S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

02/03/2017 - 21:33

సూర్య, శ్రుతి హాసన్, అనుష్క ప్రధాన తారాగణంగా తెలుగు, తమిళ భాషల్లో స్టూడియో గ్రీన్ కె.ఇ.జ్ఞానవేల్‌రాజా సమర్పణలో సుర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మల్కాపురం శివకుమార్ అందిస్తున్న చిత్రం ‘యముడు 3’. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 9న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ హారిస్ జయరాజ్ అందించిన ఆడియో సూపర్‌హిట్‌గా నిలిచిందని తెలిపారు.

02/03/2017 - 21:32

కొరియోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించిన రాఘవ లారెన్స్ ఆ తరువాత నటుడిగా, దర్శకుడిగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. కమర్షియల్ దర్శకుడిగా కూడా సత్తా చాటుతున్నాడు. ఆమధ్య కాంచన సినిమాలో హీరోయిన్‌గా లక్ష్మీరాయ్‌తో చిందేసినప్పటినుండి లారెన్స్ ఆమెను వదిలేలా కనిపించడం లేదు. ఇటీవలే మెగాస్టార్ నటించిన ఖైదీ నెం 150వ సినిమాలో లారెన్స్ డాన్స్‌మాస్టర్‌గా ఓ పాటను కంపోజ్ చేశాడు.

02/03/2017 - 20:57

రాఘవ లారెన్స్ కథానాయకుడిగా పి.వాసు దర్శకత్వంలో అభిషేక్ ఫిలింస్ పతాకంపై రమేష్ పి.పిళ్లై అందిస్తున్న చిత్రం ‘శివలింగ’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయిన సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి ఆదరణ లభిస్తోందని, కథే హీరోగా కన్నడంలో బ్లాక్‌బస్టర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని హారర్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దారని తెలిపారు.

02/03/2017 - 20:56

పవన్‌కళ్యాణ్ త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తాడన్న విషయం అభిమానులకు తెలుసు. దర్శకుడు ఆర్.టి.నేసన్ తెరకెక్కించే మరో చిత్రం కూడా చేయనున్నాడు పవన్‌కళ్యాణ్. ఇందులో పవన్ సరసన హీరోయిన్‌గా రకుల్‌ప్రీత్ సింగ్ దాదాపు ఖాయం అనుకున్నారు. కానీ ఇప్పుడా ఆఫర్‌ని రకుల్ రిజెక్ట్ చేసిందట! ఇందుకు కారణం.. పవన్ కోసం డేట్స్ అడ్జెస్ట్ కాలేదట!

02/02/2017 - 21:04

అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం త్వరలో తెరకెక్కనుంది. చిరంజీవి, పవన్‌కళ్యాణ్ కలిసి నటించనున్న ఓ చిత్రం త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. నిర్మాత టి.సుబ్బిరామిరెడ్డి రూపొందిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు త్రివిక్రమ్.

02/02/2017 - 20:55

గోపీచంద్, రాశిఖన్నా, అను ఇమ్మానియేల్ ప్రధాన తారాగణంగా శ్రీ సాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎ.ఎం.జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఎస్.ఐశ్వర్య రూపొందిస్తున్న చిత్రం ఆక్సిజన్. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు.

02/02/2017 - 20:53

రానా, తాప్సీ జంటగా పి.వి.పి సినిమా మరియు మాటినీ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా సంకల్ప్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ఘాజి’. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.

02/02/2017 - 20:52

శింబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘సరసుడు’. నయనతార, ఆండ్రియా, ఆదాశర్మ హీరోయిన్లుగా దర్శకుడు పాండిరాజ్ దర్శకత్వంలో శింబు సినీ ఆర్ట్స్ పతాకంపై టి.రాజేందర్ నిర్మించిన చిత్రం ‘సరసుడు’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.

02/02/2017 - 20:50

హీరోయిన్ రియాచక్రవర్తి గుర్తుందా? అలా అంటే గుర్తుపట్టడం కష్టమే. కానీ సుమంత్ అశ్విన్ హీరోగా ఎమ్మెస్‌రాజు రూపొందించిన ‘తూనీగ తూనీగ’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన రియా అంటే అందరికీ తెలుస్తుంది. నిధి పాత్రలో నటించిన ఈమెకు ఆ సినిమా అంతగా గుర్తింపునివ్వలేదు. టాలీవుడ్‌లో సెటిలవ్వాలని కలలుగన్న రియా కలలు కల్లలుగానే మిగిలిపోయాయి. ఆ సినిమా తర్వాత ఈమెకు పెద్దగా అవకాశాలు దక్కలేదు.

02/02/2017 - 20:49

కాలింగ్‌బెల్ చిత్రంతో అందరి ప్రశంసలు అందుకున్న దర్శకుడు పన్నా రాయల్ ఆ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిస్తున్న మరో హారర్ ఎంటర్‌టైనర్ ‘రాక్షసి’. పూర్ణ ప్రధాన పాత్రలో అభినవ్ సర్దార్, అభిమన్యుసింగ్, గీతాంజలి ముఖ్యపాత్రల్లో డ్రీమ్ క్యాచర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై అశోక్ మందా, రాజ్ దళవాయ్, టోనీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Pages