S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/25/2016 - 03:48

పవన్‌కళ్యాణ్ హిట్ సినిమా ‘బద్రి’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ అమీషా పటేల్ ఆ తరువాత మహేష్‌బాబుతో నాని, న్టీఆర్‌తో నరసింహుడు వంటి సినిమాల్లో నటించినప్పటికీ సక్సెస్ అందుకోలేకపోయింది. 2011లో నందమూరి బాలకృష్ణతో పరమవీరచక్ర సినిమాలో నటించిన ఆమె ఆ తరువాత బాలీవుడ్‌వైపు వెళ్లిపోయింది. దాదాపు 5 సంవత్సరాల తరువాత ఇప్పుడామె తెలుగు సినిమాలోకి రీ ఎంట్రీ ఇస్తోంది.

11/25/2016 - 03:47

ఆనంద్‌కృష్ణ, స్వరూప, బేబి హర్షిత ప్రధాన తారాగణంగా నీలిమా ప్రొడక్షన్స్ పతాకంపై సూర్యకిరణ్ ఇలాది దర్శకత్వంలో ఆనంద్‌కృష్ణ రూపొందిస్తున్న చిత్రం నీలిమలై. దీనికి సంబంధించి షూటింగ్ వనపర్తి పరిసర ప్రాంతాల్లో పూర్తిచేశారు. ఈ సందర్భంగా నిర్మాత ఆనంద్‌కృష్ణ మాట్లాడుతూ, కేరళలోని వివిధ లొకేషన్లలో 70 శాతం షూటింగ్ పూర్తిచేశామని, మిగిలిన షూటింగ్ పార్ట్ ఇక్కడ జరుపుతున్నామని తెలిపారు.

11/25/2016 - 03:46

దర్శకుడు త్రివిక్రమ్ వీణావేదిక ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందించే చిత్రం ‘కారం దోసె’. జి.శివరామచంద్రరావు రూపొందించిన ఈ చిత్రంలో సూర్య శ్రీనివాస్, చందన నాయికా నాయికలుగా నటించారు. దీన్ని వచ్చేనెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

11/25/2016 - 03:45

కిక్, రేసుగుర్రం, టెంపర్ లాంటి పలు సూపర్‌హిట్ సినిమాలకు కథా రచయితగా పనిచేసిన వక్కంతం వంశీ ఎప్పట్నుంచో దర్శకుడిగా మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన దర్శకత్వంలో ఓ సినిమా మొదలవుతుందంటూ ప్రచారం రావడమే తప్ప ఏదీ కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికి అన్నీ కుదిరి వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాకు రంగం సిద్ధమైంది. అల్లు అర్జున్ హీరోగా వంశీ సినిమా తెరకెక్కనుంది.

11/23/2016 - 21:54

చేతన్ మద్దినేని, డింపుల్ జంటగా గల్ఫ్ వలసల నేపథ్యంలో పి.సునీల్‌కుమార్‌రెడ్డి దర్శకత్వంలో శ్రావ్య ఫిలింస్ పతాకంపై ఎక్కలి రవీంద్రబాబు, ఎం.రమణికుమారి నిర్మిస్తున్న చిత్రం ‘గల్ఫ్’. ఇటీవలే చిత్రీకరణ పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దర్శకుడు సునీల్‌కుమార్‌రెడ్డి వివరాలు తెలియజేస్తూ- ‘ఇలాంటి నేపథ్యంలో తెలుగులో సినిమా రాలేదు.

11/23/2016 - 21:53

రామ్‌శంకర్, నికిషా పటేల్ జంటగా శేషాద్రి క్రియేషన్స్ పతాకంపై వాసుదేవ్ దర్శకత్వంలో మేకా బాలసుబ్రహ్మణ్యం, బి.్భస్కర్, వేగిరాజు ప్రసాదరాజు, రామేశ్వరి నక్క సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘అరకురోడ్డులో’.

11/23/2016 - 21:51

బాలీవుడ్‌లో ప్రేమాయణాలు, డేటింగ్‌లు సర్వసాధారణం. ఇప్పటికే పలువురు హీరోయిన్లు ఈ విషయంలో సంచలనం రేపుతున్నారు. నచ్చినోడితో డేటింగ్ చేస్తూ.. ‘అబ్బే మాకేం తెలియదు’ అంటూ బుకాయించడం మామూలే! తాజాగా మరో గ్లామర్ భామ సోనమ్ కపూర్ డేటింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయిందట! నిన్నటితరం హీరో అనిల్‌కపూర్ కూతురిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడికి ఎన్ని సినిమాలు చేసినా కమర్షియల్ విజయాలైతే దక్కడం లేదు.

11/23/2016 - 21:50

జనతా గ్యారేజ్ తరువాత ఎన్టీఆర్ కొత్త సినిమాపై ఇంకా సరైన నిర్ణయం తీసుకున్నట్టు లేదు. ఇప్పటికే పలువురు దర్శకులతో కథా చర్చలు జరుపుతూనే ఉన్నాడు. త్రివిక్రమ్, పూరి జగన్నాథ్, అనిల్ రావిపూడి, వక్కంతం వంశీ అంటూ పెద్ద లిస్టే తయారైంది. త్రివిక్రమ్ సినిమాకు ఇంకాస్త టైం పట్టేలా ఉంది. పూరి సిద్ధంగానే ఉన్నాడు కానీ, ఎన్టీఆరే ముందుకు రావడం లేదట. ఎన్టీఆర్ దర్శకుల లిస్టులోకి మరో కొత్త దర్శకుడు చేరాడు.

11/23/2016 - 21:47

రామ్‌చరణ్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్, వి.ఎన్.ప్రసాద్ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘ధ్రువ’. సెన్సార్ కార్యక్రమాలు పూర్తవగా దీనికి యు/ఎ సర్ట్ఫికెట్ లభించడంతో వచ్చే నెల 9న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, అందరి అంచనాలకు తగ్గట్టుగా ‘ధ్రువ’ విజయవంతం అవుతుందని తెలిపారు.

11/23/2016 - 21:45

ఆ మధ్య బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ హీరోగా వచ్చిన సినిమాతో ఎంట్రీ ఇచ్చిన జరీన్‌ఖాన్ గుర్తుందిగా.. అలా అనేకంటే లేటెస్టుగా ‘హేట్‌స్టోరీ-3’లో బ్రాతో అందాలు హాట్ హాట్‌గా ఆరబోసి క్రేజ్ తెచ్చుకున్న ఈ భామకు ఆ సినిమా తరువాత అచ్చం అలాంటి అవకాశాలే వస్తున్నాయి. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటున్న ఈ భామ ‘వాజహ్ తుమ్ హూ’లో ఓ హాట్ హాట్ ఐటెం సాంగ్ చేసింది.

Pages