S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/03/2016 - 21:51

మెగా ఫ్యామిలీనుండి మరో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అల్లు శిరీష్. ‘గౌరవం’ సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన శిరీష్, ఆ తరువాత కొత్తజంట చిత్రంలో నటించాడు. కొంత గ్యాప్ తరువాత ఆయన నటించిన చిత్రం ‘శ్రీరస్తు శుభమస్తు’. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 5న విడుదలవుతున్న సందర్భంగా అల్లు శిరీష్‌తో ఇంటర్వ్యూ..
‘కొత్తజంట’ తరువాత ఎక్కువ గ్యాప్?

08/03/2016 - 21:47

ఆనంద్ కృష్ణ, శిల్ప జంటగా సూర్యకిరణ్ ఇలాది దర్శకత్వంలో నీలిమ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కే చిత్రం బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ క్లాప్‌నివ్వగా, ప్రతాని రామకృష్ణగౌడ్ గౌరవ దర్శకత్వం వహించారు.

08/02/2016 - 21:12

సునీల్ కెరీర్‌లో భారీ ఓపెనింగ్స్ దక్కించుకున్న చిత్రం ఇదని అంటున్నాడు దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ల. ‘రక్ష’ సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన, తాజాగా సునీల్, మన్నారాచోప్రా జంటగా నటించిన ‘జక్కన్న’ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రం ఇటీవల విడుదలై మంచి టాక్‌తో రన్ అవుతోన్న సందర్భంగా దర్శకుడు వంశీకృష్ణ చెప్పిన విశేషాలు..
మంచి స్పందన

08/02/2016 - 21:10

పవన్‌కళ్యాణ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా జరుగుతున్నాయి. ఎస్.జె.సూర్య దర్శకత్వంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రం, సూర్య తప్పుకోవడంతో ఆగిపోయింది. ఆ తరువాత ‘గోపాల గోపాల’ ఫేం డాలీ ఎంట్రీ ఇవ్వడంతో మళ్లీ సినిమా ఊపందుకుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయని, ఈనెలలోనే సెట్స్‌పైకి వెళ్లనుందని తెలిసింది.

08/02/2016 - 21:09

కన్నడలో ఘనవిజయం సాధించిన ‘నాని’ చిత్రాన్ని తెలుగులో ‘శివగామి’గా విడుదల చేస్తున్నారు నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ. భీమవరం టాకీస్ పతాకంపై మనీష్ ఆర్య, ప్రియాంకారావు, బేబి సుహాసిని తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సుమంత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ప్లాటినమ్ డిస్క్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది.

08/02/2016 - 21:07

నందమూరి తారకరత్న, శిల్ప, యామినీ హీరో హీరోయిన్లుగా వి.సముద్ర దర్శకత్వంలో ఎల్.వి.ఆర్. ప్రొడక్షన్స్ పతాకంపై లగడపాటి శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రం ‘కాకతీయుడు’. త్వరలోనే విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు సముద్ర మాట్లాడుతూ, సమాజానికి ఉపయోగపడే చిత్రమిదని అన్నారు.

08/02/2016 - 21:06

కొత్తదనంకోసం ప్రయత్నించే నటుల గురించి చెప్పాలంటే ముందుగా కోలీవుడ్డే గుర్తుకొస్తుంది. విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కమల్‌హాసన్ తరువాత ఆ స్థాయిలో ప్రయోగాలు చేస్తున్న నటుడు విక్రమ్. ఇప్పటికే పలు రకాల పాత్రలు పోషించి ఆకట్టుకున్న విక్రమ్, తాజాగా నటిస్తున్న చిత్రం ‘యిరుమగన్’. తెలుగులో ‘ఇంకొక్కడు’ పేరుతో విడుదలవుతున్న ఈ చిత్రంలో నయనతార, నిత్యామీనన్‌లు హీరోయిన్లు.

08/02/2016 - 21:01

మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న ‘ఒక్కడు మిగిలాడు’ చిత్ర షూటింగ్ విశాఖలో జరుగుతోంది. చిత్ర నిర్మాత, జూ.ఆర్టిస్టు ఏజెంట్లమధ్య నగదు చెల్లింపు విషయంలో వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో నిర్మాతపై ఏజెంట్లు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పరవాడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. విశాఖ జిల్లా పరవాడ మండలం, ముత్యాలమ్మ పాలెంలో ఈ సినిమా కోసం భారీ సెట్‌ను రూపొందించారు. అక్కడ షూటింగ్ జరుపుతుండగా, దీనికోసం కావాల్సిన జూ.

08/02/2016 - 20:59

దీక్షాపంత్, ధన్‌రాజ్, షకలక శంకర్ ముఖ్యపాత్రల్లో నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్శకత్వంలో ఉజ్వల క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘బంతిపూల జానకి’. ఈ చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రామ్ సీడీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ రెజీనా, నందినిరెడ్డి, తనీష్, సంపూర్ణేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

08/02/2016 - 20:58

జురాసిక్ పార్క్, జాస్, ఇండియాజోన్స్ వంటి చిత్రాల సృష్టికర్త స్టీవెన్ స్పిల్‌బెర్గ్ దర్శకత్వంలో వచ్చిన మరో ఫాంటసీ చిత్రం ‘బి.ఎఫ్.జి.’ (ది బిగ్ ఫ్రెండ్లీ జయంట్). డిస్నీ మరియు రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే.

Pages