S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/21/2017 - 20:54

అల్లు అర్జున్, రచయిత నుండి దర్శకుడిగా మారనున్న వక్కంతం వంశీ మొదటి సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హరీశ్ శంకర్ చేస్తున్న ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాతో బిజీగా వున్న బన్నీ అది పూర్తవగానే వంశీ ప్రాజెక్టులో పాల్గొంటాడు. ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమాకు ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారు.

04/21/2017 - 20:51

దర్శకుడు భారతీరాజా తనయుడు మనోజ్ భారతీరాజా కథానాయకుడిగా సాయిప్రసన్న పిక్చర్స్ పతాకంపై డి.సురేష్ దర్శకత్వంలో బి.వి.ఎన్.పవన్‌కుమార్, కోలవెన్ను ఆంజనేయప్రసాద్ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘బేబి. తమిళంలో విజయవంతమైన ఈ చిత్రాన్ని అదే పేరుతో విడుదల చేస్తున్నారు. షిరాగార్గ్, అంజలీరావు కథానాయికలుగా నటించిన ఈ చిత్రంలో బేబి శాతన్య, బేబి శ్రీవర్షిణి కీలక పాత్రల్లో నటించారు.

04/21/2017 - 20:50

దేవరకొండ విజయ్ కథానాయకుడిగా జిఎ2 పతాకంపై పరశురామ్ దర్శకత్వంలో బన్నీ వాసు రూపొందిస్తున్న చిత్రం శుక్రవారంనాడు హైదరాబాద్‌లో ప్రారంభమైంది. అల్లు అయాన్ కెమెరా స్విచ్చాన్ చేయగా, బేబి అల్లు అన్విత క్లాప్‌నివ్వగా తొలి షాట్ చిత్రీకరించారు. ఈ సందర్భంగా బన్ని వాసు మాట్లాడుతూ- మే రెండవ వారం నుండి సెట్స్‌మీదకు వెళ్లనున్నామని తెలిపారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉంటుందని అన్నారు.

04/21/2017 - 20:47

శ్రీ సరస్వతి ఫిలింస్ పతాకంపై నాగఅనే్వష్, హెబ్బాపటేల్ జంటగా పళని దర్శకత్వంలో సింధూరపువ్వు కృష్ణారెడ్డి నిర్మాణ సారథ్యంలో నిర్మిస్తున్న చిత్రం ‘ఏంజెల్’. సోషియో ఫాంటసీ కథనంతో తెరకెక్కిన ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ హైదరాబాద్‌లో దర్శకుడు వి.వి.వినాయక్ విడుదల చేశారు.

04/21/2017 - 20:46

మనోజ్ నందన్, ప్రియాసింగ్ హీరో హీరోయిన్లుగా సత్యవరపు వెంకటేశ్వరరావు దర్శకత్వంలో నిర్మాత హసీబుద్దీన్ రూపొందిస్తున్న చిత్రం ‘మనసైనోడు’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ నానాక్‌రామ్‌గూడాలో శరవేగంగా సాగుతోంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ మంచి నటీనటులతో వైవిధ్యభరితంగా చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ప్రస్తుతం 80 శాతం టాకీ పూర్తిచేశాం.

04/21/2017 - 20:44

రాకేష్, రమ్య జంటగా ఎఎంజె ఫిలింస్ పతాకంపై జనార్దన్ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘అనుకోని ఓ కథ’. చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాల్లో జరిగింది. సెన్సార్ కార్యక్రమాలనూ ముగించారు. ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ ‘సెన్సార్ నుంచి ప్రశంసలు అందుకున్న చిత్రమిది.

04/21/2017 - 20:43

బాలీవుడ్‌లోకి పోర్న్‌స్టార్‌గా ఎంట్రీతో సంచలనం రేపిన సన్నీలియోన్ అంటే ఎలాంటి క్రేజ్ ఉందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అంతకుముందు తన హాట్ హాట్ అందాలను ఎరగా వేసి.. అప్పుడప్పుడు సంచలన కామెంట్స్ చేసే హాట్ బాంబ్ రాఖీ సావంత్‌కు సన్నీ ఎంట్రీతో బాలీవుడ్‌లో అవకాశాలు తగ్గిపోయాయి. దాంతో సన్నీ అంటే ఫైర్ అయ్యే రాఖీ సావంత్.. మొత్తానికి సన్నీని బీట్ చేయాలని తెగ ప్రయత్నాలు చేసింది.

04/20/2017 - 21:06

నాగచైతన్య, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై కళ్యాణకృష్ణ కురసాల దర్శకత్వంలో అక్కినేని నాగార్జున రూపొందిస్తున్న లవ్, ఎమోషనల్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘రారండోయ్ వేడుక చూద్దాం’. జగపతిబాబు, సంపత్ ప్రధాన తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రం ఒక పాట మినహా షూటింగ్ పూర్తయింది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని మే మూడవ వారంలో వేసవి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

04/20/2017 - 21:03

గ్లామర్ భామ లావణ్య త్రిపాఠి లేటెస్టుగా మిస్టర్ సినిమాతో మెగా హీరో వరుణ్ సరసన నటించింది. తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ జోరుమీదున్న ఈ అందగత్తె, తమిళంలో రెండు సినిమాలు చేస్తోంది. ఇప్పటికే నాగచైతన్య సరసన ‘రారండోయ్.. వేడుక చూద్దాం’లో నటిస్తున్న లావణ్య మరో తెలుగు సినిమాకు ఓకే చెప్పింది. అయితే, ఆ తరువాతి చిత్రం కూడా మెగా హీరోదే కావడం విశేషం.

04/20/2017 - 21:01

రెబల్‌స్టార్ ప్రభాస్ దర్శకుడు సుజీత్‌తో కలిసి కొత్త చిత్రాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు టీజర్‌కు సంబంధించిన షూటింగ్ మాత్రమే జరుపుకున్న ఈ చిత్రం ‘బాహుబలి- ది కంక్లూజన్’ తర్వాత పూర్తిస్థాయి రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లనుంది. ఇప్పుడిప్పుడే సినీ వర్గాలనుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం ఫస్ట్‌లుక్, టైటిల్ ఏప్రిల్ 23వ తేదీన రిలీజవుతాయని తెలుస్తోంది.

Pages