S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

10/02/2016 - 21:27

చక్కని ప్రేమకథా చిత్రంగా రూపొందిన ‘నీ జతలేక’ విడుదలై అన్ని కేంద్రాలలో భారీ ఓపెనింగ్స్ సాధించి సూపర్‌హిట్‌గా నిలుస్తోందని నిర్మాతలు జి.వి.చౌదరి, నాగరాజ్‌గౌడ్ చిర్రా తెలిపారు. నాగశౌర్య, పారుల్ యాదవ్, సరయు ప్రధాన పాత్రధారులుగా సత్యవిదుర మూవీస్ పతాకంపై లారెన్స్‌దాసరి దర్శకత్వంలో రూపొందించిన ‘నీ జతలేక’ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన విజయోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌లో నిర్వహించారు.

10/02/2016 - 21:25

‘ఏమైంది ఈవేళ’, రచ్చ, బెంగాల్ టైగర్ సినిమాలతో కమర్షియల్ డైరెక్టర్‌గా మంచి పేరుతెచ్చుకున్న సంపత్‌నంది, తాజాగా హీరో గోపీచంద్‌తో ఓ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే పక్కాగా ప్రీప్రొడక్షన్ పూర్తిచేసుకున్న టీమ్ నేడు సెట్స్‌పైకి వెళ్ళింది. ఫస్ట్ షెడ్యూల్ థాయ్‌లాండ్‌లో భారీ యాక్షన్ సన్నివేశాలతో జరగనుంది.

10/02/2016 - 21:23

క్రేజీ భామ శ్రుతిహాసన్ ఈమధ్య బాలీవుడ్‌పైనే ఎక్కువ ఫోకస్ చేస్తోంది. కమల్‌తో ‘శభాష్‌నాయుడు’, పవన్‌కల్యాణ్‌తో ‘కాటమరాయుడు’ చిత్రాల్లో మాత్రమే నటిస్తోంది. బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా వెలగాలనే ఈ అమ్మడి ఆశ నెరవేరేలా కలిసిరావడంలేదు. గ్లామర్‌కు పెద్దపీట వేసి ఎలాంటి అడ్డంకులు లేకుండా అందాలు ఆరబోయడంలో ఆమెకు సాటి ఎవరూ లేరు.

10/01/2016 - 20:58

టీమిండియా కెప్టెన్ జీవితకథ ఆధారంగా నిర్మించిన ‘ఎం.ఎస్.్ధని-ద అన్‌టోల్డ్ స్టోరీ’ సినిమాను పాకిస్తాన్‌లో ప్రదర్శించడం లేదు. కాశ్మీర్‌లోని ఉరీ సైనికశిబిరంపై ఇటీవల జరిగిన ఉగ్రవాదుల దాడి అనంతరం ఏర్పడిన పరిణామాల నేపథ్యంలో ఆ సినిమాను ప్రదర్శించడం లేదని ప్రఖ్యాత సినీడిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఐఎంజిఎల్ గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ తెలిపింది.

10/01/2016 - 20:57

రామ్.. ఎనర్జిటిక్ హీరోగా టాలీవుడ్‌లో మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు. కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరోవైపు ప్రయోగాలు కూడా చేస్తూ నిరూపించుకుంటున్నాడు. లేటెస్టుగా ‘నేను శైలజ’తో మంచి హిట్ అందుకున్న రామ్ ఇప్పుడు ‘హైపర్’గా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రెడీ అయ్యాడు. ‘కందిరీగ’, ‘రభస’ సినిమాలు రూపొందించిన సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో 14 రీల్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం ఈనెల 30న విడుదలకు సిద్ధం అయింది.

10/01/2016 - 20:55

హాస్య కథా చిత్రాలతో మెప్పిస్తూన్న అల్లరితో హీరోగా పరిచయం అయిన అల్లరి నరేష్ కెరీర్ పరంగా స్టార్ హీరో అయ్యేందుకు వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతోన్న నరేష్, వ్యక్తిగత జీవితంలో తండ్రి హోదా పొందారు. తాను ఓ ఆడబిడ్డకు తండ్రినయ్యానన్న విషయాన్ని అల్లరి నరేష్ స్వయంగా తెలియజేస్తూ తన ఆనందాన్ని పంచుకున్నారు. గతేడాది మే నెలలో చెన్నైకి చెందిన విరూపను అల్లరి నరేష్ పెళ్లాడిన విషయం తెలిసిందే.

10/01/2016 - 20:54

గణేష్, మంజరి, మాళవిక ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘జర్నీ-2’. జయలక్ష్మీ ఆర్ట్స్ పతాకంపై చిగులూరి గంగాధరరావుచౌదరి నిర్మిస్తున్నారు. ఎస్.నారాయణ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. సీనియర్ పాత్రికేయులు పసుపులేటి రామారావు ఆడియో సీడీలను విడుదల చేసి తొలి సీడీని నిర్మాత బి.ఎ.రాజుకు అందించారు.

10/01/2016 - 20:51

సౌత్‌లో స్టార్ హీరోయిన్లలో ఒకరైన కాజల్ తెలుగు, తమిళంలో పెద్ద పెద్ద ప్రాజెక్టులతో బిజీగా వుంది. ప్రస్తుతం ఈమె తెలుగులో మెగాస్టార్ సరసన ఖైదీ నెం.150తోపాటు తమిళంలో స్టార్ హీరో అజిత్ 57వ చిత్రంలోనూ అలాగే మణిరత్నం డైరెక్షన్‌లో జీవ హీరోగా రూపొందుతున్న ‘కావలై వెండం’సినిమాలోనూ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇన్ని భారీ ప్రాజెక్టులుచేస్తున్న ఈమెను మరో పెద్ద ఆఫర్ వరించినట్టు తెలుస్తోంది.

10/01/2016 - 20:49

సంపత్ నంది దర్శకత్వంలో ‘బెంగాల్ టైగర్’చిత్రం చేసిన రవితేజ ఆ చిత్రం అంత మంచి ఫలితాన్ని ఇవ్వకపోవడంతో మరో సినిమా చేయడానికి చాలా గ్యాప్ తీసుకున్నారు. అంత గ్యాప్ తరువాత ప్రస్తుతం ఈయన రెండు కొత్త సినిమాలకు కమిటయ్యారు. అందులో ఒకటి దర్శకుడు బాబీతో చేయనున్నాడు. కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్‌గా ఉండబోతున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 12న దసరా సందర్భంగా మొదలుపెట్టనున్నారు.

10/01/2016 - 20:47

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, తెలంగాణ తొలి సినిమా హీరో, నటుడు, నిర్మాత, దర్శకుడు పైడి జయరాజ్ 107వ జయంతి వేడుకలు బుధవారం ఫిలిం ఛాంబర్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాత ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ- తెలంగాణలో మొదటి తరం నటుడు పైడి జయరాజ్ ఆ రోజుల్లోనే ఆయన ముంబైకి వెళ్లి అక్కడ హీరోగా ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు సినిమా చరిత్రలో ఆయన పేరు వినిపించడం లేదు.

Pages