S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

02/05/2016 - 06:33

సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో రణవీర్‌సింగ్, దీపికాపదుకొనె జంటగా రూపొంది సంచలనం సృష్టించిన ‘బాజీరావ్ మస్తానీ’ సినిమా పదవ ఏషియన్ ఫిల్మ్ అవార్డుల రేసులో రెండోస్థానంలో ఉంది. ఉత్తమచిత్రం విభాగంతోసహా ఐదు అవార్డులకోసం నామినేషన్‌కు అర్హత సాధించింది. హిసియో-హిసిన్ కుంగ్‌ఫుమాస్టర్‌పీస్ ‘ది ఎసాసిన్’ 9 విభాగాల్లో నామినేషన్లు సాధించి మొదటి స్థానంలో నిలిచింది.

02/05/2016 - 06:32

శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రసాద్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఇట్లు మీ సరోజ’. అయాన్, కాంచన ప్రధాన తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన 80 శాతం షూటింగ్ పూర్తిచేశారు.

02/05/2016 - 06:29

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడిగా పరిశ్రమకు పరిచయమైన తొలి చిత్రం ‘అల్లుడు శీను’తో తనకంటూ ప్రత్యేకత ఏర్పరచుకున్నాడు. ఆ సినిమా తరువాత నటిస్తున్న మరో చిత్రం ‘స్పీడున్నోడు’. ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో గుడ్‌విల్ సినిమా పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజు విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌తో ఇంటర్వ్యూ...
సినిమా గురించి చెప్పండి?

02/05/2016 - 06:18

తరుణ్‌శెట్టి, అవంతిక, కిరీటి ప్రధాన పాత్రల్లో హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో ప్లానెట్ గ్రీన్ స్టూడియోస్ పతాకంపై రూపొందుతున్న చిత్రం ‘మీకు మీరే మాకు మేమే’. ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది.

02/05/2016 - 06:16

‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ విజయంతో విభిన్నమైన కథా చిత్రాల్లో నటిస్తూ కెరీర్‌ని విభిన్నంగా ప్లాన్ చేసుకుంటున్నాడు సందీప్ కిషన్. తాజాగా ఆయన మరో చిత్రానికి కమిట్ అయినట్టు తెలిసింది. తమిళ, మలయాళ భాషల్లో మంచి విజయం సాధించిన ‘నేరం’ సినిమా రీమేక్‌లో నటించనున్నాడు. రెగ్యులర్ కమర్షియల్ అంశాలకు దూరంగా నేటివిటీతో వుండే ఈ సినిమాతో మరో ప్రయత్నం చేయనున్నాడు సందీప్.

02/05/2016 - 06:15

టాలీవుడ్‌లో యువనటుడు అల్లు అర్జున్‌కు వున్న క్రేజ్ అందరికీ తెలిసిందే. కమర్షియల్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు మరో క్రేజీ రికార్డును స్వంతం చేసుకున్నాడు. ఫేస్‌బుక్‌లో అల్లును లైక్‌చేసిన వారి సంఖ్య కోటిదాటింది. ఈమధ్య సోషల్ మీడియా ప్రభావం లేకుండా స్టార్ సెలబ్రిటీలు వుండడం లేదు. ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియాతో ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు కూడా.

02/05/2016 - 06:15

‘భలే భలే మగాడివోయ్’ సినిమా విజయంతో మంచి జోరుమీదున్నాడు దర్శకుడు మారుతి. చిన్న చిత్రాల దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన మారుతి, ఈ సినిమాతో క్రేజీ దర్శకుడిగా మారిపోయాడు. ప్రస్తుతం వెంకటేష్‌తో ‘బాబు బంగారం’ చిత్రాన్ని రూపొందిస్తున్న మారుతికి మరో క్రేజీ అవకాశం దక్కింది. ఇప్పటికే రామ్‌చరణ్ హీరోగా ఓ చిత్రాన్ని రూపొందించేందుకు గ్రీన్‌సిగ్నల్ వచ్చింది.

02/03/2016 - 22:37

సుమంత్ అశ్విన్, పూజా జవేరి జంటగా శ్రీ సత్యా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై జె.కృష్ణవంశి రూపొందిస్తున్న చిత్రం ‘రైట్ రైట్’. ఈ చిత్రానికి సంబంధించిన రెండో షెడ్యూల్‌ను పూర్తిచేశారు. నిర్మాత మాట్లాడుతూ, తొలి షెడ్యూల్‌ను అరకు, ఒడిసాలో చిత్రించారని, రెండో షెడ్యూల్‌ను వికారాబాద్ ఫారెస్ట్‌లో కీలక సన్నివేశాలను తెరకెక్కించామని తెలిపారు.

02/03/2016 - 22:34

సునీల్ కథానాయకుడిగా వాసూ వర్మ దర్శకత్వంలో రాజు రూపొందించిన చిత్రం ‘కృష్ణాష్టమి’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 19న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ చిత్రంలోని పాటలు అందరినీ అలరిస్తున్నాయని, ఉన్నతమైన సాంకేతిక విలువలతో కుటుంబం మొత్తం చూడదగిన విధంగా రూపొందించామని తెలిపారు.

02/03/2016 - 22:32

గ్లామర్ హీరోయిన్‌గా దక్షిణాదిలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న తమన్నా ఓ వైపు హీరోయిన్‌గా నటిస్తూనే మరోవైపు ఐటెం సాంగ్స్ చేస్తూ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఐటెం సాంగ్స్ కోసం భారీగా రెమ్యూనరేషన్ వసూలు చేస్తున్న ఈ భామ తాజాగా మరో యువ హీరోతో జోడీ కట్టనుంది. ‘అల్లుడు శీను’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రూపొందే సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటించనుంది.

Pages