S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/29/2016 - 21:28

రైజింగ్ డ్రీమ్ ప్రొడక్షన్స్ సమర్పణలో జ్ఞానప్రకాష్, సూర్య శ్రీనివాస్, ప్రియాంకా పల్లవి ప్రధాన పాత్రల్లో పరంద్ కళ్యాణ్ దర్శకత్వంలో భాషా మజహర్ నిర్మించిన నేనొస్తా చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలవుతున్న సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో ట్రైలర్ లాంఛ్ కార్యక్రమం జరిగింది.

12/29/2016 - 21:27

శాతవాహన కాలం తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన శకం. ఆ కాలానికి చెందిన శాతకర్ణి కథను తెరకెక్కిస్తున్నారు క్రిష్. తన ప్రయత్నంలో ప్రేక్షకులను భాగం చేసేందుకు గౌతమిపుత్ర శాతకర్ణి టీం తీసుకొస్తున్న ప్రోగ్రామ్ ‘గౌతమిపుత్ర శాతకర్ణి లాయల్టీ కాంటెస్ట్’. గౌతమిపుత్ర శాతకర్ణి డాట్ కామ్ వెబ్‌సైట్‌లో అభిమానుల కోసం శాతవాహనుల అద్భుత చరిత్ర, బాలకృష్ణ వంద సినిమాల ప్రస్థానాన్ని పొందుపరిచారు.

12/29/2016 - 21:25

దక్షిణాది ప్రేక్షకులను తన బొద్దు అందాలతో ఆకట్టుకున్న హాట్ భామ నమితకు ఈమధ్య పెద్దగా అవకాశాలు రావడం లేదు. అడపాదడపా అవకాశాలను అందిపుచ్చుకుంటున్న ఆమెకు తమళంలోనే కాస్త క్రేజ్ ఉంది. ఆమధ్య నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన సింహ సినిమాలో మెరిసిన నమిత చాలారోజుల తరువాత మళ్లీ తెలుగు తెరపై తన అందాలు ఆరబోసేందుకు రెడీ అయింది. ఆమధ్య సంచలనం రేపిన గుంటూరు టాకీస్ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ఆమె నటిస్తోంది.

12/29/2016 - 21:23

రవితేజ, వీరం రెడ్డి, శిరీష, మనోహర్‌కుమార్ ప్రధాన పాత్రల్లో షిరిడీ సాయి క్రియేషన్స్‌పై తాడి మనోహర్ కుమార్ దర్శక నిర్మాతగా రూపొందిస్తున్న మిస్ ఇండియా చిత్రం గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. అనంతరం మీడియా సమావేశంలో మనోహర్‌కుమార్ మాట్లాడుతూ-‘తెలుగమ్మాయికి హీరోయిన్‌గా అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో శిరీషను ఎంపిక చేశాం.

12/28/2016 - 21:37

ఎప్పటికప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచే బాలీవుడ్ భామ కంగనా రనౌత్ ఆమధ్యన హీరోయిన్లను హీరోలు వాడుకుంటారని ఘాటు కామెంట్లు చేసింది. ఈ వ్యాఖ్యలనే ఇటీవల జరిగిన ఓ ఇంటర్‌వ్యూలో మళ్లీ చేసింది. తాను అప్పుడు చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని కంగనా చెబుతోంది. తను కూడా అలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నానని తెలిపింది.

12/28/2016 - 21:36

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న వందో సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ఆడియో విడుదలైంది. సంక్రాంతి కానుకగా దీన్ని విడుదల చేస్తారని సమాచారం. కాగా, బాలయ్య 101వ సినిమాపై అప్పుడే ఆసక్తికర వార్తలు పుట్టుకొస్తున్నాయి. కృష్ణవంశీ దర్శకత్వంలో బాలయ్య నటించబోతున్నట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఆ తరువాత మళ్లీ ఆ సినిమా ఊసే లేదు. ఈలోగా మరో ఒకరు ఇద్దరు దర్శకులు లిస్ట్‌లోకి వచ్చారు.

12/28/2016 - 21:35

గ్లామర్ భామగా తక్కువ సమయంలోనే మంచి ఇమేజ్ తెచ్చుకుంది మలయాళ కుట్టి అమలా పాల్. ‘మైన’తో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ నాలుగైదు సినిమాలకే స్టార్ హీరోలతో జోడీ కట్టింది. అంతే త్వరగా పెళ్లి చేసుకొని కొన్నాళ్ళు సినిమాకు దూరం అయిన ఈమె భర్త విజయ్‌కి బ్రేక్‌అప్ చెప్పింది. ప్రస్తుతం సినిమాలపై ఫోకస్ పెట్టిన అమలకు వరుస అవకాశాలు క్యూ కట్టేశాయి.

12/28/2016 - 21:34

పవన్‌కల్యాణ్ తాజా చిత్రం ‘కాటమరాయుడు’కు పొలాచ్చిలో కీలక షెడ్యూల్ పూర్తిచేశారు. ఆ మధ్య విడుదలైన ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ మెప్పించకపోవడంతో ఈ సినిమా హిట్టవ్వాలని పవన్ అభిమానులు కోరుకుంటున్నారు. కాటమరాయుడుకు సంబంధించిన లుక్స్, టీజర్స్ త్వరగా రిలీజ్ చేస్తే బాగుంటుందన్న అభిమానుల కోరిక మేరకు నూతన సంవత్సర కానుకగా కొత్త పోస్టర్‌ను నిర్మాత శరత్ మరార్ బుధవారం విడుదల చేశారు.

12/28/2016 - 21:33

తమిళ యువహీరో విజయ్ నటిస్తున్న 61వ చిత్రం పట్ల సినీ అభిమానుల్లో ఎంతటి క్రేజ్ వుందో వేరే చెప్పనక్కర్లేదు. ఈ సినిమాకు సంబంధించిన ఏ చిన్న వార్త బయటికొచ్చినా సంచలనంగా మారుతోంది. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు జ్యోతిక, కాజల్ అగర్వాల్, సమంత నటిస్తారన్న విషయం ఇపుడు చర్చనీయాంశమైంది. స్టార్ హీరోయిన్లయిన కాజల్, సమంత కాంబినేషన్ స్క్రీన్‌మీద ఎలా ఉండబోతోంన్నది ఆసక్తికరంగా మారింది.

12/28/2016 - 21:32

ఒకప్పుడు గ్లామర్ భామగా ఇమేజ్ తెచ్చుకుని తమిళంలో టాప్ హీరోయిన్‌గా వెలుగొందిన ఖుష్బూ.. ఆ తరువాత సెకండ్ ఇన్నింగ్ మొదలుపెట్టి అక్క, చెల్లి పాత్రల్లో నటిస్తోంది. ఆమధ్య మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘స్టాలిన్’ చిత్రంలో కనిపించిన ఖుష్బూ ఇపుడు పవన్‌కళ్యాణ్ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పిందట.

Pages