S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/03/2016 - 20:56

చాలాకాలంగా మెగా ఫామిలీ అభిమానులు ఎదురుచూస్తున్న ఓ అరుదైన సంఘటన హైదరాబాద్‌లో జరిగింది. కొంతకాలంగా అన్నలకు దూరంగా తమ్ముడు పవన్‌కల్యాణ్ ఉంటున్న సంగతి తెలిసిందే. మధ్యలో ఒకటి రెండుసార్లు వారు కలిసి కలివిడిగా మాట్లాడుకున్నా అంతా ఒక్కటే అన్న భావన అభిమానులకు కలిగించలేకపోయారు.

11/03/2016 - 20:54

‘విక్కీడోనర్ సినిమా చూసినపుడు షాక్ తగిలింది. మన తెలుగువాళ్లు ఇలాంటి కథలను ఒప్పుకుంటారా అని అనిపించింది. ఒకప్పుడు సిగరెట్ తాగడం నేరం. అలా తాగేవాళ్లు ఇలా దాచుకునేవారు. ఆ తరువాత అది మామూలైపోయింది. మందు తాగడం కూడా వహ్వా అనుకునేవారు. ఇప్పుడెవరైనా తాగరూ అంటే హీనంగా చూస్తున్నారు’ అని నటుడు తనికెళ్ల భరణి తెలిపారు. సుమంత్ కథానాయకుడిగా మల్లిక్‌రామ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నరుడా డోనరుడా’.

11/03/2016 - 20:52

సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మరో షెడ్యూల్ హైదరాబాద్‌లో మొదలైంది. క్రేజీ దర్శకుడు మురగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తిచేసుకుంది. ఇక మహేష్ కెరీర్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా ఇటీవలే అహ్మదాబాద్‌లో ఓ షెడ్యూల్ పూర్తిచేసుకుంది.

11/03/2016 - 20:50

బల్వాన్, ప్రాచి అధికారి జంటగా కృష్ణమోహన్ దర్శకత్వంలో వైష్ణవి మూవీస్, సోహాబ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై సునీల్ సాగర్ రూపొందిస్తున్న యాక్షన్ చిత్రం ‘నైజాం పిల్లోడు’ (వీడు మహా మాస్‌గాడు). ఈ చిత్రానికి సంబంధించిన టాకీపార్ట్ 60 శాతం పూర్తిచేశారు.

11/03/2016 - 20:48

పృధ్వీ, నవీన్‌చంద్ర హీరోలుగా, సలోని, శృతి సోధి హీరోయిన్లుగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధామోహన్, ఇ.సత్తిబాబు కాంబినేలో నిర్మిస్తున్న చిత్రం ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షూటింగ్ పూర్తయింది. ఈనెలలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

11/03/2016 - 20:47

చెలిమి విజన్ పతాకంపై రంగస్థల కళాకారులతో పి.ఎం.సుందరరావు స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘మహాత్మా జ్యోతిరావు పూలే’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈనెల చివరి వారంలో విడుదల చేయనున్నారు. కాగా సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేశారు. తెలుగులో తొలిసారిగా పూలే జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం అందరికీ నచ్చుతుందన్నారు.

11/03/2016 - 20:45

అందాలు ఎలా ఆరబోయాలో ఈమెకు తెలిసినట్టు మరెవరికీ తెలియదేమో! అందుకే అవకాశం దొరికినప్పుడల్లా రెచ్చిపోతోంది. ఈ విషయంలో హాలీవుడ్ హీరోయిన్స్ స్టయిలే వేరు. ఇక హాలీవుడ్ నుండి సౌత్‌లో హీరోయిన్‌గా అడుగుపెట్టిన అమీ జాక్సన్ ఈ విషయంలో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పటికే చాలాసార్లు హాట్ ఫోజులతో కుర్రకారును కిర్రెక్కించిన అమీ ఇప్పుడు మరోసారి విజృంభించింది. టాప్‌లెస్ ఫోజులో రెచ్చగొట్టింది.

11/02/2016 - 21:23

విశాల్, తమన్నా జంటగా హరివెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై జి.హరి అందిస్తున్న చిత్రం ఒక్కడొచ్చాడు. సురాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలో భాగంగా డబ్బింగ్ జరుపుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. జగపతిబాబు, బ్రహ్మానందం డబ్బింగ్ పూర్తిచేశారని, ఈనెల 7న ఆడియోను, 18న సినిమాను విడుదల చేయనున్నామని తెలిపారు.

11/02/2016 - 21:20

శివకార్తికేయన్, కీర్తి సురేష్ జంటగా 24ఎంఎం స్టూడియోస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రాజు, డి.ఆర్.రాజా అందిస్తున్న చిత్రం ‘రెమో’. భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను, థియేటర్ ట్రైలర్‌ను హైదరాబాద్‌లో నటి సమంత విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..

11/02/2016 - 21:34

తమిళంలో విజయవంతమైన ‘తరకప్పు’ చిత్రాన్ని తెలుగులో ‘ఈ చరిత్ర ఇంకెన్నాళ్లు’గా అనువదించారు. వి.జె.వై.ఎస్.ఆర్. ఆర్ట్స్ పతాకంపై వై.శేషిరెడ్డి సమర్పణలో రూపొందించిన ఈ చిత్రానికి రవి దర్శకత్వం వహించారు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 4న విడుదలకు సిద్ధమైంది.

Pages