S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/23/2016 - 20:59

దిలీప్, పూనమ్‌కౌర్, అక్షిత ప్రధాన తారాగణంగా శ్రీ విజయానంద్ పిక్చర్స్ పతాకంపై ఎ.నరేందర్, విజయానంద్, సురేష్‌గౌడ్ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘ప్రణయం’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ..

09/23/2016 - 20:58

నిఖిల్‌కుమార్ కథానాయకుడుగా చెన్నాంబిక ఫిలిమ్స్ పతాకంపై ఎ.మహదేవ్ దర్శకత్వంలో అనితాకుమారస్వామి రూపొందించిన చిత్రం జాగ్వార్. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో ఇటీవల విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. ఈ సందర్భంగా నిర్మాత అనితాకుమారస్వామి మాట్లాడుతూ..

09/23/2016 - 20:57

అల్లు అర్జున్ అటు తెలుగులోనూ ఇటు మలయాళంలోనూ మంచిపేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా తెలుగు, తమిళ భాషల్లో లింగుస్వామి దర్శకత్వంలో గ్రీన్ స్టూడియో ప్రొడక్షన్స్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్‌రాజా ఓ కొత్త చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం చెన్నైలో జరిగింది.

09/23/2016 - 20:55

జయలక్ష్మి ఆర్ట్స్ పతాకంపై గణేష్, మంజరి జంటగా ఎస్.నారాయణ దర్శకత్వంలో చిగులూరి గంగాధర్‌రావుచౌదరి రూపొందించిన చిత్రం ‘జర్నీ-2’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి, ఈనెల 30న విడుదలకు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చిత్ర సమర్పకుడు కృష్ణచైతన్య మాట్లాడుతూ, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఒకరినొకరు చూసుకోకుండా బస్సుమీద రాసుకున్న కవితలతో ఎలా ప్రేమలో పడ్డారు?

09/23/2016 - 20:53

హరీష్, అవంతిక జంటగా ఆర్.జె. సినిమాస్ పతాకంపై జయ బి. దర్శకత్వంలో నిర్మాత బి.ఎ.రాజు రూపొందిస్తున్న చిత్రం వైశాఖం. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ సాగుతోంది. ఈ సందర్భంగా దర్శకురాలు జయ బి. మాట్లాడుతూ ప్రతి పాత్ర సినిమాలో కథకు ప్రధానంగా సాగుతుందని, పాటలన్నీ విజువల్ వండర్‌గా రూపొందాయని తెలిపారు.

09/23/2016 - 20:53

డి.కె. దర్శకత్వంలో జీవా, కాజల్ అగర్వాల్ జంటగా తమిళంలో రూపొందించిన చిత్రానికి తెలుగులో ‘ఎంత వరకు ఈ ప్రేమ’ అన్న పేరును ఖరారు చేశారు. డి.వి. సినీ క్రియేషన్స్ పతాకంపై డి.వెంకటేష్ తెలుగులో అనువదిస్తున్నారు. చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ..

09/23/2016 - 20:51

రజిత్, షామిలి, నిషా ప్రధాన తారాగణంగా వశిష్ట సినీ అకాడమీ పతాకంపై రాము దర్శకత్వంలో ప్రభాత్‌వర్మ రూపొందిస్తున్న చిత్రం ‘శ్రీరామరక్ష’. ఈ చిత్రానికి సంబంధించిన టాకీ పూర్తిచేసి, పాటల చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ..

09/23/2016 - 20:50

కోడి రామకృష్ణ దర్శకత్వంలో గతంలో వచ్చిన అమ్మోరు, అరుంధతి చిత్రాల స్థాయిలో రూపొందించిన మరో చిత్రం నాగభరణం. రమ్య ప్రధాన పాత్రలో కన్నడంలో రూపొందించిన ఈ చిత్రాన్ని తెలుగులో మల్కాపురం శివకుమార్ అందిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ..

09/22/2016 - 21:08

‘నీ ఆశ.. అడియాస, చేజారే మణిపూస’ అంటూ భారమైన స్వరంతో గంభీరంగా పాడినా, సిరిమల్లె పువ్వల్లే నవ్వు.. అంటూ నవ్వులే సాహిత్యంగా, ఓ ఝరిలా ఆలపించినా, గోవుల్లు తెల్లన, గోపయ్య నల్లన అంటూ చిన్నపిల్లలా ముద్దుముద్దుగా స్వరాలు పలికినా గుర్తొచ్చే జానకి లాలి పాటతో గీతాలాపనకు టాటా చెప్పారు. తన గాత్ర మాధుర్యాన్ని తెలుగు సినీ ప్రియులకు పంచిన ఎస్.జానకి సినిమాల్లోను, ఇతర వేదికలపై గీతాలన ఆపేస్తున్నట్లు ప్రకటించారు.

09/22/2016 - 21:05

టాలీవుడ్‌లో వున్న దర్శకుల్లో పూరి జగన్నాథ్ స్టైలే వేరు. ఆయన ఏది చేసినా కొత్తగా రిచ్‌గా వుంటుంది. ముఖ్యంగా కథలు రాసేటప్పుడు ఆయన తీరే వేరు. చక్కగా బ్యాంకాక్‌కు వెళ్లిపోయి పది పదిహేను రోజుల్లో కథను రాసుకొచ్చేస్తాడు. అలా బ్యాంకాక్‌లో రూపుదిద్దుకున్న అనేక కథలు సూపర్‌హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన కల్యాణ్‌రామ్‌తో రూపొందిస్తున్న ‘ఇజం’ చిత్రాన్ని పూర్తిచేశాడు.

Pages