S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/28/2017 - 21:17

మోహన్‌లాల్, ప్రియదర్శన్ కాంబినేషన్‌లో రూపొందిన క్రైం థ్రిల్లర్ చిత్రం కనుపాప. మలయాళంలో విజయవంతమైన ఈ చిత్రాన్ని కన్నడ, హిందీ భాషల్లో రీమేక్ చేయడం విశేషం. దిలీప్‌కుమార్ బొలుగేటి తెలుగులో అందిస్తున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 3న విడదల చేయనున్నారు.

01/28/2017 - 21:15

సినిమాల్లో ఏది ఉన్నా లేకపోయినా గ్లామర్ తప్పనిసరి అన్న విషయం ఏ హీరోయిన్‌ను అడిగినా చెబుతారు. గ్లామర్ ఉంటే ఆమెదే హంగామా.. లేదు నేను ఇలానే నటిస్తాను, ఇలాంటి పాత్రలే చేస్తాననని మడికట్టుకుని కూర్చుంటే మూటాముల్లె సర్దుకుని ఇంటికి వెళ్లాల్సిందే. ఈ విషయాన్ని కాస్త లేట్‌గా తెలుసుకున్నట్టుంది ఈ హాట్ భామ. అందుకే కాస్త గ్లామర్ డోస్ పెంచేందుకు సిద్ధమైన ఆ భామ ఎవరో కాదు సోనాక్షి సిన్హాయే.

01/28/2017 - 21:13

తమిళ హీరోలకు ఉన్నంత ఫోకస్ ఎందుకో తెలుగు హీరోలకు ఉండదు? తమిళ హీరోలు తెలుగు బాక్సాఫీస్‌పై దుమ్ము రేపుతూ అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ సినిమాను ప్రమోట్ చేసి మంచి విజయాలను అందుకుంటున్నారు. ఇప్పటికే రజనీకాంత్, కమల్ హాసన్ నుండి నిన్న మొన్న వచ్చిన రెమో హీరో వరకు తెలుగులో కూడా ఇమేజ్ తెచ్చుకోవాలని ట్రై చేసినవారే. కానీ మన హీరోలకు టాలీవుడ్ ఒక్కటే చాలన్నట్టు ప్రవర్తిస్తారు.

01/28/2017 - 21:12

పెళ్లి అనేది వ్యక్తిగత జీవితంలో తప్పనిసరి. అయితే, నా వ్యక్తిగత నిర్ణయాలు నేనే తీసుకుంటాను. ఫలితాలు ఎలా వచ్చినా అది నాకు సంబంధించినదే. దేవుడు ఉన్నాడు కనుక చూసుకుంటాడులే అన్న నమ్మకంతోనే ఉంటానని చెప్పుకొచ్చింది శ్రుతి హాసన్.

01/28/2017 - 21:10

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తూ నటించిన ఖైదీ నెం 150వ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై దూసుకుతోంది. మెగాస్టార్ సరసన అనుష్కను నటింపజేయాలని యూనిట్ భావిస్తోందట. అన్నట్టు ఈ చిత్రాన్ని కూడా రామ్‌చరణ్ నిర్మిస్తాడట. చిరంజీవి 150వ సినిమా కోసం ఆమధ్య పలువురు హీరోయిన్స్ నటిస్తున్నట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అనుష్క, నయనతార, తమన్నా లాంటి వాళ్ళ పేర్లు వినిపించాయి కానీ ఫైనల్‌గా కాజల్ ఓకే అయింది.

01/28/2017 - 21:08

జనతా గ్యారేజ్ తరువాత బాబీ దర్శకత్వంలో నటించేందుకు ఓకే చెప్పాడు ఎన్టీఆర్. ప్రీ ప్రొడక్షన్ పనులు,స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన ఈ సినిమా వచ్చే నెలలో సెట్స్‌పైకి రానుంది. నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆ విషయం పక్కనపెడితే, ఈ సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి గ్లామర్ భామ లక్ష్మీరాయ్‌ని ఎంపిక చేస్తారట.

01/28/2017 - 21:06

.ఆ హీరోతో ఎఫైర్ ఉన్న విషయంపై ఆ అమ్మడు స్పందించి.. అవును నిజమే అన్న తరహాలో జవాబివ్వడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. ఇన్నాళ్లు ఆయనంటే చాలా ఇష్టం.. ఆయనతో కలిసి పిల్లలను కనాలని ఉంది అంటూ నానా హంగామా చేసిన గ్లామర్ భామ దీపికా పదుకొనె లేటెస్టుగా నటించిన హాలీవుడ్ ట్రిపుల్ ఎక్స్ సినిమా మంచి క్రేజ్‌తో రన్ అవుతోంది. ఇప్పటికే భారీ క్రేజ్ తెచ్చుకున్న దీపికా ఓ టీవీ లైవ్ షోలో పాల్గొంది.

01/27/2017 - 21:10

.గోపీచంద్, హన్సిక, కేథరీన్ ట్రెసా ముఖ్యపాత్రల్లో సంపత్‌నంది దర్శకత్వంలో శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై జె.్భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్న చిత్రం ఈరోజునుంచి నాలుగో షెడ్యూల్‌ను ప్రారంభించుకుంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే మూడు షెడ్యూల్స్‌ను పూర్తిచేసుకుంది.

01/27/2017 - 21:07

ప్రముఖ నటుడు మహేష్‌బాబు హీరోగా తమిళ క్రేజీ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే అహ్మదాబాద్, ముంబాయి, హైదరాబాద్‌లలో జరిగిన షెడ్యూల్స్‌తో చాలావరకూ షూటింగ్ పూర్తయింది. నేటినుండి ముంబాయిలో మరో షెడ్యూల్ మొదలుపెట్టనున్నారు.

01/27/2017 - 21:05

సర్వేశ్వర మూవీస్ పతాకంపై జొన్నలగడ్డ శివ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన చిత్రం ‘పోలీస్ పవర్’. గుద్దేటి బసవప్ప మేరు ఈ చిత్రాన్ని రూపొందించారు. సినిమాకు సంబంధించిన ఆడియో సీడీని హైదరాబాద్ ప్రసాద్ లాబ్‌లో గోపీనాథ్ రెడ్డి విడుదల చేశారు.

Pages