S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/01/2016 - 00:54

మహేష్‌బాబు నటిస్తున్న తాజా సినిమాకు సంబంధించిన షూటింగ్ అహ్మదాబాద్‌లో జోరుగా సాగుతోంది. మురగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఇంతకుముందే హైదరాబాద్ షెడ్యూల్ పూర్తిచేసి ఇప్పుడు అహ్మదాబాద్ షెడ్యూల్‌తో 80 శాతానికిపైగా సినిమాను పూర్తిచేశారు. పరిశ్రమ వర్గాలలో ఆసక్తి రేపుతున్న ఈ సినిమాకు ఇంకా పేరు నిర్ణయించలేదు.

12/01/2016 - 00:52

సినిమా పరిశ్రమలో హీరోలకు ఎక్కడ ఫుల్‌స్టాప్ ఉండదు, అన్నీ కామాలే. వరుసగా హిట్ సినిమాలు పడ్డాయంటే.. చాలు టాప్ హీరోగా నిలబడిపోతాడు, లేదా వరుసగా ఫ్లాప్‌లు వచ్చాయో.. వెనకబడిపోతాడు అంతే తేడా. కానీ హీరోయిన్ విషయంలో అలా కాదు. టాప్ హీరోయిన్‌గా క్రేజ్ తెచ్చుకున్నా కూడా నాలుగైదు సంవత్సరాలే.. లేదంటే ఓ దశాబ్దంపాటు హీరోయిన్‌గా వెలుగొందుతుంది..

12/01/2016 - 00:46

శ్రీ, నాగబాబు, రవిబాబు, అమూల్యారెడ్టి ప్రధాన తారాగణంగా క్రాంతికుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం త్రివిక్రమన్. ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల 10న విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు.

12/01/2016 - 00:46

దెయ్యం అందంగా వుండడం ఏమిటి? అని అనుకుంటున్నారా... నిజమే దెయ్యాలంటే మనలను భయపెడతాయని తెలుసు.. కానీ ఈ దెయ్యం మాత్రం చూసినవారిని తన ప్రేమలో పడేస్తుంది? మీరు ఒక్కసారి ఆ దెయ్యాన్ని చూశారంటే.. అబ్బా అంత అందంగా వుంది అనుకోవలసిందే! నిజం... ఇంతకీ రెజీనా దెయ్యం కథ ఏమిటో తెలుసుకోవాలని ఆసక్తిగా వుంది కదా.. అక్కడికే వస్తున్నా..

12/01/2016 - 00:44

రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న ధ్రువ సినిమా ఈనెల విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో తరువాత ఆయన నటించే సినిమాపై క్లారిటీ వస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో ఆయన నటించనున్నారని, ఇప్పటికే సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ కార్యక్రమాలు, ప్రీపొడక్షన్ పనులు కూడా పూర్తిచేసి త్వరలో సెట్స్‌కు వెళ్లనున్నారని తెలుస్తోంది.

12/01/2016 - 00:57

సర్వమంగళం అనే పిరికివాడు క్రమంగా ధైర్యాన్ని కూడకట్టుకొని సర్వేష్‌గా ఎలా మారాడు అన్న అంశంతో రూపొందిన జయమ్ము నిశ్చయమ్మురా చిత్రం ప్రేక్షకులకు అనిర్వచనీయమైన అనుభూతిని ఇస్తోందని దర్శకుడు శివరాజ్ కనుమూరి తెలిపారు. శ్రీనివాసరెడ్డి, పూర్ణ జంటగా ఎస్‌ఆర్‌ఎఫ్ పతాకంపై సతీష్ కనుమూరితో కలిసి స్వీయ దర్శకత్వంలో శివరాజ్ కనుమూరి రూపొందించిన జయమ్ము నిశ్చయమ్మురా చిత్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే.

11/29/2016 - 21:49

బాలకృష్ణ కథానాయకుడిగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. చిత్రానికి సంబంధించిన కార్యక్రమాలు శరవేగంగా సాగుతోంది. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించిన పాటలను డిసెంబర్ 16న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

11/29/2016 - 21:47

రామచరణ్, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో అల్లు అరవింద్, ఎన్.వి.ప్రసాద్ సంయుక్తంగా రూపొందించిన చిత్రం ధ్రువ. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని డిసెంబర్ 9న విడుదలకు సిద్ధమైంది. కాగా డిసెంబర్ 4న చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుకను జరపనున్నారు.

11/29/2016 - 21:45

విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా రూపొందిస్తున్న ‘గురు’ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేశారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. తమిళంలో విజయవంతమైన ‘ఇరుదుసుత్రు’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేశారు. తమిళంలో దర్శకత్వం వహించిన సుధా కొంగర తెలుగులోనూ నేతృత్వం వహించడం విశేషం. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు కూడా చేపట్టనున్నారు.

11/29/2016 - 21:43

పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ హీరోగా నటిస్తున్న ‘కాటమరాయుడు’ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ లేటెస్టుగా ప్రారంభం అయింది. భారీ అంచనాలమధ్య విడుదలై ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ సినిమా భారీ పరాజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాతో ఎలాగైనా సరే మంచి హిట్ కొట్టాలనే దిశగా ప్లాన్ చేస్తున్నాడు పవన్.

Pages