S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/31/2016 - 21:00

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో హీరో పాత్ర అంటే అదొక ఫ్యాషనబుల్ ఎఫర్ట్ హీరోలకు. అతని దర్శకత్వంలో ఒక్కసారైనా నటించాలని అనుకోని హీరో వుండడు. ప్రస్తుతం పూరి కళ్యాణ్‌రామ్‌తో ‘ఇజం’ రూపొందిస్తున్నాడు. ఈ చిత్రంలో కళ్యాణ్‌రామ్ గత చిత్రాలకన్నా భిన్నంగా కనిపిస్తాడట. హెయిర్‌స్టైల్ నుంచి ప్రతి విషయంలోనూ కొత్తదనాన్ని చూపించే పూరి ఈ చిత్రంలో కళ్యాణ్‌రామ్‌ను సిక్స్ ప్యాక్‌లో చూపిస్తుండడం మరో విశేషం.

07/31/2016 - 20:58

లగడపాటి కుటుంబానికి రాజకీయాలు కొత్తకాదు. లగడపాటి రాజగోపాల్ ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించిన రాజకీయ దిగ్గజం. కార్పొరేట్ కింగ్. అయితే ఆయన వారసుడు రాజకీయాల్లోకి వస్తున్నాడు అనగానే అందరికీ అనుమానం రావచ్చు. అయితే వారసుడు అంటే అతని సోదరుని తనయుడు వస్తున్నాడని. అది కూడా రాజకీయాల్లోకి కాదు. సినిమాల్లోకి.

,
07/31/2016 - 20:57

బాలీవుడ్ తారల సొగసు ఫ్యాషన్ షోల మెరుపునిస్తోంది. ఫ్యాషన్‌పై బాలీవుడ్ తారలకు ఉన్న మోజు తక్కువేం కాదు. గర్ల్స్ నైట్ ఔట్ కార్యక్రమానికి ‘్థయరీ’ డ్రెస్‌తో హాజరైన అలియాభట్ అందరినీ ఆకట్టుకుంది. ఇక ‘దిషూమ్’ స్క్రీనింగ్‌కోసం డెయిసీషా ఇచ్చిన ఫోజులు అదరగొట్టేశాయి. మరోతార గువహర్‌ఖాన్ మెరుపులు అందరినీ మైమరిపించాయి.

చిత్రాలు.. డెయిసీషా, అలియాభట్

07/30/2016 - 23:54

అంజలి టైటిల్ పాత్రలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న చిత్రం ‘చిత్రాంగద’. తమిళంలో ‘యార్నీ’ పేరుతో తెరకెక్కుతోన్న ఈ హారిజాంటల్ థ్రిల్లర్ కామెడీ చిత్రానికి అశోక్ దర్శకుడు. శ్రీ విఘ్నేష్ కార్తిక్ సినిమా అండ్ క్రియేటివ్ డ్రావిడన్స్ పతాకంపై గంగపట్నం శ్రీ్ధర్, రెహమాన్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

07/30/2016 - 23:52

రామ్‌శంకర్, నిఖిషా పటేల్ జంటగా వాసుదేవ్ దర్శకత్వంలో మేకా బాలసుబ్రమణ్యం, సురేష్ వర్మ ఇందుకూరి, నక్కా రామేశ్వరి నిర్మిస్తున్న చిత్రం ‘అరకురోడ్‌లో’. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా హీరో రామ్‌శంకర్ మాట్లాడుతూ,‘ ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్రిల్లర్ కథాంశంగా తెరకెక్కే ఈ సినిమా అందరికీ నచ్చుతుందన్న నమ్మకం ఉంది.

07/30/2016 - 23:50

ఆదర్శ్‌బాబు, పావని హీరో హీరోయిన్లుగా శ్రీ ఓం డి క్రియేషన్స్ పతాకంపై అజ్మేర చందు దర్శకత్వంలో ఎఎస్ రావు నిర్మిస్తున్న యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘నాన్న.. నేను.. వర్ష’. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు అజ్మేర చందు చిత్ర విశేషాలను తెలిపారు.

07/30/2016 - 23:48

ఎన్నాళ్ల నుంచో కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రానికి సంబంధించి ఇటీవల పలురకాల ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్ ఎవరంటూ ఎవరెవరో పేర్లు వినిపించాయి. విజయశాంతిని కూడా వదలకుండా ఆమే హీరోయిన్ అన్న మాటలు సైతం వినిపించాయి. ఎట్టకేలకు చిరు అభిమానుల్లో ఉత్కంఠకు ఫుల్‌స్టాప్ పడింది. చిరు సరసన కాజల్ నటిస్తోంది.

07/30/2016 - 23:42

రాజ్ విరాట్ హీరోగా రెయిన్‌బో పిక్చర్స్ బ్యానర్‌పై రాజేష్‌కుమార్.బి దర్శకుడిగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘లవ్ మిసైల్’. జికెఆర్, రాజేంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ జరుపుతున్నారు. దర్శకుడు రాజేష్‌కుమార్.బి మాట్లాడుతూ,‘ ప్రతి వ్యక్తికి ఏదో రకమైన ఓ ఫోబియా (్భయం) వుంటుంది. ఏ ఫోబియా లేని వ్యక్తి జీవనశైలి ఎలా వుంటుందనే కథాంశంతో చిత్రం రూపొందిస్తున్నాన్నారు.

07/30/2016 - 23:40

సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామ్ కథానాయకుడిగా రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంద్, అనీల్ సుంకర రూపొందిస్తున్న తాజా చిత్రానికి ‘హైపర్’ ( ట్యాగ్ లైన్.. ప్రతి ఇంట్లో ఒకడుంటాడు) టైటిల్‌ను ఖరారుచేశారు. ఈ చిత్రం షూటింగ్ సందర్భంగా దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ మాట్లాడుతూ, ‘ఇందులో హీరో పాత్ర హైపర్‌గా వుంటుందని అందుకు తగ్గట్టుగా ఈ పేరును ఖరారు చేశాం.

07/30/2016 - 23:20

జి.వి.ప్రకాష్ కుమార్ కథానాయకుడిగా నటిస్తూ, సంగీతం అందిస్తున్న చిత్రం ‘నాకు ఇంకో పేరుంది’. శ్యామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ దీన్ని నిర్మిస్తోంది. ‘త్రిష లేదా నయనతార’ చిత్రంలో జి.వి. ప్రకాష్ సరసన నటించిన ఆనంది ఇందులో కథానాయిక. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా జివి ప్రకాష్ మాట్లాడుతూ, ‘యాక్ష న్, కామె డీ ఎంటర్‌టైనర్ ఇది.

Pages