S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/15/2017 - 21:02

నటిగా భిన్నమైన పాత్రలు చేయాలని ఉంది. ముఖ్యంగా మోడ్రన్ పాత్రల కోసం ఎదురు చూస్తున్నా2 అంటోంది లావణ్య త్రిపాఠి. అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన లావణ్య, తరువాత పలు ప్రాజెక్టులతో క్రేజీ హీరోయిన్ అయ్యింది. ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో మెగా హీరో వరుణ్‌తేజ్ సరసన ‘మిస్టర్’ చిత్రంలో మురిపించింది.

04/15/2017 - 21:00

ప్రేమ కథలు ఇప్పటికే చాలామంది దర్శకులు చాలా రకాలుగా చెప్పారు. కానీ, ఎవరు ఎలాంటి కథతో వచ్చినా లవ్ సబ్జెక్టు అనేసరికి అందులో ఓ ఫ్రెష్‌నెస్ ఉంటుంది అంటున్నాడు దర్శకుడు కిషోర్. కృష్ణచైతన్య, రాజేష్ రాధోడ్ లీడ్‌రోల్స్‌లో కిశోర్ స్వీయ దర్శకత్వంలో బిగ్ వింగ్ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై రూపొందిస్తున్న చిత్రం ఓ పిల్లా నీవల్లా.

04/15/2017 - 20:59

ధృవ, అతిథి ఆర్య లీడ్‌రోల్స్‌లో స్వరూప్‌రాజ్ మేడార దర్శకత్వంలో రూపొందిన 3ఎప్పటికీ ప్రేమ2 ఆల్బమ్ రిలీజైంది. ఇండిపెండెంట్ ఆల్బమ్‌తో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాడు ధృవ. శైలేష్ సువర్ణ సంగీతం అందించిన ఈ పాట విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ ఆల్బమ్‌తో టాలీవుడ్‌లో తన కెరీర్ ఊపందుకుంటుందనే నమ్మకంతో ఉన్నాడు ధృవ.

04/15/2017 - 20:57

తమ టాలెంట్ చూపించడానికి హీరోయిన్లు తెగ కష్టపడుతున్నారు. అదీ పాటల్లో మరీ రెచ్చిపోతున్నారు. ఇక్కడ పాటలంటే -డ్యాన్స్‌లో కాదు. గొంతువిప్పి పాటందుకోవడంలో. ఇప్పటికే చాలామంది హీరోయిన్లు గొంతెత్తి పాడేస్తే -ఇప్పుడు రాశిఖన్నా ఆ పని చేసి తన ప్రతిభను ప్రదర్శిస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ల జాబితాలో రాశిఖన్నాకు చోటుంది.

04/15/2017 - 20:55

సీనియర్ హీరో జగపతిబాబు పూర్తిగా లుక్ మార్చి చేస్తున్న చిత్రం ‘పటేల్ ఎస్.ఐ.ఆర్’. ఈమధ్యే విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు ప్రేక్షకులనుంచి అనూహ్య స్పందన లభించింది. సినీ సెలబ్రిటీలు సైతం జగ్గ్భుయ్ లుక్ చూసి షాకై పొగడ్తలతో ముంచెత్తారు. ప్రస్తుతం ఈ చిత్రంలో జగపతిబాబు సరసన నటించడానికి ఓ బ్యూటీని ఫైనల్ చేశారు. ఆమె నారా రోహిత్, శ్రీవిష్ణుతో కలిసి నటించిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రంతో పరిచయమైన తాన్య హూప్.

04/15/2017 - 20:53

ఖయ్యూం, అస్మిత లీడ్ రోల్స్‌లో తాడి మనోహర్‌కుమార్ దర్శకత్వం వహించిన చిత్రం డర్టీ గేమ్. షిరిడీ సాయి క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తోన్న చిత్రంలోని పాటల మంచి ఆదరణ పొందాయి. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో వైవిధ్యంగా రూపొందిస్తున్న చిత్రంలో డర్టీ గేమ్ ఏంటి? ఎవరు ఆడారు? చివరికి ఏమైంది?

04/15/2017 - 20:52

ఆడియన్స్‌ని భయపెట్టేందుకు 3డేంజర్ జోన్2 సిద్ధమైంది. చందమల్ల అభిలాష్ దర్శకత్వం వహించిన చిత్రంలో దత్త, సోనాలీ దీక్షిత్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. హీరో అభిలాష్ మాట్లాడుతూ ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు మంచి ఆదరణ లభించిందని, 40 రోజులపాటు షూటింగ్ చేసిన క్వాలిటీ కనిపిస్తుందన్నారు.

04/14/2017 - 21:38

గత కొంతకాలంగా ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తూ సంచలన విజయాన్ని అందుకున్న చిత్రం 3బాహుబలి2 మొదటిభాగం విడుదలై భారతీయ సినిమా చరిత్రలోనే ఘనవిజయాన్ని అందుకుని తెలుగు సినిమా సత్తాను చాటింది. ఇపుడు దానికి సీక్వెల్‌గా 3బాహుబలి-22 రూపొందుతోంది. ఎస్.ఎస్ రాజవౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రం ఈనెల 28న విడుదలకు సిద్ధమైంది.

04/14/2017 - 21:37

నిజానికి నేను బయట ఉండే స్టయిల్ వేరు, సినిమాల్లో నటిస్తున్న పాత్రలు వేరు.. నాకు సంప్రదాయ పాత్రలంటే పెద్దగా ఆసక్తి లేదు. నేను మోడరన్ గర్ల్‌గానే ఉండాలని అనుకుంటున్నాను మొర్రో..22 అంటూ చెబుతోంది గ్లామర్ భామ లావణ్య త్రిపాఠి! జనరల్‌గా సినిమాల్లో ఒక వ్యక్తి ఓ పాత్ర చేశాడంటే.. అతనికి లైఫ్‌లాంగ్ అలాంటి పాత్రలే వస్తాయని అనడమే కాదు, ఆ పాత్రకు సరిపోతే డ్రెస్ కుట్టించుకోవచ్చు అనే నానుడి..

04/14/2017 - 21:35

మాస్ కథానాయకుడు రవితేజ తాజాగా నటిస్తున్న 3రాజాది గ్రేట్2 చిత్రం షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. 3పటాస్ ఫేం2 అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. 3బెంగాల్ టైగర్2 తరువాత ఏడాది గ్యాప్ తీసుకున్న రవితేజ, మళ్లీ తన పాత స్టయిల్‌లోకి వచ్చేందుకు కసరత్తులు చేశాడు. 3కిక్-2, 3బెంగాల్ టైగర్2 చిత్రాల్లో స్లిమ్‌గా మారి చేసిన ప్రయ త్నం బెడిసికొట్టింది.

Pages