S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/06/2017 - 20:39

ఏంటీ.. టైటిల్ వినగానే షాక్ అవుతున్నారా? మీరనుకున్నది ఏం కాదు. అసలు విషయంలోకి వస్తే, ఈ ఏడాది చిన్న సినిమాగా విడుదలై తెలుగులో ఘనవిజయం సాధించిన పెళ్లిచూపులు చిత్రం పలు భాషల్లో రీమేక్ చేసేందుకు గట్టి పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. తమిళంలో రీమేక్ చేసేందుకు ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ హక్కులు స్వంతం చేసుకున్నారు. ఇందులో హీరోయిన్‌గా తమన్నా నటిస్తుందట.

01/05/2017 - 21:13

ఎనిమిదేళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన 150వ సినిమా ఈనెల 11న విడుదలకు ముస్తాబైంది. ‘ఖైదీ నెంబర్ 150’ పేరుతో వివి వినాయక్ దర్శకత్వంలో 150వ చిత్రాన్ని పూర్తి చేసిన చిరు తర్వాతి సినిమాకు అప్పుడే సన్నాహాలు మొదలుపెట్టాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేసేందుకు మెగాస్టార్ ఓకే చెప్పాడు. ప్రస్తుతం బోయపాటి శ్రీను, బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.

01/05/2017 - 21:12

సింహ ఫిలింస్ పతాకంపై షకలక శంకర్, పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రల్లో గంటా రామకృష్ణ నాయుడు దర్శకత్వంలో అనిల్‌కుమార్.జి నిర్మిస్తున్న చిత్రం ‘నా కొడుకు పెళ్లి జరగాలి మళ్లీ మళ్లీ’. ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ చేతుల మీదుగా ఈ చిత్రం గురువారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రారంభం జరుపుకుంది.

01/05/2017 - 21:10

అల్లు అర్జున్, దర్శకుడు హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో ‘డీజే’ దువ్వాడ జగన్నాథం సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ వస్తోంది. కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో గురువారం ప్రారంభమైంది. హరీశ్ శంకర్ దర్శకత్వంలో యాక్షన్ కామెడీగా తెరకెక్కుతున్న ‘డీజే’లో అల్లు అర్జున్ పాత్ర హైలైట్‌గా నిలుస్తుందని, వచ్చే వేసవిలో దీన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

01/05/2017 - 21:08

ఈమధ్య హీరో రవితేజ ఏ సినిమా చేయడానికి ఓకె చెప్పడం లేదు. ఇప్పటికే పలువురు దర్శకులు కథలు చెప్పినా ఎవరికీ కమిట్‌మెంట్ ఇవ్వడం లేదు. ‘బెంగాల్ టైగర్’ విడుదలై ఏడాది పూర్తయినా రవితేజ కొత్త సినిమాకు ముహూర్తం కుదరలేదు. ‘పటాస్’ దర్శకుడు అనిల్ రావిపూడితో సినిమా చేసేందుకు రవితేజ ఓకే చెప్పాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తిచేసుకున్న ఈ సినిమా సంక్రాంతి తరువాత సెట్స్‌పైకి రానుంది.

01/05/2017 - 21:07

నిఖిల్ కథానాయకుడిగా అభిషేక్ పిక్చర్స్ పతాకంపై సుధీర్‌వర్మ దర్శకత్వంలో అభిషేక్ నామా రూపొందిస్తున్న చిత్రం ‘కేశవ’. నిఖిల్, సుధీర్‌వర్మ కాంబినేషన్ అనగానే భారీ అంచనాలు సినిమాపై నెలకొన్నాయని, అందుకు నిదర్శనంగా పంపిణీదారులు ముందుకు వస్తున్నారని నిర్మాత అన్నారు.

01/05/2017 - 21:05

ఓకె బంగారం సినిమాతో తన మ్యాజిక్ ఏంటో మరోసారి నిరూపించుకొని, సూపర్‌హిట్ కొట్టిన క్రేజీ దర్శకుడు మణిరత్నం తాజాగా మళ్లీ ఓ రొమాన్స్ డ్రామాతోనే మెప్పించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ‘కాట్రువేళదియై’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కార్తీ, అదితి రావు హైదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. తెలుగులో ఈ సినిమాను ‘డ్యూయెట్’ పేరుతో దిల్‌రాజు విడుదల చేస్తున్నారు.

01/05/2017 - 21:04

సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్, ఠాగూర్ మధు సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘విన్నర్’. ఈ సినిమా కోసం సాయిధరమ్ తేజ్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం మొదలుపెట్టారు. ప్రమోషన్ కూడా సమాంతరంగా నిర్వహిస్తూ ఫిబ్రవరి నెలాఖరులో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు.

01/05/2017 - 21:03

నాని, కీర్తి సురేష్ జంటగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో దిల్‌రాజు రూపొందిస్తున్న ‘నేను లోకల్’ చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుపుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, తొలి పాటను శుక్రవారం సాయంత్రం విడుదల చేస్తున్నామని, దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం హైలైట్‌గా నిలుస్తుందని, ఫిబ్రవరిలో సినిమా విడుదల చేస్తామని తెలిపారు.

01/05/2017 - 21:01

మంచు విష్ణు కథానాయకుడిగా ఎం.వి.వి సినిమా పతాకంపై రాజ్‌కిరణ్ ద దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘లక్కున్నోడు’. ఆడియోను ఈనెల 9న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత ఎం.వి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ, కుటుంబమంతా కలిసి చూడదగిన విధంగా దీన్ని రూపొందించామని, హన్సిక-విష్ణు జంటగా నటిస్తున్న మూడో సినిమా ఇదని తెలిపారు.

Pages