S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

02/23/2017 - 01:11

వెనె్నల క్రియేషన్స్ పతాకంపై కుమార్ వట్టి దర్శకత్వంలో బలగ ప్రకాశ్‌రావు రూపొందిస్తున్న చిత్రం మా అబ్బాయి. శ్రీవిష్ణు, చిత్రా శుక్లా జంటగా నటించిన ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను సురేష్ బొబ్బిలి అందించగా, ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది.

02/23/2017 - 01:10

మలయాళం, తమిళ భాషల్లో 20 చిత్రాలకు పైగా హీరోయిన్‌గా నటించి అనతికాలంలోనే మంచి పెర్ఫార్మర్‌గా పేరుతెచ్చుకున్న మియాజార్జ్ ప్రస్తుతం విజయ్ ఆంటోని హీరోగా జీవశంకర్ దర్శకత్వంలో మిర్యాల రవీందర్‌రెడ్డి రూపొందిస్తున్న ‘యమన్’ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది.

02/23/2017 - 01:07

తెలుగు, తమిళ భాషల్లో గ్లామర్ స్టార్‌గా ఎదిగిన అమలాపాల్ దర్శకుడు విజయ్‌ని వివాహమాడిన విషయం తెలిసిందే. అయితే వీరిద్దరూ చెన్నై ఫ్యామిలీ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో విడాకులను మంజూరు చేసింది. గత ఆరునెలలుగా విడివిడిగా వుంటున్నారు. 2014 జూన్ 12న పెద్దలు కుదిర్చిన ఈ పెళ్లితో అమలాపాల్ ఇన్నాళ్లూ సినిమాలకు దూరంగా వుంది.

02/23/2017 - 01:06

రూపేశ్ శెట్టి, రమ్య జంటగా కన్నడంలో రూపొందించిన చిత్రాన్ని తెలుగులో స్వర్ణ్భారతి క్రియేషన్స్ పతాకంపై నిర్మాత సాయి వెంకట్ తెలుగులో అందిస్తున్నారు. దేవరాజ్‌కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంబంధించిన అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి.

02/23/2017 - 01:06

ఈమధ్యే పలు వివాదాల్లో చిక్కుకున్న శే్వతబసు ప్రసాద్ ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా వుంది. రెండు చిత్రాలకు స్క్రిప్ట్ ఎనలిస్ట్‌గా పనిచేస్తూనే మరోవైపు ఓ డాక్యుమెంటరీ రూపొందిస్తోంది. నాలుగేళ్లుగా మ్యూజిక్‌పై రూపొందించిన ఈ డాక్యుమెంటరీతో సంచలనం రేపడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో పెద్దగా సినిమా అవకాశాల్లేని ఈమె, ఈ ప్రాజెక్టును చేపట్టింది.

02/23/2017 - 01:04

సాయిధరమ్‌తేజ్, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘విన్నర్’. ఈ చిత్రం ఈనెల 24న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాతలు నల్లమలుపు శ్రీనివాస్, ఠాగూర్ మధు మాట్లాడుతూ- వెనె్నల కిశోర్ ఈ చిత్రంలో పద్మగా ప్రేక్షకుల గుండెలను గెలుచుకుంటాడని, హిలేరియస్ కామెడీతో తనదైన ముద్రతో కడుపుబ్బ నవ్విస్తాడని తెలిపారు.

02/21/2017 - 20:50

చిత్రరంగంలో బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల వసూలు చేస్తే అది ఓ రికార్డు. ఇటీవలి కాలంలో ఈ మార్క్ దాటిన సినిమాలు ఎక్కువగానే ఉన్నా అది నలుగురైదుగురు హీరోలకే ఆ ఘనత దక్కుతోంది. ముఖ్యంగా ఖాన్ త్రయంగా చెప్పుకునే సల్మాన్‌ఖాన్, అమీర్‌ఖాన్, షారుక్‌ఖాన్ మొదటివరసలో ఉన్నారు. హృతిక్‌రోషన్ వీరితో చెప్పుకోదగ్గ పోటీ ఇస్తున్నప్పటికీ అక్షయ్‌కుమార్, ఖాన్ త్రయంతో ఎప్పటికప్పుడు పోటీపడుతూనే ఉన్నాడు.

02/21/2017 - 20:49

పవన్‌కళ్యాణ్ నటిస్తున్న ‘కాటమరాయుడు’ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ మార్చి నెలాఖరులో విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆడియో వేడుక నిర్వహించడం లేదు. ఒక్కో పాటను ఆన్‌లైన్‌లో విడుదల చేసి గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తారని తెలుస్తోంది.

02/21/2017 - 20:46

యంగ్ హీరో శర్వానంద్ కెరీర్‌లో, తెలుగు సినీ పరిశ్రమలో ఒక క్లాసిక్‌గా నిలిచిపోయిన చిత్రం ‘ప్రస్థానం’. 2010లో విడుదలైన ఈ ఫ్యామిలీ పొలిటికల్ డ్రామా మంచి విజయాన్ని సాధించి పలు అవార్డులను కొల్లగొట్టింది. ఈ చిత్ర దర్శకుడు దేవాకట్ట పలు సందర్భాల్లో ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తానని, సమయంకోసం ఎదురుచూస్తున్నానని అన్నారు. ఇప్పుడు ఆ సమయం వచ్చినట్టే కనిపిస్తోంది.

02/21/2017 - 20:46

‘అష్టాచెమ్మ’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైన స్వాతి ఆ చిత్రంతో ఉత్తమ నటిగా ఫిలింఫేర్, నంది అవార్డులను గెలుచుకుని అందరి దృష్టినీ ఆకర్షించి వరుస ఛాన్సులు దక్కించుకుంది. అలా తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో వరుస అవకాశాలతో ఒక వెలుగువెలిగిన స్వాతి 2015లో వచ్చిన ‘త్రిపుర’ చిత్రం పరాజయంతో బాగా వెనుకబడ్డారు. ఆ చిత్రం విడుదలై సంవత్సరంపైనే అవుతున్నా ఆమె తెలుగులో మరో సినిమా చేయలేదు.

Pages