S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/25/2016 - 01:12

నికిత ప్రధాన పాత్రలో శ్రీ క్రియేటివ్ ఫిలింస్ పతాకంపై శివగంగరాజు వుడిమూడి దర్శకత్వంలో ఎ.కె.శ్రీకాంత్ అంగళ్ళ రూపొందించిన చిత్రం ‘అపార్ట్‌మెంట్’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు ముగింపు దశలో వున్నాయి. ఇటీవల విడుదల చేసిన పాటలకు మంచి స్పందన లభిస్తోందని నిర్మాత తెలియజేస్తున్నారు.

09/25/2016 - 01:11

ఆస్కార్ అవార్డుల కోసం భారతదేశం నుంచి ఇప్పటి వరకు ఎన్నో ప్రయత్నాలు జరిగినా ఫలితం లేకపోయింది. ఈ ఏడాది మరో ప్రయత్నం జరుగుతోంది. ఆస్కార్ విదేశీ భాషా విభాగంలో ఎప్పటికప్పుడు కథ, కథనాల్లో వైవిధ్యం, టేకింగ్‌లో నూతనత్వం వున్న చిత్రాలను ఎంపిక చేసి అధికారిక ఎంట్రీగా పంపిస్తున్నారు. కానీ అంతర్జాతీయంగా వున్న అనేక సమస్యల నేపథ్యంలో రూపొందించిన చిత్రాలకు అవార్డులు దక్కుతున్నాయి.

09/25/2016 - 01:09

జ్యోతిలక్ష్మి, సారాయి వీర్రాజు తదితర చిత్రాల్లో ప్రతినాయకుడిగా నటించిన అజయ్‌ఘోష్ అచ్చమైన తెలుగువాడు. విశారణై చిత్రంలో గుంటూరు పోలీసు సి.ఐ విశే్వశ్వరరావుగా నటించాడు అజయ్‌ఘోష్. ఈ చిత్రం ఆస్కార్ అవార్డుకు వెళుతున్న సందర్భంగా ఆయన్ను పలకరిస్తే పలు చిత్ర విశేషాలను తెలిపారు.

09/23/2016 - 21:04

‘నేను సినిమారంగంలోకి అడుగుపెట్టి పది సంవత్సరాలు దాటిపోయింది. నటనకు సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకోవడానికే ప్రయత్నిస్తాను. ఏ పనైనా సరే శ్రద్ధపెట్టి నేర్చుకుంటాను. అందుకే ఇప్పుడు విజయాలన్నీ సాధ్యవౌతున్నాయి’ అని చెబుతోంది బాలీవుడ్ సుందరి దీపికాపదుకొనె.

09/23/2016 - 21:00

‘ఎక్కడికి పోతావు చిన్నవాడా.. నా చూపుల్లో చిక్కుకున్న వనె్నకాడ..’ అంటూ గతంలో ఓ పాట వచ్చింది. ఆ పాటే ఇప్పుడు హీరో నిఖిల్ చిత్రానికి టైటిల్ అయ్యింది. మేఘన ఆర్ట్స్ పతాకంపై వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రంలో నిఖిల్, హెబాపటేల్, నందితా శే్వత ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ ఇటీవల విడుదలై మంచి ఆదరణ పొందిందని నిర్మాతలు చెబుతున్నారు.

09/23/2016 - 20:59

దిలీప్, పూనమ్‌కౌర్, అక్షిత ప్రధాన తారాగణంగా శ్రీ విజయానంద్ పిక్చర్స్ పతాకంపై ఎ.నరేందర్, విజయానంద్, సురేష్‌గౌడ్ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘ప్రణయం’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ..

09/23/2016 - 20:58

నిఖిల్‌కుమార్ కథానాయకుడుగా చెన్నాంబిక ఫిలిమ్స్ పతాకంపై ఎ.మహదేవ్ దర్శకత్వంలో అనితాకుమారస్వామి రూపొందించిన చిత్రం జాగ్వార్. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో ఇటీవల విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. ఈ సందర్భంగా నిర్మాత అనితాకుమారస్వామి మాట్లాడుతూ..

09/23/2016 - 20:57

అల్లు అర్జున్ అటు తెలుగులోనూ ఇటు మలయాళంలోనూ మంచిపేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా తెలుగు, తమిళ భాషల్లో లింగుస్వామి దర్శకత్వంలో గ్రీన్ స్టూడియో ప్రొడక్షన్స్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్‌రాజా ఓ కొత్త చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం చెన్నైలో జరిగింది.

09/23/2016 - 20:55

జయలక్ష్మి ఆర్ట్స్ పతాకంపై గణేష్, మంజరి జంటగా ఎస్.నారాయణ దర్శకత్వంలో చిగులూరి గంగాధర్‌రావుచౌదరి రూపొందించిన చిత్రం ‘జర్నీ-2’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి, ఈనెల 30న విడుదలకు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చిత్ర సమర్పకుడు కృష్ణచైతన్య మాట్లాడుతూ, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఒకరినొకరు చూసుకోకుండా బస్సుమీద రాసుకున్న కవితలతో ఎలా ప్రేమలో పడ్డారు?

09/23/2016 - 20:53

హరీష్, అవంతిక జంటగా ఆర్.జె. సినిమాస్ పతాకంపై జయ బి. దర్శకత్వంలో నిర్మాత బి.ఎ.రాజు రూపొందిస్తున్న చిత్రం వైశాఖం. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ సాగుతోంది. ఈ సందర్భంగా దర్శకురాలు జయ బి. మాట్లాడుతూ ప్రతి పాత్ర సినిమాలో కథకు ప్రధానంగా సాగుతుందని, పాటలన్నీ విజువల్ వండర్‌గా రూపొందాయని తెలిపారు.

Pages