S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/01/2016 - 20:58

చిరంజీవి 150వ సినిమాగా రూపొందిన ఖైదీ నెంబర్ 150 సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ చిరంజీవి సరసన తొలిసారిగా కథానాయికగా నటించడం విశేషం. చిరంజీవి చిత్రాలకు ఉన్న మాస్ ఇమేజ్ దృష్టిలో ఉంచుకొని ఆయన పాత్రను సృష్టించారు.

12/01/2016 - 20:56

ప్రియాంకా కీలక పాత్రలో బేబి ఇలినాపార్థవి ప్రధాన తారాగణంగా కె.ఆర్.కె.ప్రొడక్షన్స్, లక్ష్మీ వెంకటేశ్వర మూవీస్ సంయుక్తంగా అందిస్తున్న చిత్రం ‘చిన్నారి’. లోహిత్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రం తెలుగు, కన్నడ భాషల్లో రూపొందింది.

12/01/2016 - 20:56

తెలుగు తమిళ భాషల్లో అంజలి ప్రధాన పాత్రలో హారిజాంటల్ థ్రిల్లర్ కామెడీ సినిమాగా రూపొందిస్తున్న చిత్రం ‘చిత్రాంగద’. శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమా అండ్ క్రియేటివ్ డ్రావిడన్ పతాకంపై అశోక్ దర్శకత్వంలో గంగపట్నం శ్రీ్ధర్, రెహమాన్ సంయుక్తంగా రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

12/01/2016 - 20:55

విజయ్ ఆంటోని మరోసారి ‘బేతాళుడు’గా కలెక్షన్ల వేటను మొదలెట్టాడు. ఈ సినిమాకోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఇటు పరిశ్రమలోనూ, అటు ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై ఓ క్యూరియాసిటీ వున్నదని, 500 థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైందని, విన్ విన్ విన్ క్రియేషన్స్ పతాకంపై నిర్మాతలు ప్రదీప్, ఎస్.వేణుగోపాల్ తెలిపారు.

12/01/2016 - 20:54

వేగేశ్న సతీష్ దర్శకత్వంలో శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శర్వానంద్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘శతమానం భవతి’. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపు ముగింపుదశలో వుంది. రానున్న సంక్రాంతికి సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

12/01/2016 - 20:54

వైవిధ్యమైన దర్శకుడు మణిరత్నం-కార్తిల కాంబినేషన్‌లో రూపొందిస్తున్న చిత్రం ‘డ్యూయెట్’. యాక్షన్ లవ్‌స్టోరీగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను తెలుగులో రాజు అందిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ‘ఓకె బంగారం’ సినిమా సమయంలోనే ఈ సినిమా గురించి తనకు దర్శకుడు మణిరత్నం చెప్పారని, మళ్లీ ఈ డ్యూయెట్ సినిమా కథ నచ్చి తెలుగులో అందిస్తున్నారని అన్నారు.

12/01/2016 - 20:53

శ్రద్ధాదాస్, మాధురీ ఇటాజి ప్రధాన తారాగణంగా వేగా ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రాజ్‌కుమార్.జి.ఆర్. దర్శకత్వంలో విక్రంరాజు రూపొందించిన చిత్రం ‘ఆట’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేశారు.

12/01/2016 - 20:53

సాక్షీచౌదరి అంటేనే ఓ అందమైన అమ్మాయి గుర్తుకొస్తుంది. గతంలో అనేక చిత్రాల్లో కథానాయికగా నటించిన ఈ అమ్మడికి ఇప్పుడు అవకాశాలు తక్కువయ్యాయి. అందానికి అందం, నటనకు నటన వున్న సాక్షికి కూసింత అదృష్టం లేకపోవడంతో సరైన సినిమాలు పడలేదు. ఆమె కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అనదగిన సినిమా ఒక్కటీ లేకపోవడంతో ఐటెం పాటలకు కూడా సై అంటోంది.

12/01/2016 - 00:56

నందమూరి కుటుంబం నుండి మరో వారసుడు తెరంగేట్రం చేస్తున్నాడు. ఇప్పటికే బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ అరంగేట్రం ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. గత రెండేళ్లనుండి మోక్షజ్ఞ నటించడానికి అనువైన ఓ జానపద కథకోసం అనే్వషించారు. కొంతమంది సీనియర్స్ కథకులకు ఆదేశాలు కూడా వెళ్లాయి.

12/01/2016 - 00:54

మహేష్‌బాబు నటిస్తున్న తాజా సినిమాకు సంబంధించిన షూటింగ్ అహ్మదాబాద్‌లో జోరుగా సాగుతోంది. మురగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఇంతకుముందే హైదరాబాద్ షెడ్యూల్ పూర్తిచేసి ఇప్పుడు అహ్మదాబాద్ షెడ్యూల్‌తో 80 శాతానికిపైగా సినిమాను పూర్తిచేశారు. పరిశ్రమ వర్గాలలో ఆసక్తి రేపుతున్న ఈ సినిమాకు ఇంకా పేరు నిర్ణయించలేదు.

Pages