S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/01/2016 - 00:57

సర్వమంగళం అనే పిరికివాడు క్రమంగా ధైర్యాన్ని కూడకట్టుకొని సర్వేష్‌గా ఎలా మారాడు అన్న అంశంతో రూపొందిన జయమ్ము నిశ్చయమ్మురా చిత్రం ప్రేక్షకులకు అనిర్వచనీయమైన అనుభూతిని ఇస్తోందని దర్శకుడు శివరాజ్ కనుమూరి తెలిపారు. శ్రీనివాసరెడ్డి, పూర్ణ జంటగా ఎస్‌ఆర్‌ఎఫ్ పతాకంపై సతీష్ కనుమూరితో కలిసి స్వీయ దర్శకత్వంలో శివరాజ్ కనుమూరి రూపొందించిన జయమ్ము నిశ్చయమ్మురా చిత్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే.

11/29/2016 - 21:49

బాలకృష్ణ కథానాయకుడిగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. చిత్రానికి సంబంధించిన కార్యక్రమాలు శరవేగంగా సాగుతోంది. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించిన పాటలను డిసెంబర్ 16న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

11/29/2016 - 21:47

రామచరణ్, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో అల్లు అరవింద్, ఎన్.వి.ప్రసాద్ సంయుక్తంగా రూపొందించిన చిత్రం ధ్రువ. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని డిసెంబర్ 9న విడుదలకు సిద్ధమైంది. కాగా డిసెంబర్ 4న చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుకను జరపనున్నారు.

11/29/2016 - 21:45

విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా రూపొందిస్తున్న ‘గురు’ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేశారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. తమిళంలో విజయవంతమైన ‘ఇరుదుసుత్రు’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేశారు. తమిళంలో దర్శకత్వం వహించిన సుధా కొంగర తెలుగులోనూ నేతృత్వం వహించడం విశేషం. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు కూడా చేపట్టనున్నారు.

11/29/2016 - 21:43

పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ హీరోగా నటిస్తున్న ‘కాటమరాయుడు’ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ లేటెస్టుగా ప్రారంభం అయింది. భారీ అంచనాలమధ్య విడుదలై ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ సినిమా భారీ పరాజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాతో ఎలాగైనా సరే మంచి హిట్ కొట్టాలనే దిశగా ప్లాన్ చేస్తున్నాడు పవన్.

11/29/2016 - 21:38

భక్తిరస సినిమాలతో ఆకట్టుకున్న నాగార్జున ప్రస్తుతం ‘ఓం నమో వేంకటేశాయ’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుంది. ఫిబ్రవరిలో విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమా తరువాత మొదటిసారి థ్రిల్లర్ నేపథ్యంలో నటిస్తున్నాడు నాగ్. ‘రాజుగారి గది-2’ పేరుతో రూపొందే ఈ చిత్రం ఇటీవలే ప్రారంభం అయింది. నాగార్జున ఓ పవర్‌ఫుల్ మంత్రగాడిగా కనిపిస్తాడని అంటున్నారు.

11/29/2016 - 21:36

నవీన్ చంద్ర, పృధ్వీ, సలోని, శృతిశోధి ప్రధాన తారాగణంగా శ్రీ సత్య సాయి ఆర్ట్స్ పతాకంపై ఇ.సత్తిబాబు దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ రూపొందిస్తున్న చిత్రం ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి డిసెంబర్ 23న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

11/29/2016 - 21:50

విశ్వదేవ్ రాచకొండ, పునర్నవి భూ పాలం జంటగా సురేష్ ప్రొడక్షన్స్, సన్‌షైన్స్ సినిమాస్ పతాకాలపై అనుదీప్ కె.వి. దర్శకత్వంలో దినేష్‌కుమార్, రాంమోహన్.పి రూపొందించిన చిత్రం ‘పిట్టగోడ’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదలకు సిద్ధం చేశారు.

11/29/2016 - 21:31

పలు భాషల్లో సొంత అన్నదమ్ములైన హీరోలు, తండ్రీకొడుకుల సరసన కూడా కొందరు హీరోయిన్లు నటించిన సందర్భాలున్నాయి. తాజాగా టాలీవుడ్‌లో కూడా పవన్ సరసన ‘సర్దార్ గబ్బర్‌సింగ్’లో నటించిన కాజల్ అగర్వాల్ ప్రస్తుతం ఆయన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఖైదీ నెంబర్ 150’లో హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ భామ చిరు తనయుడు రామ్‌చరణ్‌తో కూడా పలు చిత్రాలలో నటించడం విశేషం.

11/29/2016 - 21:29

‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాతో మరో హిట్‌ని తన ఖాతాలా వేసుకున్నాడు యువ హీరో నిఖిల్. ప్రయోగాత్మక సినిమాలతో ఆకట్టుకుంటున్న నిఖిల్ నెక్స్ట్ పెళ్లికి రెడీ అయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే నిఖిల్ పేరెంట్స్.. అమ్మాయిని వెదికే పనిలో పడ్డారట. ఇక తెలుగులో హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్న నిఖిల్, నెక్స్ట్ తమిళ సినిమా చేయాలనే ఆసక్తితో వున్నట్టు సమాచారం. ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయట.

Pages