S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

02/19/2017 - 21:05

నయనతార ప్రధాన పాత్రలో సుర ఎంటర్‌టైన్‌మెంట్స్ మీడియా పతాకంపై మల్కాపురం శివకుమార్ తెలుగులో అందిస్తున్న చిత్రం ‘డోర’. ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు, తమిళ భాషల షూటింగ్ పూర్తిచేశారు. దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం మహిళా ప్రధాన కథనంతో ప్రయోగాత్మకంగా రూపొందిందని, అందులో నయనతార చేసిన పాత్ర సరికొత్తగా ఉంటుందని నిర్మాత శివకుమార్ తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ..

02/19/2017 - 21:03

జయకమల్ ఆర్ట్ పతాకంపై అమనిగంటి వెంకట శివప్రసాద్ దర్శకత్వంలో రామకృష్ణ, అంకిత జంటగా అయితం ఎస్.కమల్ రూపొందిస్తున్న చిత్రం ‘ఉందా లేదా?’ ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేశారు.

02/19/2017 - 21:02

తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన సింగం-3 తమిళులకు ఎంత బాగా నచ్చిందో, తెలుగు వారికి కూడా అంతకన్నా బాగా నచ్చిందని నటుడు అనూప్‌సింగ్ తెలిపారు. సూర్యు కథానాయకుడుగా స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్ రాజా సమర్పణలో సుర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మల్కాపురం శివకుమార్ రూపొందించిన సింగం-3 విడుదలైన సంగతి తెలిసిందే.

02/18/2017 - 21:11

తెలుగు సినిమాల్లో కొత్తదనం ఉండదు.. ఫక్తు మాస్ మసాలా అంశాలతో హీరోయిజాన్ని ప్రదర్శించే ఫార్ములాతో కమర్షియల్ సినిమాలే చేస్తారు.. భిన్నమైన సినిమాలు రావాలంటే అది తమిళ పరిశ్రమలోనే సాధ్యం.. నిజమే- ఏ తెలుగు సినిమా తీసుకున్నా హీరో.. అతని ఫ్లాష్‌బ్యాక్.. తన కుటుంబానికో.. తన తనవాళ్లకో అన్యాయం చేసిన విలన్‌ను అంతమొందించడం.. విలన్ కూతురో.. లేక హీరోకి మరదలో హీరో వెంట పడుతూ..

02/18/2017 - 21:08

అక్కినేని నాగార్జున, హథీరామ్‌బాబా జీవిత కథతో ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు తెరకెక్కించిన చిత్రం ‘ఓం నమో వెంకటేశాయ’. సాయికృప ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మహేష్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్‌తో రన్ అవుతోంది. ముఖ్యంగా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకర్షిస్తూ దూసుకుపోతోంది.

02/18/2017 - 21:06

అల్లు అర్జున్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ‘దువ్వాడ జగన్నాథం’ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్ శనివారం విడుదలైంది. భిన్నమైన లుక్‌లో అల్లు అర్జున్ కనిపించి ఆకట్టుకున్నాడు. ఇప్పటికే ఈ లుక్ సంచలనం రేపుతోంది.

02/18/2017 - 21:04

నవదీప్, కావ్య జంటగా లెజెండ్ పిక్చర్స్ పతాకంపై ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్ దర్శకత్వం లో రమేష్‌బాబు కొప్పుల రూపొందిస్తున్న సస్పెన్స్ యాక్షన్ ధ్రిల్లర్ చిత్రం నటుడు. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా హీరో నవదీప్ మాట్లాడుతూ- ఈ కథ చాలా థ్రిల్లింగ్‌గా వుంటుందని, తనను నటుడిగా మరో మెట్టు ఎక్కించే విధంగా రూపొందిందని తెలిపారు.

02/18/2017 - 21:02

‘బిచ్చగాడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటుడు విజయ్ ఆంటోని. ఆయన తదుపరి చిత్రంగా రాజకీయ నేపథ్యంలో రూపొందిన చిత్రం యమన్.

02/18/2017 - 20:59

రాజేష్ రాధోడ్, మోనికాసింగ్, షాలు చౌరాసియా ప్రధాన తారాగణంగా కిశోర్ స్వీయ దర్శకత్వంలో బిగ్ విగ్ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందుతోన్న ‘ఓ పిల్లా నీవల్లా’ చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ సీడిని విడుదలచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ- పాటలు బాగున్నాయి, తప్పకుండా సినిమా విజయం సాధించాలి అన్నారు. మరో నిర్మాత రాజ్ కం దుకూరి మాట్లాడుతూ- టైటిల్ బాగుంది.

02/18/2017 - 20:57

గ్లామర్ భామ తమన్నాకు గత ఏడాది అంతా కలిసి రాలేదు. చేసిన సినిమాలు పెద్దగా కమర్షియల్ విజయాలు సాధించకపోవడం, ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘అభినేత్రి’ భారీ పరాజయం పాలవడంతో ఈమధ్య అవకాశాలు తగ్గిపోయాయి. ప్రస్తుతం తమిళంలో రెండు క్రేజీ చిత్రాల్లో నటిస్తున్న తమన్నాకు తెలుగులో కూడా ఓ మంచి అవకాశం దక్కింది.

Pages