S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

02/17/2017 - 20:51

సాయిధరమ్‌తేజ్, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్, ఠాగూర్ మధు నిర్మిస్తున్న చిత్రం ‘విన్నర్’. ఈ చిత్రంలో గ్లామర్ యాంకర్ అనసూయ ప్రత్యేక పాటలో కన్పించగా, మరో యాంకర్ సుమ ఈ పాట పాడింది. ‘సూయ సూయ..’ అంటూ ఈ పాట సాగుతుంది. ఈ చిత్రం ఈనెల 24న విడుదలవుతున్న సందర్భంగా ఇద్దరు యాంకర్లు చెప్పిన విశేషాలు..

02/17/2017 - 20:49

హాలీవుడ్‌లో బాలీవుడ్ హీరోయిన్ల హవా మొదలైంది. ఇప్పటికే ‘క్వాంటికొ’ సీరియల్‌తో అక్కడి ప్రేక్షకుల మనసు దోచిన ప్రియాంకచోప్రా ‘బేవాచ్’ చిత్రంలో నటిస్తోంది. ఇక దీపిక పదుకొనే ‘ట్రిపుల్ ఎక్స్’ సినిమాతో అరంగేట్రం చేసింది. అయితే అవకాశం దొరకబుచ్చుకునేందుకు వచ్చిన ఏ అవకాశాన్ని వీరిద్దరూ వదులుకోవడం లేదు. ప్రచార కార్యక్రమాలు, టీవీ షోలు, ఫ్యాషన్ షోలకు విధిగా హాజరై తమ అందచందాలతో ఆకట్టుకుంటున్నారు.

02/17/2017 - 20:47

తెలుగు సినిమా పరిశ్రమలో ఆర్.పి.పట్నాయక్ అంటే ఓ సంచలనం. ఆయన సంగీతం అందించిన చాలా సినిమాలు మ్యూజికల్ హిట్స్‌గా సంచలనం సృష్టించాయి. ఎన్నో చిత్రాలకు సంగీతంతో ప్రాణం పోసిన ఆర్.పి.పట్నాయక్ ఈమధ్య నటుడు, దర్శకుడిగా మారిన విషయం తెలిసిందే. తాజాగా మళ్లీ తన సంగీతంతో ప్రేక్షకుల్ని మెప్పించే ప్రయత్నాలు చేస్తున్నాడు.

02/17/2017 - 20:45

గత ఏడాది ప్రేమమ్, సాహసం శ్వాసగా సాగిపో సినిమాలతో మంచి విజయాలు అందుకుని జోరుమీదున్నాడు అక్కినేని నాగచైతన్య. దాంతోపాటు అందాల భామ సమంతతో ప్రేమాయణం సాగిస్తూ ఈమధ్యే నిశ్చితార్థం కూడా జరుపుకున్నాడు. ప్రస్తుతం కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న చైతన్య, తమిళంలోకి ఎంట్రీ ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నాడట. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చర్చలు కూడా పూర్తయ్యాయని సమాచారం.

02/17/2017 - 20:43

‘ఝుమ్మంది నాదం’ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సొట్టబుగ్గల తాప్సికి తెలుగులో పెద్దగా కమర్షియల్ విజయాలు అందుకోలేకపోయింది. అవకాశాలైతే చాలానే పట్టేసింది కానీ అనుకున్న స్థాయిలో హీరోయిన్‌గా నిలబడలేకపోయింది. దాంతో అటు కోలీవుడ్‌లోనూ ట్రైచేసినా అదే పరిస్థితి. ఐదారేళ్లు ఇండస్ట్రీలో గట్టిగానే ప్రయత్నం చేసిన తాప్సి మొత్తానికి బాలీవుడ్‌కి చెక్కేసింది.

02/17/2017 - 20:42

ఉషామూవీస్ సమర్పణలో ఆర్ ఫిలిం ఫ్యాక్టరీ, బొమ్మన ప్రొడక్షన్స్ పతాకాలపై రాజా రామ్మోహన్ చల్లా దర్శకత్వంలో తూమ రామారావు, బొమ్మన సుబ్బరాయుడు, రాజేష్ రంభల సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘కేరాఫ్ గోదావరి’ అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 24న విడుదలవుతున్న సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సంగీత దర్శకుడు రవి కుంచె మాట్లాడుతూ- గోదావరి గురించి, అందులో ప్రయాణం గురించి

02/17/2017 - 20:40

ఈమధ్య మెగా హీరోలతో వరుసగా ఐటెం సాంగ్స్ చేస్తూ జోరుమీదుంది అందాల భామ రాయ్‌లక్ష్మి. పవన్‌తో సర్దార్ గబ్బర్‌సింగ్, చిరంజీవితో ‘ఖైదీ నెం 150’ సినిమాల్లోని ఐటెం సాంగ్స్‌తో తన కెరీర్‌గ్రాఫ్‌ని ఇంకాస్త పొడిగించుకుంది. ఈ సినిమాల తరువాత ఈ అమ్మడికి మరిన్ని ప్రత్యేక సాంగ్స్ చేయమని అవకాశాలు వస్తున్నాయట. ముఖ్యంగా లారెన్స్ నటిస్తున్న ‘మెట్టశివ కెట్ట శివ’, ‘శివలింగ’ చిత్రాల్లో ప్రత్యేక పాటల్లో కనిపించనుంది.

02/16/2017 - 21:14

మహేష్‌బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం చివరి షెడ్యూల్ రేపటినుండి ముంబైలో మొదలుకానుంది. సినిమా మొదలై ఏడాది కావస్తున్నా ఇంతవరకు ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ కాని, ఫస్ట్‌లుక్ కాని, చివరికి టైటిల్ కానీ ప్రకటించలేదు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు మొదలయ్యాయి. మహేష్ ఫాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మహేష్ ఫ్యాన్స్‌కు సంతోషం కలిగించే న్యూస్ ఏమిటంటే..

02/16/2017 - 21:13

శ్రీకాంత్ కథానాయకుడిగా విజిచరీష్ యూనిట్ దర్శకత్వంలో విజయ్, శ్రీమిత్రచౌదరి సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘రారా’. ఈ చిత్రానికి సంబంధించిన తొలి ప్రచార చిత్రాన్ని చిరంజీవి తన స్వగృహంలో గురువారం ఉదయం విడుదల చేశారు.

02/16/2017 - 21:11

చిరంజీవి కుటుంబం నుండి మొట్టమొదటి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి సంచలనం సృష్టించిన మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల తన మొదటి సినిమా ‘ఒక మనసు’తో గొప్ప విజయాన్ని సాధించలేకపోయినప్పటికీ నటిగా మాత్రం మంచి మార్కులే తెచ్చుకుంది. ఆ తర్వాత కొంత సమయం తీసుకుని కెరీర్ గురించి బాగా ఆలోచించిన ఈమె మరో మెట్టు పైకెక్కుతూ తమిళ పరిశ్రమలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది.

Pages