మలుపులు తిరుగుతూ ప్రేక్షకులను తికమకపెట్టేస్తున్నాయి. ఇప్పటికే పలువురు భామలు ఘాటు ప్రేమాయణంలో మునిగిపోయారు. తాజాగా మరో ప్రేమాయణాన్ని కొత్తగా మొదలుపెట్టింది అందాల భామ కత్రినాకైఫ్. ఈమె కొంతకాలంగా రణబీర్‌కపూర్‌తో ఘాటు ప్రేమాయణం సాగించింది. వీరిద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. వీరి వ్యవహారంపై బాలీవుడ్ కోడై కూసింది కూడా.

11/13/2016 - 20:47

ప్రముఖ నటుడు పవన్‌కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కాటమరాయుడు’. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని మార్చిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. డాలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బ్రేక్ పడింది. దానికి కారణం పవన్ ఇటీవలే అనంతపురం జిల్లాలో బహిరంగ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. దాంతోపాటు గుత్తిలో కాలేజీ విద్యార్థులతో సమావేశమయ్యాడు.

Pages