S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/10/2017 - 20:51

యువ హీరో నితిన్ ‘అ ఆ’ సంచలన విజయంతో మంచి జోరుమీదున్నాడు. ప్రస్తుతం ఆచి తూచి సినిమాలను ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగుతున్న నితిన్, ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తిచేసుకున్న ఈ చిత్రంలో నితిన్ పోలీస్‌గా కనిపిస్తాడని సమాచారం. నితిన్ కెరీర్‌లో ఇప్పటివరకూ ఈ తరహ పాత్ర చేయలేదు.

03/10/2017 - 20:49

తెలిసీ తెలియని వయసులో చేసిన పొరపాటును తలుచుకుని అందాల భామ బాధపడుతోంది. తనకు 14 ఏళ్ల వయసులోనే బాయ్‌ఫ్రెండ్ ఉండేవాడని, అతనికి లిప్‌లాక్ కూడా ఇచ్చానని చెబుతోంది బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్. అంతా తెలిసి తెలియని వయసులో జరిగిందని, అప్పుడు తనకేమీ తెలియదని ఈ అమ్మడు చెబుతోంది. అవన్నీ గుర్తుకువస్తుంటే అలా చేసి ఉండాల్సింది కాదని బాధపడుతుంటానని కూడా సంజాయిషీ చెబుతోంది.

03/10/2017 - 20:47

నటుడు, నిర్మాత, దర్శకుడు పోలిచర్ల హరనాధ్ తాజాగా నటిస్తూ దర్శక నిర్మాతగా నిర్మిస్తున్న చిత్రం ‘టిక్ టాక్’. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన హరనాధ్ పొలిచర్ల టిక్ టాక్.కామ్ పేరిట రూపొందించిన వెబ్‌సైట్‌ను హైదరాబాద్ సారధి స్టూడియోలో సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ ప్రారంభించారు.

03/10/2017 - 20:45

రాజేష్, శ్రీచక్రవర్తి, ప్రియాంకా శర్మ నాయికా నాయకులుగా సాయి హరీశ్వర్ ప్రొడక్షన్స్ పతాకంపై హరీశ్ వట్టికూటి దర్శకత్వంలో మోహన్‌బాబు పులిమామిడి రూపొందిస్తున్న చిత్రం ‘శివకాశీపురం’. ఈ చిత్రానికి సంబంధించిన అనువాద కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి.

03/09/2017 - 21:08

రాజశేఖర్-జీవితల పెద్ద కుమార్తె శివాని త్వరలో హీరోయిన్‌గా వస్తుందంటూ ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె ఎంట్రీ త్వరలో ఖాయమని చెప్పారు కానీ, అది ఏ హీరో, ఏ దర్శకుడు అనేది మాత్రం క్లారిటీ రాలేదు. మొన్నమధ్య జీవిత కూడా ఇదే విషయంమీద ప్రశ్నిస్తే, అలాంటిదేం లేదు అంటూ చెప్పింది. ఇంకా స్క్రిప్ట్ దశలోనే ఉన్నామని ఆమె చెప్పకుండా చెప్పింది.

03/09/2017 - 21:06

బాలకృష్ణ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై వి.ఆనంద్‌ప్రసాద్ నిర్మాతగా కొత్త చిత్రం పూజా కార్యక్రమాలు గురువారం హైదరాబాద్ కూకట్‌పల్లి తులసివనంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగాయి. తొలి సన్నివేశానికి ఎస్.ఎస్.రాజవౌళి క్లాప్ కొట్టగా, నందమూరి రామకృష్ణ కెమెరా స్విచ్చాన్ చేశారు. తొలి సన్నివేశానికి బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించారు.

03/09/2017 - 21:00

అంజలి టైటిల్ పాత్రలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న చిత్రం చిత్రాంగద. తమిళంలో యార్నీ పేరుతో నిర్మిస్తున్న ఈ హారిజెంటల్ థ్రిల్లర్ కామెడీ చిత్రానికి ‘పిల్లజమీందార్’ ఫేం అశోక్ దర్శకుడు. శ్రీవిఘ్నేష్ కార్తీక్ సినిమా అండ్ క్రియేటివ్ డ్రావిడన్స్ పతాకంపై గంగపట్నం శ్రీ్ధర్, రెహమాన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

03/09/2017 - 20:57

శ్రీతిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్‌పై రెహమాన్, ప్రకాష్ విజయ్ రాఘవన్, అశ్విన్‌కుమార్ తదితరులు తారాగణంగా కార్తీక్ నరేన్ దర్శకత్వంలో చదలవాడ పద్మావతి నిర్మాతగా రూపొందుతున్న చిత్రం ‘16-ఎవ్వెరీ డీటెయిల్ కౌంట్స్’. ఈ సినిమా మార్చి 10న విడుదలవుతోంది.

03/09/2017 - 20:55

గత కొన్నాళ్లుగా మంచి కమర్షియల్ హిట్ లేక ఇబ్బందిపడుతున్న సునీల్ ఈ ఏడాది రెండు సినిమాలకు సైన్ చేశాడు. వాటిలో ఒకటి ఎన్.శంకర్ డైరెక్ట్ చేయనున్న చిత్రం. మలయాళ సూపర్‌హిట్ చిత్రం ‘టూ కంట్రీస్’కు రీమేక్‌గా రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ చేసుకుని త్వరలో కొత్త షెడ్యూల్‌కోసం యుఎస్ కూడా వెళ్లనుందట.

03/09/2017 - 20:52

‘హిమ్మత్‌వాలా’, ‘తుటాక్ తుటాక్ తూటియా’ వంటి ప లు హిందీ సినిమాల్లో నటించిన మిల్కీ బ్యూటీ తమన్నా మరో బాలీవుడ్ చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతోంది. స్టార్ హీరో జాన్ అబ్రహం నటించనున్న చోర్ ‘నికల్‌కే భాగ్’ సినిమాలో తమన్నా నటించనుంది. అయితే ఈ చిత్రంలో ఆమె హీరోయిన్‌గా నటించడంలేదు. కథలో ఓ ముఖ్యమైన పాత్రలో ఎయిర్‌హోస్టెస్‌గా కనిపించనున్నదని బాలీవుడ్ భోగట్టా.

Pages