S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/19/2016 - 00:40

గతంలో 5 కలర్స్ మల్టీమీడియా మూవీ పతాకంపై ‘ఏకవీర’, ‘వెంటాడు వేటాడు’ చిత్రాలను నిర్మించారు శ్రీనివాస్ దామెర. తాజాగా 5 కలర్స్ మల్టీమీడియా సమర్పణలో ఎస్‌టిఐఎఫ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ‘హౌల్’ అనే హాలీవుడ్ చిత్రాన్ని తెలుగులోకి ‘దెయ్యాలబండి’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈనెల 23న ఇండియా వైడ్‌గా విడుదలవుతోంది.

09/19/2016 - 00:39

కన్నాంబ పసుపులేటి మూవీస్ పతాకంపై శివనాగేశ్వరరావు దర్శకత్వంలో పవన్, బిందు బార్బీ జంటగా దేవి చౌదరి రూపొందిస్తున్న చిత్రం ‘మనసంతా నువ్వే’. ఈ చిత్రానికి సంబంధించిన పాటలకు ప్లాటినమ్ డిస్క్ లభించిన సందర్భంగా హైదరాబాద్‌లో విజయోత్సవం నిర్వహించారు.

09/19/2016 - 00:31

తెలుగులో పనికిరావు పొమ్మంటే తాప్సీ బాలీవుడ్‌కి వెళ్లి రెండో మూడో చిత్రాలను పట్టేసింది. పడితే పట్టేసింది గానీ మంచి చిత్రాలను పట్టింది. ఈ దెబ్బతో తాప్సీ కరువు తీరింది. ఇన్నాళ్లు నటన రాదని, ఆమె నటిస్తే సినిమా ఫట్ అని రకరకాల రూమర్లు తాప్సీమీద వుండేవి. అవన్నీ ఒక్క సినిమా దెబ్బకు ఎగిరిపోయాయి. ఇప్పటికే బాలీవుడ్‌లో ‘బేబీ’ సినిమాతో హిట్ కొట్టిన తాప్సీ కెరీర్‌ను ‘పింక్’ సినిమా పీక్స్‌కి తీసుకెళ్లింది.

09/19/2016 - 00:29

ఓం శ్రీ క్రియేషన్స్ పతాకంపై అనీల్, శృతిలయ జంటగా ఆర్.కె.గాంధి దర్శకత్వంలో ఎం.ఎన్.బైరారెడ్డి, నాగరాజు సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘ప్రేమబిక్ష’. ఈ చిత్రానికి సంబంధించిన పాటల రికార్డింగ్ కార్యక్రమం జరుగుతోంది.

09/17/2016 - 23:54

దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటూ, వరుస విజయాలతో దూసుకుపోతోంది సమంత. గత ఏడాది పోలీసోడు, 24, బ్రహ్మోత్సవం, జనతాగ్యారేజ్, అ ఆ చిత్రాలతో టాప్‌లో నిలిచింది. పరాజయాలు పక్కనపెడితే, సంచలన విజయాలు అందుకుంటున్న సమంత ఈమధ్య కాస్త స్పీడు తగ్గించింది. దానికి కారణం పెళ్లిచేసుకుంటుందంటూ వస్తున్న వార్తలేమోనని అనుకుంటున్నారు జనాలు.

09/17/2016 - 23:52

ప్రముఖ నటుడు వెంకటేష్ హీరోగా తెరకెక్కనున్న చిత్రం గురు. బాబు బంగారం తర్వాత వెంకటేష్ నటిస్తున్న ఈ చిత్రం ఇటీవలే బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన సాలాఖుద్దూస్ చిత్రానికి రీమేక్. మాధవన్ నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో సుధా కొంగర తెరకెక్కిస్తున్నారు. శశికాంత్ నిర్మిస్తున్న ఈ చిత్రం 19నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. శనివారం ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను రానా విడుదల చేశాడు.

09/17/2016 - 23:50

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘కాటమరాయుడు’. డాలి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఇదివరకే ఓ షెడ్యూల్‌ని పూర్తిచేసుకుంది. ఇక పవన్ కళ్యాణ్ జనసేన కార్యక్రమాలతో బిజీ అయ్యాడు. ఇటీవలే ఆంధ్రాకు ప్రత్యేక హోదా విషయంలో పోరాటం చేయాలనీ భావించాడు కానీ ఈలోగా కేంద్రం ప్రత్యేక రాయితీని ప్రకటించడంతో.. పవన్ మళ్ళీ సినిమా షూటింగ్‌లో బిజీ అవ్వాలనే ప్లాన్స్ జరుగుతున్నాయి.

09/17/2016 - 23:30

‘జనతా గ్యారేజ్’ హిట్‌తో మాంచి జోష్‌మీదున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమా టాలీవుడ్‌లో బాక్స్ ఆఫీస్ వద్ద డెబ్భై కోట్ల మార్కెట్‌ని కొల్లగొట్టింది. ఇక ఈ సినిమా తరువాత నెక్స్ట్ ఏమిటనే ఆలోచనలో పడ్డాడు ఎన్టీఆర్. ఇప్పటికే రచయిత వక్కంతం వంశీతో సినిమా అనుకున్నారు. కానీ అది వర్కవుట్ కాలేదు. దాంతో పూరితో చేయాలనీ ప్రయత్నాలు జరుగుతున్నాయి.

09/17/2016 - 23:26

సాగర్, సాక్షీచౌదరి, రాగిణి నంద్వాని ముఖ్యపాత్రల్లో దయానందరెడ్డి దర్శకత్వంలో దాసరి కిరణ్‌కుమార్ నిర్మించిన ‘సిద్ధార్థ’ చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో విజయోత్సవ సభను నిర్వహించారు.

09/17/2016 - 23:23

సూపర్‌స్టార్ రజనీకాంత్ రెండో కుమార్తె సౌందర్య వివాహబంధం తెగిపోయిందని, ఆమె విడాకులు తీసుకుందని వచ్చిన వార్తలపై స్వయంగా ఆమే స్పందించింది. ట్విట్టర్ వేదికగా శనివారంనాడు ఆమె తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ‘నేను, నా భర్త ఏడాదిగా వేరుగా ఉంటున్నాం. విడాకుల కోసం చర్చలు జరుగుతున్నాయి. నా వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలకు సంబంధించి ప్రైవసీని దెబ్బతీయకండి’ అంటూ ట్వీట్ చేసింది.

Pages