S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/10/2016 - 23:49

హృతిక్ రోషన్ కథానాయకుడిగా భారీ యాక్షన్ థ్రిల్లర్ కాబిల్ చిత్రాన్ని తెలుగులో ‘బలం’గా అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. రాకేష్ రోషన్ నేతృత్వంలో రూపొందిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. యామీగౌతమ్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి సంబంధించిన పాటలపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

11/10/2016 - 23:48

అందాల భామ హన్సిక ఈమధ్య తెలుగులో కంటే కూడా తమిళంలోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంటోంది. ముఖ్యంగా పలు తమిళ చిత్రాల్లో నటిస్తూ అక్కడే బిజీగా మారిపోయింది. దాంతోపాటు తెలుగులో కూడా స్టార్ హీరోయిన్‌గా వెలగాలనే ప్రయత్నాలు మాత్రం చేస్తూనే వుంది. తాజాగా ఈమె గోపీచంద్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. గోపీచంద్ ప్రస్తుతం ఆక్సిజన్ చిత్రంలో నటిస్తున్నాడు.

11/10/2016 - 23:47

తనకు అవకాశాలివ్వమని అవతలివాళ్లను అడగడం ఇష్టముండదని, ఎవరివద్దా చేతులు కట్టుకుని నిలబడాల్సిన అవసరమే లేదని చెబుతోంది అందాల భామ ఇలియానా. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా వెలిగిన ఈమె, బాలీవుడ్‌పై వున్న ఆసక్తితో అక్కడికి చెక్కేసింది. సౌత్‌నుండి చాలా అవకాశాలు వచ్చినా కూడా దేనికీ ఓకె చెప్పలేదు.

11/10/2016 - 23:45

వెంకటేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గురు’. బాలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన ‘సాల ఖుద్దూస్’ చిత్రానికి రీమేక్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో వెంకటేష్ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందే ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగింది. ఇప్పటికే సంక్రాంతి కానుకగా చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం ‘ఖైదీ నెం.150’ విడుదలకు ఫిక్స్ అయింది.

11/10/2016 - 23:44

చిరంజీవి కథానాయకుడిగా రూపొందిస్తున్న ఖైదీ నెం.150 (బాస్ ఈజ్ బ్యాక్) చిత్రానికి సంబంధించిన పాటల చిత్రీకరణ యూరప్‌లో జరుగనుంది. సంక్రాంతికి విడుదల చేయడానికి జెట్ స్పీడ్‌తో సినిమాను తెరకెక్కిస్తున్నారు. కాజల్ కథానాయికగా కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ పతాకంపై వి.వి.వినాయక్ దర్శకత్వంలో రామ్‌చరణ్ రూపొందిస్తున్నారు.

11/10/2016 - 23:42

ఖయ్యుమ్, నందినీ కపూర్ జంటగా షిరిడి సాయి క్రియేషన్స్ పతాకంపై అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ దర్శకత్వంలో తాడి మనోహర్ కుమార్ నిర్మిస్తున్న పొలిటికల్ క్రైమ్ థిల్లర్ చిత్రం ‘డర్టీగేమ్’. ఈ చిత్రం టాకీపార్ట్ పూర్తిచేసుకుంది. దర్శకుడు మాట్లాడుతూ, డర్టీగేమ్ చాలా బాగా వచ్చిందని, కథలో వైవిధ్యం ఉంటుందని, చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు.

11/10/2016 - 23:40

తమిళ నటుడు ధనుష్ హీరోగా వచ్చిన రఘువరన్ బి.టెక్ తెలుగులో విడుదలై సంచలన విజయం నమోదు చేసుకుంది. తమిళంతోపాటు తెలుగులోనూ విడుదలైన ఈ సినిమా రెండు భాషల్లో ఘనవిజయాన్ని సాధించడంతో, దానికి సీక్వెల్‌గా వి.ఐ.పి-2 పేరుతో తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రజనీ చిన్న కుమార్తె సౌందర్య దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని ధనుష్ నిర్మిస్తున్నారు.

11/10/2016 - 23:39

అల్లరి నరేష్ కథానాయకుడిగా జి.నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై ఛత్రపతి ప్రసాద్ రూపొందించిన ‘ఇంట్లో దెయ్యం.. నాకేం భయం’ నేడు విడుదల కావలసి వుంది. కానీ ఈ చిత్రం విడుదలను వాయిదావేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- శుక్రవారం విడుదలకావలసిన ఈ చిత్రం ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా విడుదలను వాయిదా వేశామని, త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపారు.

11/10/2016 - 23:38

శ్రీలక్ష్మి వెంకటరమణ మూవీస్ పతాకంపై శ్రీరామ్ దర్శకత్వంలో లీలా కార్తీక్, స్వప్న హీరో హీరోయిన్లుగా యు.ఎస్.రామచంద్రరావు నిర్మిస్తున్న లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘సక్కనోడు చిక్కినా అందమే’. దర్శకుడు శ్రీరామ్ మాట్లాడుతూ నేటి ట్రెండ్‌కి తగ్గ లవ్‌స్టోరీతో యూత్‌నే కాకుండా ఫ్యామిలీ మొత్తాన్ని ఆకట్టుకునే సబ్జెక్ట్ ఇది. కిషన్ కవాడియా సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానుంది.

11/10/2016 - 23:37

ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ఫస్ట్‌ఫ్రేమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తికావచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాన్ని వినూత్నంగా ప్రారంభించారు. భారతదేశ శత పుణ్యక్షేత్ర జైత్రయాత్రను నటుడు బాలకృష్ణ ప్రారంభించారు.

Pages