S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/25/2016 - 21:16

ఖమ్మం క్రియేషన్స్ బ్యానర్‌పై చిత్రం శ్రీను, శ్రీవల్లి ప్రధాన పాత్రధారులుగా నెప్పలి కృష్ణ దర్శకత్వంలో సరోజిని, దేవా, కోటయ్య, రమణారెడ్డి నిర్మాతలుగా తెరకెక్కుతున్న చిత్రం మయసభ. ఈ సందర్భంగా చిత్రం శ్రీను మాట్లాడుతూ- ‘ఒకే షెడ్యూల్‌లో సినిమా పూర్తిచేయాలని సంకల్పించి ఖమ్మం, కృష్ణా జిల్లా మైలవరం, హైదరాబాద్‌లో చిత్రీకరణ పూర్తిచేశాం. ఈ చిత్రంలో నాలుగు పాటలుంటాయి.

11/25/2016 - 21:15

ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చలకు తెరలేపిన వార్త ఇదే. నాచురల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న నానితో బాలీవుడ్ భామ ప్రియాంకా చోప్రా సినిమా చేస్తుందట. అయితే ఈ చిత్రంలో ఆమె హీరోయిన్‌గా కాదు నిర్మాతగానట. ఆ వివరాల్లోకి వెళితే, బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతూ, మరోవైపు హాలీవుడ్‌లో కూడా క్రేజ్ తెచ్చుకున్న ప్రియాంకా చోప్రా హీరోయిన్‌గానే కాకుండా నిర్మాతగా అడుగులేస్తోంది.

11/25/2016 - 21:14

వికాస్, కళ్యాణి జంటగా దుర్గాదేవి ఫిలిం మేకర్స్ బ్యానర్‌పై ఎన్.డి.ఉదయ్ కుమార్ దర్శకత్వంలో కనవరెడ్డి నాగేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రం ‘తుహిరే మేరీ జాన్’. దర్శకుడు ఉదయ్‌కుమార్ మాట్లాడుతూ-‘ఇదొక ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనింగ్ మూవీ. చిన్న సినిమా అయినా అందరూ ఇష్టపడి చేసిన సినిమా. ఇప్పటికే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకొంది.’అని చెప్పారు.

11/25/2016 - 21:13

అక్కినేని మూడో తరం వారసుడు అఖిల్ హీరోగా ఎంట్రీ ఇస్తూ ‘అఖిల్’ చిత్రంలో నటించాడు. ఆ సినిమా బాక్సాఫీస్‌వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆ సినిమా వచ్చి ఏడాదికిపైగా అయినా ఇప్పటికీ అఖిల్ తదుపరి చిత్రం ఏమిటన్నది ప్రశ్నగానే మిగిలింది. ఇప్పటికే పలువురు దర్శకులతో చర్చలు జరిపిన అఖిల్ ఫైనల్‌గా మనం ఫేం విక్రంకుమార్‌కు ఓకె చెప్పాడు.

11/25/2016 - 03:56

‘అవును’, ‘సీమటపాకాయ్’ చిత్రాలతో హీరోయిన్‌గా క్రేజ్ తెచ్చుకుంది పూర్ణ. తాజాగా కమెడియన్ శ్రీనివాస్‌రెడ్డి హీరోగా శివరాజ్ ఫిలింస్ బ్యానర్‌పై శివరాజ్ కనుమూరి దర్శకత్వంలో రూపొందిన ‘జయమ్ము నిశ్చయమ్మురా’లో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా పూర్ణ చెప్పిన విశేషాలు...
రాణి పాత్రలో..

11/25/2016 - 03:53

విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ కెరీర్‌లో అతి పెద్ద విజయంగా నమోదైన సినిమాల్లో 2003లో దర్శకుడు హరి రూపొందించిన ‘సామి’ ఒకటి. పోలీస్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం విక్రమ్‌కు తిరుగులేని స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టింది. అలాంటి ఈ చిత్రానికి సీక్వెల్‌గా మొదలవుతోంది. దర్శకుడు హరి ఈ సీక్వెల్‌ను సామి-2 పేరుతో తెరకెక్కించనున్నారు.

11/25/2016 - 03:50

ప్రముఖ నటుడు మహేష్‌బాబు, దర్శకుడు మురగదాస్‌ల కాంబినేషన్‌లో నిర్మిస్తున్న చిత్రం ఇప్పటికే చెన్నై, హైదరాబాద్‌లలో షెడ్యూళ్లు పూర్తిచేసుకుని ఈ రోజు అహ్మదాబాద్ వెళ్లనుంది. ఈ షెడ్యూల్ శుక్రవారం మొదలుకానుండగా మహేష్ మాత్రం 27వ తేదీ నుండి షూటింగ్‌లో పాల్గొంటారని తెలుస్తోంది. సుమారు నెల రోజులపాటు జరగనున్న ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారని తెలుస్తోంది.

11/25/2016 - 03:50

విశాల్, తమన్నా జంటగా హరి వెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై ఎం.పురుషోత్తం సమర్పణలో సురాజ్ దర్శకత్వంలో జి.హరి రూపొందించిన చిత్రం ‘ఒక్కడొచ్చాడు’. ఈ చిత్రం డిసెంబర్‌లో విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఇటీవల 500, 1000 రూపాయల నోట్ల రద్దు చేసినందున చిత్రం విడుదల జరగలేదన్నారు.

11/25/2016 - 03:49

సూర్య కథనాయకుడిగా తమిళ, తెలుగు భాషల్లో రూపొందిస్తున్న చిత్రం సింగం-3 స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్ రాజా హరి దర్శకత్వంలో రూపొందిస్తుండగా, సుర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మల్కాపురం శివకుమార్ తెలుగులో అందిస్తున్నారు. షూటింగ్ పూర్తయిన ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

11/25/2016 - 03:49

ప్రత్యూష్ వి.ఆర్., హర్షిత పన్వర్ జంటగా సిద్ధయోగి క్రియేషన్స్ పతాకంపై ప్రభాస్ నిమ్మల దర్శకత్వంలో ఎం.మహేష్ కన్నా రూపొందిస్తున్న సత్యాగ్యాంగ్ చిత్రం గురువారం ఉదయం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. కాశీవిశ్వనాధ్ కెమెరా స్విచ్చాన్ చేయగా పద్మా దేవేందర్ రెడ్డి తొలి క్లాప్‌నిచ్చారు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ గౌరవ దర్శకత్వం వహించారు.

Pages