S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/26/2017 - 21:01

తమన్నా ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ సినిమాలపై గురిపెట్టింది. బాలీవుడ్‌లో సెటిల్ అవుదామనుకున్న ఈ అమ్మడుకు ‘తుటియా తుటియా తుటక్’ చిత్రం సరైన అవకాశాలు తెచ్చిపెట్టలేకపోయింది. అయితే ఈ చిత్రానికి సీక్వెల్ చేయాలన్న ఆలోచనకు ప్రభుదేవా స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో కూడా విడుదలై సో..సోగా ఆడిన ‘అభినేత్రి’ చిత్రం ఫర్వాలేదనిపించింది.

03/25/2017 - 21:03

ప్రముఖ నటుడు పవన్‌కల్యాణ్ హీరోగా నటించిన ‘కాటమరాయుడు’ చిత్రం ఇటీవలే విడుదలై భారీ వసూళ్ల దిశగా దూసుకుపోతోంది. ఎన్నో రోజులునుంచి ఈ సినిమాకోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారందరి అంచనాలకు తగ్గట్టుగా తెరకెక్కిన కాటమరాయుడు భారీ స్థాయిలో విడుదలై మొదటి రోజే సంచలన వసూళ్లతో రికార్డును బ్రేక్ చేసింది.

03/25/2017 - 21:01

గ్లా మర్ తార నయనతార ప్రధాన పాత్రలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన చిత్రం ‘డోర’. దాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాన్ని తెలుగులో సుర ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై మల్కాపురం శివకుమార్ అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈనెల 31న విడుదలకు సిద్ధమైన సందర్భంగా నిర్మాత శివకుమార్ చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే..

03/25/2017 - 20:59

ఈమధ్య సినిమాల విషయంలో కాస్త నిరాశతో వున్నాడు రవితేజ. వరుస పరాజయాల తరువాత ‘బెంగాల్ టైగర్’ చిత్రం కాస్త ఊరటనిచ్చినా, కొంత గ్యాప్ తీసుకుని కొత్త ఉత్సాహంతో సినిమాలు చేయాలనే ప్రయత్నంతో ఏడాది గ్యాప్ తీసుకుని రెండు సినిమాలని మొదలుపెట్టాడు. ‘టచ్ చేసి చూడు’, ‘రాజా ది గ్రేట్’ చిత్రాలు నిర్మాణం దశలో వున్నాయి. అయితే తాజాగా రవితేజ దృష్టి ఓ తమిళ సినిమాపై పడిందట.

03/25/2017 - 20:56

సంచలన తారగా బాలీవుడ్‌లో ఇమేజ్ తెచ్చుకున్న అందాల భామ ప్రియాంకా చోప్రా అటు హాలీవుడ్‌లో కూడా సత్తాచాటింది. ప్రస్తుతం బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టిన ఈ అమ్మడు, ఓ సంచలన పాత్రలో నటించేందుకు ఓకె చెప్పిందట. చాలాకాలం తరువాత బాలీవుడ్ సినిమాలో నటిస్తున్న ప్రియాంక, సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తోంది. ఓ పుస్తకం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆమె వేశ్యపాత్ర పోషిస్తోందని టాక్.

03/25/2017 - 20:54

ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్‌లలో ఓ చిత్రం గూర్చి చర్చ చాలా బాగా జరుగుతోంది. అది మహానటి సావిత్రిపై రూపొందించే సినిమా మీద. సావిత్రిగా నటించడానికి కీర్తి సురేష్, జమున పాత్రలో నటించడానికి సమంత సిద్ధమయ్యారు. అయితే ఈ చిత్రంలో హీరోలుగా ఎవరు నటించనున్నారు అంటే, ఆసక్తికరమైన అంశం వినిపిస్తోంది.

03/25/2017 - 20:52

రామ్ కథానాయకుడిగా స్రవంతి మూవీస్, పి.ఆర్. సినిమాస్ పతాకంపై కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఓ కొత్త చిత్రం ప్రారంభించనున్నారు. గత ఏడాది ‘నేను శైలజ’ సినిమాతో ఆకట్టుకున్న రామ్, గత చిత్రం హిట్ కాంబినేషన్‌తోనే మళ్లీ నటిస్తున్నారు. సరికొత్త లుక్, బాడీ లాంగ్వేజ్ వైవిధ్యంగా వుండేలా ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్, మేఘా ఆకాష్ కథానాయికలుగా నటిస్తున్నారు.

03/25/2017 - 20:51

నాగ అనే్వష్, హెబ్బాపటేల్ జంటగా శ్రీ సరస్వతి ఫిలింస్ పతాకంపై రూపొందుతోన్న చిత్రం ఏంజెల్. భువనసాగర్ నిర్మాతగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి పళని దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ పూర్తిచేసుకుని సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హీరో నాగ అనే్వష్ పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్‌లో జరిగాయి. ఈ సందర్భంగా నాగ అనే్వష్ మాట్లాడుతూ- మంచి కథతో తెరకెక్కుతున్న ‘ఏంజెల్’ చిత్రంలో నటిస్తున్నాను.

03/25/2017 - 20:49

లక్ష్మీ ఫిలింస్ పతాకంపై లక్ష్మీరవి సమర్పణలో ఎన్.టి. నాయుడు నిర్మాతగా, ఎల్.వి. నాయుడు టైటిల్ పాత్రలో బి.ఆర్. నాయుడు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘నరుూం భాయ్’. ఈ చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. నిర్మాత ప్రతాని రామకృష్ణగౌడ్ ట్రైలర్‌ను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ- నరుూం టైటిల్ పాత్రకు ఎల్.వి. నాయుడు సరిగ్గా సరిపోయాడని, ట్రైలర్ బాగుంది.

03/25/2017 - 20:47

మనోజ్ నందన్, భూపాల్, ధన్‌రాజ్ ప్రధాన తారాగణంగా ఆర్.ఓ క్రియేషన్స్ పతాకంపై శ్రీకిశోర్ దర్శకత్వంలో ఆర్.వి.రాజు, ఆక్రోష్ రూపొందిస్తున్న చిత్రం ‘దేవిశ్రీ ప్రసాద్. ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తిచేశారు. సినిమా టీజర్‌ను నిర్మాత రాజ్‌కందుకూరి విడుదల చేశారు.

Pages