S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/01/2016 - 21:03

రజిత్, షామిలి ప్రధాన తారాగణంగా వశిష్ట సినీ అకాడమీ పతాకంపై రాము దర్శకత్వంలో ప్రభాత్ వర్మ రూపొందిస్తున్న చిత్రం ‘శ్రీరామరక్ష’. ఈ చిత్రానికి సంబంధించిన టాకీపార్ట్ పూర్తిచేశారు.

09/01/2016 - 20:54

నిఖిల్‌కుమార్ కధానాయకుడిగా చెన్నాంబికా ఫిలింస్ పతాకంపై ఎ.మహదేవ్ దర్శకత్వంలో అనితా కుమారస్వామి రూపొందిస్తున్న చిత్రం ‘జాగ్వార్’. ఈ చిత్రంకోసం ఇటీవల బల్గేరియాలో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ టీజర్‌కు మంచి రెస్పాన్స్ లభిస్తోందని తెలిపారు.

08/31/2016 - 21:01

అల్లుఅర్జున్, కాజల్ అగర్వాల్ ఆర్య-2లో నటించి మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. మళ్లీ ఈ రొమాంటిక్ పెయిర్‌ని ఒకే ఫ్రేమ్‌లో చూసే అవకాశం ఫ్యాన్స్‌కు దక్కనుందని టాక్. ప్రస్తుతం అల్లు అర్జున్, హరీష్‌శంకర్ కాంబినేషన్‌లో ‘డీజే’-దువ్వాడ జగన్నాథమ్ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్‌గా కాజల్‌ను ఎంపిక చేస్తే బాగుంటుందని టీమ్ భావిస్తోంది.

08/31/2016 - 20:59

గ్లామర్ భామ రెజీనా ఈమధ్య మళ్లీ జోరుపెంచింది. ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో ‘నక్షత్రం’ చిత్రంలో నటిస్తున్న ఈ భామ ఇప్పటికే ‘జ్యో అచ్యుతానంద’ సినిమా కంప్లీట్ చేసింది. దాంతోపాటు తెలుగులో మరో సినిమాకు కూడా ఓకే చెప్పింది. ఇక తమిళంలో రెండు సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అప్పట్లో సంచలనం క్రియేట్ చేసిన ‘అంకెన్’ చిత్రానికి సీక్వెల్‌గా ‘అంకెన్ 2’లో నటిస్తోంది.

08/31/2016 - 20:58

స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన త్రిషకు సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినప్పటినుండి సినిమాలు వస్తున్నాయి కానీ హిట్ మాత్రం దక్కడంలేదు. కనీసం ‘నాయకి’తో అయినా భయపెట్టి హిట్ కొట్టాలని ప్రయత్నించినా లాభం లేకుండాపోయింది. దాంతో ఇంకాస్త స్లిమ్‌గా మారి జిమ్‌లో కష్టపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ భామకు ఓ క్రేజీ అవకాశం దక్కింది.

08/31/2016 - 20:56

శోభిత ధూళిపాళ అచ్చ తెలుగమ్మాయి అన్న సంగతి అందరికీ తెలిసిందే. తెలుగమ్మాయిలు తెలుగు సినిమాల్లో పనికిరారనే మాట ఎలాగూ ఉంది. అందుకే ఈమె బాలీవుడ్‌లో ప్రయత్నాలు చేసింది. అనురాగ్ కశ్యప్ లాంటి పెద్ద దర్శకుడిని మెప్పించి.. ‘రమణ్‌రాఘవ్ 2.0’లో అవకాశం దక్కించుకున్న శోభిత.. ఆ సినిమాలో అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలందుకుంది.

08/31/2016 - 20:54

శ్రీ, నాగబాబు, రవిబాబు ప్రధాన తారాగణంగా అమీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో క్రాంతికుమార్ రూపొందించిన చిత్రం ‘త్రివిక్రమన్’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. సినిమా ట్రైలర్‌ను కనుమూరి రఘురామకృష్ణరాజు విడుదల చేశారు. టైటిల్ లోగోను ధర్మశాస్త్ర పీఠాధిపతి గుంతుపల్లి శ్రీనివాసరావు ఆవిష్కరించారు.

08/31/2016 - 20:53

రామ్‌చరణ్ హీరోగా నటిస్తోన్న ‘ధ్రువ’ సినిమా దసరా కానుకగా అక్టోబర్ మొదటివారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. ఈమధ్యే విడుదలైన ఫస్ట్‌లుక్‌కు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో ఉబ్బితబ్బిబ్బవుతున్న టీమ్, ఫస్ట్ టీజర్‌ను కూడా త్వరలోనే విడుదల చేయాలని భావిస్తోంది. సెప్టెంబర్ 5న వినాయకచవితి సందర్భంగా ఈ ఫస్ట్ టీజర్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

08/31/2016 - 20:51

ప్రయోగాత్మక సినిమాల హీరో విక్రమ్ తాజాగా చిత్రం ‘ఇంకొక్కడు’ (తమిళ్‌లో ఇరుముగన్) పేరుతో మరో ప్రయోగాత్మక సినిమాను విడుదలకు సిద్ధం చేశారు. తెలుగులో ‘ఇంకొక్కడు’ పేరుతో డబ్ అవుతోన్న ఈ సినిమా తమిళ వర్షన్‌కు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సినిమాకు యూ/ఏ సర్ట్ఫికెట్ జారీ చేసింది.

08/31/2016 - 20:49

అలనాటి అద్భుతమైన పాటల స్వరకర్త, సంగీత దర్శకుడు సత్యం మనవడిగా వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని, తనకంటూ ఓ శైలిని ఏర్పరచుకుని సంగీతాన్ని అందిస్తున్నాడు డి.జె.వసంత్. ‘మడతకాజా’ సినిమాతో ప్రారంభమైన ఆయన కెరీర్, సుడిగాడు, స్పీడున్నోడు చిత్రాల తరువాత ఊపందుకుంది. ప్రస్తుతం ఆర్.జె. సినిమాస్ పతాకంపై జయ.బి దర్శకత్వంలో నిర్మాత బి.ఎ.రాజు అందిస్తున్న ‘వైశాఖం’ చిత్రానికి ఆయన సంగీతం అందిస్తున్నారు.

Pages