S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/23/2016 - 20:53

అందాల భామ రకుల్‌ప్రీత్‌సింగ్ ఈమధ్య టాలీవుడ్‌లో చాలా జోరు పెంచింది. స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. అటు యువ హీరోలను, ఇటు సీనియర్ హీరోలను బాగానే లైన్లో పెట్టింది. ముఖ్యంగా మహేష్‌తో నటించాలనే కోరిక వుందంటూ చెప్పిన భామకు త్వరలోనే ఆ ఛాన్స్ దక్కింది. మహేష్-మురగదాస్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రంలో రకుల్ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే.

08/23/2016 - 20:51

‘అట్టకత్తి’, ‘మద్రాస్’ వంటి సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు పా రంజిత్ ఇటీవల సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా ‘కబాలి’ చిత్రాన్ని తీసి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందాడు. కలెక్షన్లపరంగా సునామీ సృష్టించినప్పటికీ ప్రేక్షకులను కబాలి పెద్దగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం ఈ సంచలన దర్శకుడు తన తరువాతి సినిమాకోసం స్క్రిప్ట్ సిద్ధం చేసుకునే పనిలో ఉన్నాడు.

08/21/2016 - 21:09

చిరంజీవి కథానాయకుడుగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందిస్తున్న భారీ చిత్రానికి ‘ఖైదీ నెంబర్ 150’ అనే పేరును ఖరారు చేశారు. మొదట ఈ చిత్రానికి ‘కత్తి’, ‘కత్తిలాంటోడు’ అన్న పేర్లను పరిశీలించారు. చివరికి సెంటిమెంట్ పరంగా ‘ఖైదీ నెంబర్ 150’గా నిర్ణయించారు. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో కాజల్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

08/21/2016 - 21:07

ఒకప్పటి స్టార్ హీరోయిన్, అక్కినేని నాగార్జున భార్య అక్కినేని అమల సుమారు 2 దశాబ్దాల తరువాత మలయాళ పరిశ్రమలో రీఎంట్రీ ఇవ్వనున్నారు. కొత్త దర్శకుడు ‘ఆంటోనీ సోనీ సెబాస్టియన్’ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘కేరాఫ్ సైరాభాను’ పాత్రను నటి మంజు వారియర్ పోషిస్తోంది. ఓ సాధారణ ముస్లిం గృహిణి, ఆమె కొడుకుల మధ్య నడిచే అనుబంధంపై నడిచే కథగా ఈ చిత్రం ఉంటుందని తెలుస్తోంది.

08/21/2016 - 21:05

శ్రీకాంత్, అక్ష జంటగా రాజా ఆర్ట్స్ ప్రొడక్షన్స్, సుబ్రహ్మణ్య ఆర్ట్ క్రియేషన్స్ పతాకాలపై కరణం బాబ్జీ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం మెంటల్. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేశారు. సినిమాలోని పాటల సీడీని నటుడు గోపీచంద్ విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఈ సినిమా మరో‘ఆపరేషన్ దుర్యోధన’లా విజయవంతవౌతుందని, ఔట్‌పుట్ అందరికీ నచ్చేలా వచ్చిందని తెలిపారు.

08/21/2016 - 21:03

ప్రస్తుతం ఆక్సిజన్ చిత్రం లో నటిస్తున్నాడు గోపీచంద్. ఈ సినిమా తరువాత ఆయన మరో సినిమాకు కమిట్‌అయిన విషయం తెలిసిందే. ‘ఏమైందీ ఈవేళ’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమై రామ్‌చరణ్‌తో ‘రచ్చ’వంటి హిట్ సినిమా తీసిన దర్శకుడు సంపత్ నంది చివరగా రవితేజ హీరోగా ‘బెంగాల్ టైగర్’ సినిమాని తెరకెక్కించి మంచి విజయాన్నందుకున్నాడు. ప్రస్తుతం ఈ దర్శకుడు గోపీచంద్ హీరోగా సినిమా తీయనున్నాడు.

08/21/2016 - 21:01

పంచాక్షరి పిక్చర్స్ పతాకంపై విష్ణురెడ్డి, అభిరామ్, సంజన, అశోక్ ప్రధాన తారాగణంగా డా.గౌతమ్ దర్శకత్వంలో పద్మజానాయుడు రూపొందిస్తున్న చిత్రం త్రయం. చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు గౌతమ్ మాట్లాడుతూ..

08/21/2016 - 20:57

బాలీవుడ్‌లో అడల్ట్ అండ్ బోల్డ్ మూవీగా వచ్చిన ‘హంటర్’ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు. కాగా ఈ చిత్రం తెలుగులో రీమేక్ అవుతోంది. నవీన్ దర్శకత్వంలో రూపొందే ఈ రీమేక్‌లో అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రను పోషిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్‌గా రెజీనా సెలక్ట్ అయింది. రెండో హీరోయిన్‌గా నటి, యాంకర్ శ్రీముఖి ఓ హాట్ పాత్రలో కనిపించనుంది.

08/21/2016 - 20:54

వరుణ్‌సందేశ్, ప్రియాంక భరద్వాజ్ జంటగా సాన్వి క్రియేషన్స్ పతాకంపై ఎస్.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో గజ్జెల హరికుమార్‌రెడ్డి రూపొందించిన చిత్రం మిస్టర్ 420. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ముగింపు దశలో ఉంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. వరుణ్‌వందేశ్‌కు ఈ చిత్రం సూపర్‌హిట్‌గా నిలుస్తుందని, కథాకథనాలు విభిన్నంగా ఉంటాయని తెలిపారు.

08/21/2016 - 20:53

భారతీయ మాజీ ఫాస్ట్‌బౌలర్ శ్రీశాంత్ కథానాయకుడుగా నిక్కీగల్రాని కథానాయికగా సురేష్ గోవింద్ దర్శకత్వంలో రాజ్ జకారియా రూపొందిస్తున్న చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రూపొందిస్తున్న ఈ చిత్రం గూర్చి నిర్మాత మాట్లాడుతూ..

Pages