S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/17/2016 - 23:26

సాగర్, సాక్షీచౌదరి, రాగిణి నంద్వాని ముఖ్యపాత్రల్లో దయానందరెడ్డి దర్శకత్వంలో దాసరి కిరణ్‌కుమార్ నిర్మించిన ‘సిద్ధార్థ’ చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో విజయోత్సవ సభను నిర్వహించారు.

09/17/2016 - 23:23

సూపర్‌స్టార్ రజనీకాంత్ రెండో కుమార్తె సౌందర్య వివాహబంధం తెగిపోయిందని, ఆమె విడాకులు తీసుకుందని వచ్చిన వార్తలపై స్వయంగా ఆమే స్పందించింది. ట్విట్టర్ వేదికగా శనివారంనాడు ఆమె తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ‘నేను, నా భర్త ఏడాదిగా వేరుగా ఉంటున్నాం. విడాకుల కోసం చర్చలు జరుగుతున్నాయి. నా వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలకు సంబంధించి ప్రైవసీని దెబ్బతీయకండి’ అంటూ ట్వీట్ చేసింది.

09/17/2016 - 23:20

నవీన్, నిత్య, శ్రావ్య ముఖ్యపాత్రల్లో పి.వి.గిరి దర్శకత్వంలో ఎస్.వి.సి. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రాధాకిషోర్.జి, భిక్షమయ్య సంగం నిర్మిస్తున్న ‘నందిని నర్సింగ్ హోం’. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ శనివారం హైదరాబాద్‌లో విడుదలైంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ నటుడు కృష్ణ, విజయనిర్మల ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. అనంతరం కృష్ణ మాట్లాడుతూ, ‘నవీన్ నాలుగేళ్లుగా ట్రైనింగ్ తీసుకుంటున్నాడు.

09/17/2016 - 23:17

ప్రముఖ నటుడు ప్రకాష్‌రాజ్ నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న ద్విభాషా చిత్రం ‘మన ఊరి రామాయణం’. ప్రియమణి, సత్యదేవ్, పృధ్వీ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలోని పాటలు శుక్రవారం హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ఇళయరాజా సంగీతం అందించిన ఈ ఆడియో వేడుక కార్యక్రమంలో ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున పాటల సీడీని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ- ‘ప్రతి మనిషిలోని రాముడు ఉంటాడు, రావణుడూ ఉంటాడు.

09/16/2016 - 23:13

సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ్, రాశీఖన్నా జంటగా రామ్‌ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర రూపొందిస్తున్న తాజా చిత్రం ‘హైపర్’. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని దసరా కానుకగా విడుదలకు సిద్ధమవుతోంది. జీబ్రాన్ అందించిన సంగీతంలో మొదటి పాటను విడుదల చేశారు.

09/16/2016 - 23:11

ధనుష్, కీర్తిసురేష్ జంటగా నటించిన ‘రైల్’ చిత్రం ఈనెల 22న విడుదలకు సిద్ధమైంది. శ్రీ పరమేశ్వరి పిక్చర్స్ పతాకంపై ప్రభు సాల్మన్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రాన్ని ఆదిరెడ్డి, ఆదిత్యారెడ్డి తెలుగులో అందిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, ఇటీవల విడుదలైన ఆడియోకు మంచి ఆదరణ లభిస్తోందని, యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందని తెలిపారు.

09/16/2016 - 23:10

అందాల భామ కాజల్ తెలుగులో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతూనే, మరోవైపు తమిళంలో కూడా తన హవా చాటుకుంటోంది. ఈమధ్యే బాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇచ్చిన ఈమెకు అక్కడ నిరాశే మిగిలింది. దాంతో సౌతే బెటర్ అని ఇక్కడే ప్రయత్నాలు సాగిస్తోంది. లేటెస్టుగా జనతాగ్యారేజ్ చిత్రంలో చేసిన ఐటెం సాంగ్‌కు మంచి క్రేజ్ దక్కింది. ముఖ్యంగా కాజల్ అందాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారట.

09/16/2016 - 23:10

తెలుగులో ఈ ఏడాది విజయం సాధించి చిత్రాల్లో ‘క్షణం’ చిత్రం ఒకటి. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి ఘనవిజయం సాధించిన చిత్రంగా నిలిచిపోయింది. అడివి శేష్, ఆదాశర్మ జంటగా నటించిన ఈ సినిమాను పలు భాషల్లో రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఆదాశర్మకు ఈ సినిమా మంచి గుర్తింపునే తెచ్చిపెట్టింది. ముఖ్యంగా బిడ్డను కోల్పోయిన తల్లిగా ఆదా నటనకు మంచి మార్కులు పడ్డాయి.

09/16/2016 - 23:09

సునీల్, సుష్మారాజ్, రీచాపనయ్ ప్రధాన తారాగణంగా ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లి. పతాకంపై వీరూ పోట్ల దర్శకత్వంలో సుంకర రామబ్రహ్మం రూపొందిస్తున్న చిత్రం ‘ఈడు గోల్డ్ ఎహే’. ఈ చిత్రాన్ని అక్టోబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన ఆడియోను నాలుగు పట్టణాలలో విడుదల చేయనున్నారు.

09/16/2016 - 23:08

కన్నడంలో విజయవంతమైన ‘రణతంత్ర’ చిత్రాన్ని తెలుగులో ‘ఇది పెద్ద సైతాన్’ అనే పేరుతో అనువదించారు. విజయ్ రాఘవేంద్ర, హరిప్రియ జంటగా ఆదీరామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని జె.వి. ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్రావు మార్టోరి అందిస్తున్నారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయిన ఈ చిత్రాన్ని ఈనెల 30న విడుదల చేయనున్నారు.

Pages