S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

02/03/2016 - 07:56

డాన్సింగ్ సెనే్సషన్ ప్రభుదేవా హీరోగా కంటే కూడా దర్శకుడిగానే బాగా పాపులర్ అయ్యాడు. ‘ప్రేమికుడు’ సినిమాతో హీరోగా మారిన ప్రభుదేవా అటుపై పలు చిత్రాల్లో నటించినప్పటికీ కెరీర్ పరంగా సరైన క్రేజ్ రాలేదు. దాంతో దర్శకుడిగా మారి తెలుగులో ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ చిత్రాన్ని రూపొందించాడు. తర్వాత బాలీవుడ్‌లో పలు చిత్రాలకు దర్శకత్వం వహించి, స్టార్ డైరెక్టర్‌గా సెటిలయ్యాడు.

02/03/2016 - 07:56

‘బాహుబలి’ సినిమాలో శివగామిగా నటించి సంచలనం సృష్టించిన ప్రముఖ నటి రమ్యకృష్ణ ఇప్పుడు మరోసారి మరో క్రేజీ సినిమాలో నటించేందుకు రెడీ అయ్యింది. అయితే ఈ చిత్రం ఆమె భర్త దర్శకత్వంలో రూపొందడం విశేషం. క్రియేటివ్ దర్శకునిగా పేరుతెచ్చుకున్న కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కే చిత్రం ‘రుద్రాక్ష’. థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ కీ రోల్ పోషించనున్నారు.

02/03/2016 - 07:55

ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘బ్రూస్‌లీ’ చిత్రం అనుకున్న విజయం సాధించకపోవడంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో వున్నాడు రామ్‌చరణ్. తమిళంలో సూపర్‌హిట్ అయిన ‘తనిఒరువన్’ చిత్రానికి రీమేక్‌గా రూపొందే చిత్రంలో నటిస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రం ఈనెల రెండవ వారంలో ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో ఇప్పటివరకు హీరోయిన్ ఓకె కాలేదు.

02/03/2016 - 07:54

మానస్, హాసికాదత్ జంటగా రైజింగ్ సన్ ఫిలింస్ పతాకంపై హాసికాదత్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న చిత్రం ‘బేబీ డాల్’. మున్నాకాశి సంగీతం అందిస్తున్న ఈ చిత్ర పాటల రికార్డింగ్ హైదరాబాద్‌లో మొదలైంది. గాయకుడు శ్రీరామచంద్ర ఆలపించిన పాటతో రికార్డింగ్ ప్రారంభించారు.

01/31/2016 - 22:42

సిద్దు జొన్నగడ్డ, నరేష్ విజయ్‌కృష్ణ, రేష్మీగౌతమ్, శ్రద్ధాదాస్, మంచు లక్ష్మి, మహేష్‌మంజ్రేకర్ ప్రధాన తారాగణంగా ఆర్.కె. స్టూడియోస్ పతాకంపై ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రాజ్‌కుమార్ ఎం. రూపొందిస్తున్న చిత్రం ‘గుంటూరు టాకీస్’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈనెల 3న ఈ చిత్రానికి సంబంధించిన థియేటర్ ట్రైలర్‌ను నందమూరి బాలకృష్ణ విడుదల చేయనున్నారు.

01/31/2016 - 22:40

రావంత్, పావని జంటగా కార్తికేయ ప్రొడక్షన్స్ పతాకంపై ధనుంజయ్ దర్శకత్వంలో, పళ్లా రమణయాదవ్ రూపొందిస్తున్న చిత్రం ‘నా హృదయం ఊగిసలాడే..’ ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

01/31/2016 - 22:29

శ్రీ కంచెమ్మతల్లి సినీప్రొడక్షన్స్ పతాకంపై లోకేష్‌రెడ్డి, అక్షర జంటగా శ్రీనివాసరావు.ఎం దర్శకత్వంలో దేవదాస్‌రెడ్డి రూపొందిస్తున్న చిత్రం ‘రెండక్షరాలు’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

01/31/2016 - 22:27

బాలీవుడ్ భామ రాధికా ఆప్టే ఓ వైపు కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే మరోవైపు స్టోరీ ఓరియెంటెడ్ సినిమాలతో అదరగొడుతోంది. ఇప్పటికే పలు సంచలనాలు క్రియేట్ చేసిన ఈ భామ లేటెస్ట్‌గా ‘పరేడ్’ అనే సినిమాలో నటించింది. రాజస్థాన్‌లోని ఓ మారుమూల పల్లెటూరిలో జరిగిన కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఆ ఊరిలో తమ జీవితాలు కోల్పోయిన నలుగురు మహిళలు కొత్త జీవితాన్ని వెదుక్కునే దిశగా ఇది సాగుతుంది.

01/31/2016 - 22:26

‘నేను-శైలజ’ సినిమాతో హీరోయిన్‌గా మంచి మార్కులు కొట్టేయడంతోపాటు హిట్‌ని అందుకుంది అందాల భామ కీర్తి సురేష్. తొలి సినిమా హిట్ కొట్టగానే తన రెమ్యూనరేషన్ పెంచేసిందన్న టాక్ ఇప్పుడు విన్పిస్తోంది. మొదటి సినిమాకే ఇలాచేస్తే ఎలా అంటూ ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం సాగుతోంది. దీంతో ఈ భామ స్పందించింది. పారితోషికం పెంచినట్టుగా వస్తోన్న వార్తల్లో నిజంలేదని కీర్తిసురేష్ స్పష్టం చేసింది.

01/31/2016 - 22:26

ఇటీవలే అఖిల్‌ను హీరోగా పరిచయం చేస్తూ ‘అఖిల్’ చిత్రాన్ని రూపొందించిన వినాయక్‌కు ఆ సినిమా భారీగా నిరాశపరచడంతో ఇప్పుడు వినాయక్ తనను తానూ ప్రూవ్ చేసుకునే పనిలో పడ్డాడు. లేటెస్ట్ సమాచారం ప్రకారం వినాయక్ నెక్ట్స్ సినిమా నితిన్‌తో చేస్తాడంటూ వార్తలు వస్తున్నాయి. మరోవైపు చిరంజీవి 150వ సినిమాను పూర్తిచేసిన తరువాత, వినాయక్ ఈ సినిమా చేయనున్నాడని తెలిసింది. ఇటీవల వినాయక్‌ను నితిన్, అతని తండ్రి కలిశారు.

Pages