S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/12/2016 - 20:58

ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న భక్తిరస చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రానికి ‘ఓం నమో వేంకటేశాయ’ టైటిల్‌ను నిర్ణయించారు. వేంకటేశ్వరస్వామి పరమభక్తుడైన హాథీరామ్‌బాబా జీవిత కథతో తెరకెక్కే ఈ చిత్రాన్ని మహేష్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్లుగా అనుష్క, ప్రజ్ఞాజైస్వాల్‌లు ఎంపికయ్యారు.

06/12/2016 - 20:56

బాలీవుడ్ హాట్ భామ దీపికాపదుకొనేకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. గ్లామర్‌తోపాటు నటనలో కూడా మంచి సత్తావున్న హీరోయిన్‌గా ఇమేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో క్రేజీ అవకాశాలతో దూసుకుపోతున్న ఈ భామకు కమర్షియల్ యాడ్స్ విషయంలోనూ అంతే డిమాండ్ ఉంది. తాజాగా ఓ ప్రైవేట్ యాడ్‌కోసం దీపిక తీసుకునే రెమ్యునరేషన్ విని షాకయ్యారట వాళ్లు.

06/12/2016 - 20:55

రామ్, రాశీఖన్నా జంటగా 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర వివరాల గురించి నిర్మాతలు తెలియజేశారు.‘మొదటి షెడ్యూల్ పూర్తయింది. జూన్ 14నుండి 30వరకు వైజాగ్‌లో రెండో షెడ్యూల్‌ను జరపనున్నాం. రామ్, సంతోష్ శ్రీనివాస్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ‘కందిరీగ’ చిత్రం సంచలన విజయం సాధించింది.

06/12/2016 - 20:53

‘బాయ్స్’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’,‘బొమ్మరిల్లు’ వంటి చిత్రాలతో తెలుగు హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు సిద్ధార్థ్. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ అవి తన కెరీర్‌కి సరైన సక్సెస్‌ను ఇవ్వలేకపోయాయి. దాంతోపాటు హిందీలో కూడా రెండు మూడు చిత్రాల్లో నటించిన సిద్ధార్థ్ కొంత గ్యాప్ తర్వాత మరో చిత్రంతో ముందుకు రానున్నాడు.

06/11/2016 - 21:11

మెగాస్టార్ కుటుంబం నుండి ఓ హీరోయిన్ తెరంగేట్రం చేస్తోంది. ఆమెకోసం అందరూ ఆశ్చర్యంగానే ఎదురుచూస్తున్నారు. దాదాపుగా హీరోల కుటుంబాలనుండి హీరోయిన్లు వచ్చిన విషయం అరుదైనదే. ఇప్పుడు నాగబాబు కుమార్తె ‘ఒక మనసు’ చిత్రంతో కథానాయికగా తెరంగేట్రం చేస్తున్నారు.

06/11/2016 - 21:09

కె.రాఘవేంద్రరావు దర్శకుడుగా ఉన్నాడు అంటే ఆ చిత్రం హిట్ అయినట్లే. ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టినట్లే. ఆయన కెరీర్‌లో అనేక హిట్స్ ఉన్నాయి. రాఘవేంద్రరావు మార్క్ అనేది ప్రతీ చిత్రంలో ఆయన చూపారు. అందుకే ఆయనను అభిమానులు దర్శకేంద్రుడు అని పిలుచుకుంటారు. దాదాపు 100 సినిమాలకుపైగా రూపొందించిన ఆయన తాజాగా సినీపాఠాలను చెప్పడానికి సిద్ధమయ్యారు.

06/11/2016 - 21:08

- నిర్మాత ఎం.ఎస్.రాజు

06/11/2016 - 21:05

చెన్నమనేని శ్రీ్ధర్, జ్యోతిసేథి, సంజన, శ్రవణ్ కీలక పాత్రల్లో పల్లెల వీరారెడ్డి (చె గువేరా) దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘హ్యాపీ బర్త్‌డే’. ఈ చిత్రాన్ని శ్రీనందన్ మూవీస్ పతాకంపై మహేష్ కల్లె నిర్మిస్తున్నారు.

06/11/2016 - 21:02

గోపీచంద్, రాశీఖన్నా జంటగా జగపతిబాబు ముఖ్యపాత్రలో ఎ.ఎం.జ్యోతికృష్ణ దర్శకత్వంలో శ్రీ సాయిరాం క్రియేషన్స్ పతాకంపై ఎస్. ఐశ్వర్య నిర్మిస్తున్న చిత్రం ‘ఆక్సిజన్’.

06/11/2016 - 21:00

భీమగాని సుధాకర్‌గౌడ్ స్వీయ దర్శకత్వంలో శ్రీలక్ష్మీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సమర్పణలో సంతోష్ ఫిలింస్ పతాకంపై బాలల చిత్రంగా రూపొందించిన చిత్రం ‘ఆదిత్య’. ‘క్రియేటివ్ జీనియస్’ ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కిన ఈ చిత్రం అమెరికాలోని లాస్‌ఏంజిలిస్‌లో నిర్వహించిన జెన్రీ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో బాలల చిత్ర ప్రదర్శనకు ఎంపికై ఉత్తమ చిత్రంగా అవార్డును సొంతం చేసుకుంది.

Pages