S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/15/2016 - 05:33

ఈ మధ్య బాలీవుడ్‌లో బయోపిక్ చిత్రాల హవా బాగా పెరిగిపోయింది. ఇప్పటికే నిజ జీవిత కథలతో తెరకెక్కిన చిత్రాలు ప్రేక్షకాదరణ అందుకోవడంతోపాటు బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాల్ని నమోదు చేసుకుంటున్నాయి. ఇక తెలుగులో బయోపిక్ చిత్రాలు రావడం అరుదే. తాజాగా ఈ తరహా చిత్రానికి సన్నాహాలు చేస్తున్నాడు నిర్మాత అనీల్ సుంకర. భారత మాజీ రాష్టప్రతి అబ్దుల్ కలాం జీవిత కథతో సినిమా తీయడానికి సన్నాహాలు ముమ్మరం చేశాడు.

12/15/2016 - 05:32

పృధ్వీ, నవీన్‌చంద్ర హీరోలుగా, సలోని, శృతిసోధి హీరోయిన్లుగా శ్రీ సత్య సాయి ఆర్ట్స్ ఇ.సత్తిబాబు దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మించిన ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’. ఈ చిత్రం డిసెంబర్ 16న గ్రాండ్ రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా హీరోయిన్ సలోని బుధవారం సినిమా గురించిన సంగతులను పాత్రికేయులతో ముచ్చటించారు.

12/15/2016 - 05:30

హరికృష్ణ, అక్షిత జంటగా జె.ఎస్.ఆర్. మూవీస్ పతాకంపై జొన్నలగడ్డ శ్రీనివాస్ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘ప్రేమెంత పనిచేసే నారాయణ’. ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ లాబ్‌లో బుధవారం ఉదయం నిర్వహించారు. తొలి సన్నివేశంపై హీరో శ్రీకాంత్ క్లాప్‌నివ్వగా, బి.గోపాల్ కెమెరా స్విచ్చాన్ చేశారు.

12/15/2016 - 05:28

ఎస్.ఎస్.రాజవౌళి దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న బాహుబలి-2 (ది కంక్లూజన్) చిత్రంలో రానా నటిస్తున్న భల్లాలదేవ ఫస్ట్‌లుక్‌ను రానా జన్మదినోత్సవం సందర్భంగా బుధవారం విడుదల చేశారు. ఈ ఫస్ట్‌లుక్‌లో రానా మొదటి సినిమా కన్నా వైవిధ్యంగా కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. తొలి సినిమాలో భల్లాలదేవ ఉపయోగించిన గద ఈ చిత్రంలో కూడా కన్పిస్తోంది.

12/15/2016 - 05:27

టాలీవుడ్‌లో హీరోయిన్‌గా దూసుకుపోతున్న నటి ఎవరంటే.. అందరు చెప్పే పేరు రకుల్‌ప్రీత్‌సింగ్. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’తో సక్సెస్ జర్నీ ప్రారంభమైన రకుల్ ఆ తరువాత స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు అందుకుంటూ, వరుస విజయాలతో ముందుంది. మెగా హీరో రామ్‌చరణ్ సరసన రకుల్ నటించిన ‘్ధృవ’ చిత్రం ఇటీవలే విడుదలై హిట్ టాక్‌తో దూసుకుపోతున్న సందర్భంగా గ్లామర్ భామ రకుల్‌ప్రీత్‌సింగ్ ముఖాముఖి మాట్లాడారు.

12/13/2016 - 21:11

కన్నడ స్టార్ ఉపేంద్ర సతీమణి ప్రియాంక కీలకపాత్రలో లోహిత్ దర్శకత్వంలో కన్నడంలో మమీ పేరుతో విడుదలై ఘన విజయం సాధించిన చిత్రాన్ని కెఆర్‌కె ప్రొడక్షన్స్, లక్ష్మీ వెంకటేశ్వరా మూవీస్ పతాకాలపై కె.రవికుమార్, ఎం.ఎం.ఆర్. ‘చిన్నారి’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రం ఈనెల 16న విడుదలవుతున్న సందర్భంగా ట్రైలర్ లాంఛ్ కార్యక్రమం మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది.

12/13/2016 - 21:09

ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందుతోన్న భారీ ప్రతిష్ఠాత్మక చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుంది. ఈనెల 16న వంద థియేటర్లలో థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా టీజర్‌ను కరీంనగర్‌లోని కోటిలింగాలు పుణ్యక్షేత్రంలో బాలకృష్ణ విడుదల చేస్తారట.

12/13/2016 - 21:07

అల్లరి నరేష్ హీరోగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో వచ్చిన సీమశాస్ర్తీ, సీమటపాకాయ్ చిత్రాలు హిలేరియస్ కామెడీతో అందర్నీ ఎంటర్‌టైన్ చేసాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో అత్తారింటికి దారేది, నాన్నకు ప్రేమతో వంటి భారీ చిత్రాలను అందించిన బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై భోగవల్లి బాపినీడు సమర్పణలో నిర్మిస్తున్న హిలేరియస్ ఎంటర్‌టైనర్ ‘ఇంట్లో దెయ్యం.. నాకేం భయం’.

12/13/2016 - 21:05

హిందీ తెలుగు భాషల్లో రూపొందుతున్న ‘ఘాజి’ చిత్రంలో రాణా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నేవీ
కెప్టెన్‌గా నటిస్తున్న రాణా తాజా లుక్ మంగళవారం విడుదలైంది. ఇందులో రాణా ఆకట్టుకునేలా కనిపించాడు.

12/13/2016 - 21:03

ఈమధ్య సినిమా తారల పెళ్లిళ్లు ఎక్కువకాలం నిలవడంలేదు. పెళ్లైన రెండు మూడు ఏళ్లకే వారి వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తి విడాకుల వరకు దారితీస్తున్నాయి. ఇటీవల తమిళ హీరోయిన్ అమలాపాల్ విడాకులు తీసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా మరో హీరోయిన్ కూడా విడాకులు తీసుకునేందుకు సిద్ధమైనట్టు సమాచారం.

Pages