S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/27/2017 - 21:03

అంతర్జాతీయ నటుడు జాకీచాన్, సోనూసూద్, అమైరా దస్తూర్, దిశాపటాని ముఖ్యపాత్రల్లో ఇండో చైనా చిత్రంగా తెరకెక్కిన చిత్రం కుంగ్‌ఫూయోగా. ఈ చిత్రాన్ని తెలుగులో కల్పన చిత్ర పతాకంపై కోనేరు కల్పన అందిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 3న విడుదలవుతోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సోనూసూద్ ఈ చిత్రంతో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సందర్భంగా నటుడు సోనూసూద్‌తో ఇంటర్వ్యూ..

01/27/2017 - 21:00

ఆర్య కథానాయకుడిగా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రూపొందిస్తున్న చిత్రం ‘మండే సూర్యుడు’. సర్వల ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ సూర్య సాకేత్ పిక్చర్స్ పతాకాలతో మగిళ్ తిరుమేని దర్శకత్వంలో బెల్లంకొండ వెంకటేశ్వర్లు, కొలన ఎల్లారెడ్డి, సర్వల గణేశ్ యాదవ్ అందిస్తున్న ఈ చిత్రంలో హన్సిక కథానాయికగా నటించారు. సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఇటీవల విడుదలై మంచి ఆదరణ పొందుతోందని నిర్మాతలు తెలియజేశారు.

01/27/2017 - 20:59

ఐశ్వర్యా రాయ్ పోలికలతో వుందని బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసిన అందాల భామ స్నేహా ఉల్లాల్‌కు ఆ తరువాత కెరీర్ ఆశించిన స్థాయిలో లేకుండా పోయింది. తెలుగులోకి ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’తో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడికి ఆ తరువాత పలు అవకాశాలు వచ్చినా, అవి ఆమెను హీరోయిన్‌గా నిలబెట్టలేకపోయాయి. గ్లామర్ హంగులతో ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ విఫలమయ్యాయి.

01/27/2017 - 20:57

బాలీవుడ్ గ్లామర్ భామ మలైకా అరోరా వ్యవహారం మాంచి జోరుమీదుంది. ఇప్పటికే ఈమెపై రకరకాల వార్తలు బాలీవుడ్‌లో జోరుగా షికారు చేస్తున్నాయి. భర్త అర్బాజ్‌ఖాన్‌తో విడాకుల వ్యవహారం, పార్టీల్లో తాగేసి నానా హంగామా చేయడం వంటివి రోజురోజుకూ కొత్తకొత్తగా వినిపిస్తున్నాయి. తాజాగా ఈమె మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

01/27/2017 - 20:55

తెలంగాణ మూవీ అండ్ టీవీ ఆర్టిస్ట్ యూనియన్ నూతన సంవత్సర డైరీని ప్రముఖ నిర్మాత,
ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు సి.కల్యాణ్ ఫిలిం ఛాంబర్‌లో ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో శివశంకర్, రామసత్యనారాయణ, ప్రతాని రామకృష్ణగౌడ్, సత్యారెడ్డి,
ననావత్ నాయక్, ముత్తంశెట్టి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు

01/27/2017 - 20:53

తమిళ స్టార్ హీరో విజయ్, దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్‌లో ఇప్పటికే రెండు బ్లాక్‌బస్టర్ చిత్రాలు వచ్చాయి. తుపాకీ, కత్తి చిత్రాలు వీరి కాంబినేషన్‌లో వచ్చినవే. ఈ రెండు సినిమాలు సంచలన విజయం సాధించాయి. ఈ క్రేజీ కాంబినేషన్ హ్యాట్రిక్ విజయంపై కనే్నసినట్లు తెలుస్తోంది. విజయ్-మురుగదాస్ కాంబినేషన్‌లో మరో చిత్రం రాబోతోంది. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్ సంస్థ నిర్మించనుంది.

01/27/2017 - 20:52

ధృవ సక్సెస్ తరువాత రామ్‌చరణ్ హీరోగా నటించే సినిమాకి సర్వం సిద్ధమైంది. ఈనెల 30 నుండి సెట్స్‌పైకి రానున్న ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రీప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుందంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

01/26/2017 - 01:17

విభిన్నమైన స్వరధారతో భక్తిని, అనురక్తిని మేళవించి పాటపాడి శ్రోతల మనసులను రంజింప చేసిన ఏసుదాసు నిజంగానే పాటకు, సంగీతానికి దాసుడు. భక్తిపాటకు ఆధ్యాత్మిక సౌరభాన్ని అందించడంలో, సినిమా పాటకు పరిమళాన్ని, శాస్ర్తియ సంగీతానికి గమక సౌందర్యాన్ని అద్ది హృదయాన్ని పులకింప చేయడంలో ఆయనది ప్రత్యేక శైలి.

01/26/2017 - 01:15

జనతాగ్యారేజ్ విజయం తరువాత ఎన్టీఆర్ మరో చిత్రాన్ని ఇంకా మొదలుపెట్టలేదు. తాజాగా ఆయన బాబి దర్శకత్వంలో రూపొందే చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్ సమాచారం. మూడు పాత్రలతో కూడిన ఆ సినిమాలో ఎన్టీఆర్‌ను ఓ కొత్తకోణంలో చూపడానికి స్క్రిప్ట్ సిద్ధం చేశారట. కళ్యాణ్‌రామ్ రూపొందిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 11న ప్రారంభం కానుంది.

01/26/2017 - 01:12

రవితేజ కథానాయకుడిగా లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నూతన దర్శకుడు విక్రమ్ సిరికొండ నేతృత్వంలో నల్లమలుపు శ్రీనివాస్, వల్లభనేని వంశీ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘టచ్ చేసి చూడు’. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు రవితేజ జన్మదినోత్సవం సందర్భంగా దర్శక, నిర్మాతలు తెలియజేశారు. రవితేజ ఇమేజ్‌కు తగిన విధంగా వంశీ మంచి కథను తయారుచేశారని, ఫిబ్రవరి మొదటివారంలో షూటింగ్ మొదలుపెడుతున్నామని తెలిపారు.

Pages