S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/22/2017 - 21:33

వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్న యంగ్ హీరో నాని తన హిట్ దర్శకుడితో మరో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడని సమాచారం. ఆ దర్శకుడే హను రాఘవపూడి. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాని నూతన దర్శకుడు శివ నిర్మాణ దర్శకత్వంలో ‘నిన్నుకోరి’ సినిమా చేస్తున్నాడు.

04/22/2017 - 21:24

మిల్కీ భామ తమన్నాకు ఈమధ్య అంతగా కలిసిరావడంలేదు. బాహుబలి-2లో నటిస్తున్న తమన్నా, ఆ సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. మొన్నటివరకు క్రేజీ హీరోయిన్‌గా ఉన్న ఈ అమ్మడి కెరీర్‌కి బ్రేక్ వేసింది అభినేత్రి సినిమా. ఎన్నో ఆశలు పెట్టుకుని అందరినీ భయపెట్టి సక్సెస్ కొట్టాలనుకున్న తమన్నాకు తీవ్ర నిరాశే మిగిలింది. ఈ సినిమాతో హిట్ కొట్టలేదు సరికదా.. కనీసం సరిగ్గా భయపెట్టలేకపోయింది.

04/22/2017 - 21:22

శ్రీ ఈశ్వరా క్రియేషన్స్ పతాకంపై బెజవాడ ఆనందముని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కీర్తన’. సంస్కారవంతమైన ఓ తెలుగు సినిమా అనే ఉపశీర్షికతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నూతన తారాగణం నటించనున్నారు.

04/22/2017 - 21:20

సూపర్‌స్టార్ రజనికాంత్ హీరోగా సంచలన దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన రోబో ఘన విజయం సాధించడంతో దానికి సీక్వెల్‌గా రూపొందిస్తున్న చిత్రం ‘రోబో 2.0’. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. హై టెక్నికల్ స్టాండర్డ్‌తో హాలీవుడ్ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ విలన్‌గా నటిస్తుండగా, అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

04/22/2017 - 21:18

సౌత్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన త్రిషకు ప్రేక్షకుల్లో ఇప్పటికీ బ్రహ్మాండమైన ఫాలోయింగ్ వుంది. ప్రస్తుతం గ్లామర్ రోల్స్‌కి బ్రేక్ ఇచ్చి పూర్తిగా కథాపరమైన, హీరోయిన్ సెంట్రిక్ సినిమాలనే చేస్తున్న ఆమె తాజాగా మోహిని, శతురంగ వెట్టై, గర్జానై వంటి మూడు సినిమాల్ని ఒకేసారి పూర్తిచేసేశారు. త్రిష గత మూడు, నాలుగు నెలలుగా ఏ మాత్రం గ్యాప్ లేకుండా ఈ సినిమాలపైనే పనిచేశారు.

04/22/2017 - 21:16

వరుస సక్సెస్‌లతో దూసుకెళ్తున్న అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం ‘డి.జె, దువ్వాడ జగన్నాథం’.

04/21/2017 - 21:00

నూతన కథానాయకుడు దిలీప్ ప్రకాష్, రెజీనా జంటగా సాయి అరుణాచలేశ్వరా క్రియేషన్స్ పతాకంపై అర్జున్ సాయి దర్శకత్వంలో నవీన్ రెడ్డి.ఎన్ రూపొందిస్తున్న చిత్రం ‘హరే రామ హరే కృష్ణ’. ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో జరిగింది. ముహూర్తపు సన్నివేశంపై దర్శకుడు చందూ మొండేటి క్లాప్‌నివ్వగా, కోటగిరి వెంకటేశ్వరరావు కెమెరా స్విచ్చాన్ చేశారు.

04/21/2017 - 20:58

మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ నటించనున్న 1000 కోట్ల ప్రాజెక్టు అన్ని భాషల పరిశ్రమల్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ప్రముఖ రచయిత, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత వాసుదేవన్ నాయర్ రచించిన ‘రండమోజమ్’ అనే నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త, ఫిలాంత్రఫిస్ట్ అయిన డా.బి.ఆర్.శెట్టి ఈ భారీ ప్రాజెక్టును నిర్మించనున్నారు.

04/21/2017 - 20:56

నయనతార కథానాయికగా శ్రీరామ్ సినిమా పతాకంపై ఎస్.ఆర్.మోహన్ తెలుగులో అందిస్తున్న చిత్రం ‘వాసుకి’.

04/21/2017 - 20:55

నాని కథానాయకుడిగా డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎల్.ఎల్.పి పతాకంపై శివ నిర్వాణ దర్శకత్వంలో దానయ్య డి.వి.వి. రూపొందించిన చిత్రం ‘నిన్నుకోరి’. ఈ చిత్రం జూన్ 23న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- అమెరికాలో భారీ షెడ్యూల్ చేశామని, ఈనెల 17నుండి వైజాగ్‌లో షూటింగ్ జరుపుతున్నామని, ఇది 29వరకూ జరుగుతుందని తెలిపారు.

Pages